సినిమా క్విజ్-33

0
10

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కన్నడంలో డా. రాజ్‍కుమార్, జయంతి, భారతిలు నటించిన ‘బాళు బెళగితు’ (1970) చిత్రాన్ని తెలుగులో వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచనలు నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. అక్కినేని నాగేశ్వరరావు గారి తొలి చిత్రం ఏది?
  3. హిందీలో ప్రకాశ్ మెహ్రా అమితాభ్ బచ్చన్, వినోద్ ఖన్నా, అంజాద్ ఖాన్‍లతో తీసిన – ‘ముకద్దర్ కా సికందర్’ (1978) చిత్రాన్ని – కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధలతో ఏ పేరుతో తెలుగులో తీశారు?
  4. చిత్రకార్ దర్శకత్వంలో వసంత్ చౌదరి, రబిఘోష్ నటించిన ‘ఉత్తర్ పురుష్’ (1966) బెంగాలీ చిత్రం – అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, రాధికలతో – ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో – తెలుగులో ఏ పేరుతో రీమేక్ అయింది?
  5. సత్యన్, ప్రేమ్ నజీర్, కె. ఆర్. విజయలు నటించిన మలయాళ చిత్రం ‘ఓడాయిల్ నిన్ను’ – తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, మంజుల నటించగా, ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. ‘ది డే ఆఫ్ ది జాకల్’ అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో – పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, నూతన్ ప్రసాద్‍లు నటించగా ఏ పేరుతో తెలుగులో వచ్చింది?
  7. ‘చెంబారతి’ అనే మలయాళ చిత్రాన్ని జగ్గయ్య హీరోగా కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో ఏ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు?
  8. నందమూరి బాలకృష్ణ నటించిన ‘నిప్పు లాంటి మనిషి’ చిత్రానికి మూలమైన హిందీ చిత్రం పేరు?
  9. నటుడు నూతన్ ప్రసాద్ అసలు పేరు?
  10. సుభాష్ ఘయ్ – శతృఘ్నసిన్హా హీరోగా ‘కాళీచరణ్’ అనే హిందీ చిత్రం నిర్మించారు. తెలుగులో శోభన్‍బాబుతో ఈ సినిమాని ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఏప్రిల్ 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 33 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఏప్రిల్ 30 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 31 జవాబులు:

1.బహురాణి 2. ఖైదీ బాబాయ్ 3. పోకిరి రాజా 4. విక్రమ్ 5. రామ్ రాబర్ట్ రహీం 6. జీవన పోరాటం 7. సుమంగళి (1989) 8. బిల్లా 9. అండమాన్ కాదలి 10. సవాలే సమాళి

సినిమా క్విజ్ 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • కొన్నె ప్రశాంత్
  • ప్రవళి
  • సౌజన్య

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here