సినిమా క్విజ్-36

0
10

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘వెలుగు నీడలు’ చిత్రం ఏ బెంగాలీ నవల ఆధారంగా తెలుగులో తీయబడింది?
  2. సుభాష్ ఘయ్ దర్శకత్వంలో రిషీకపూర్, ప్రాణ, తమన్నా, సిమిలు నటించిన ‘కర్జ్’ అనే హిందీ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ, భానుప్రియతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  3. ‘చిట్టి అమ్మలు, చిట్టి నాన్నలు’, ‘సోగ్గాడే చిన్ని నాయనా, ఒక్క పిట్టనైన కొట్టలేని సోగ్గాడే’ అనే పాటలున్న అక్కినేని నాగేశ్వరరావు, జయలలితలు నటించిన తెలుగు చిత్రం ఆధారం రూపొందిన తమిళ చిత్రం ఏది? తమిళంలో శివాజీ గణేశన్, బి. సరోజాదేవి నటించారు.
  4. శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు హీరోగా, ఖుష్బూ హీరోయిన్‍గా నటించిన ‘చిన్నతంబి’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, మీనాలతో ఏ పేరుతో తీశారు? (క్లూ. దర్శకుడు రవిరాజా పినిశెట్టి)
  5. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి నటించిన ‘జమీందార్’ చిత్రానికి ఏ ఆంగ్ల చిత్రం ఆధారం?
  6. నసీరుద్దీన్ షా, కిమి కట్కర్, రిషీకపూర్‍లతో రాంసే బ్రదర్స్ హిందీలో ‘ఖోజ్’ సినిమా తీశారు. దీన్ని తెలుగులో నరేష్, రంజనీ, మోహన్‍ గార్లతో హరి అనుమోలు దర్శకత్వంలో ఏ పేరుతో తీశారు?
  7. తమిళంలో కె.ఎస్. గోపాలకృష్ణన్ దర్శకత్వంలో జెమినీ గణేశన్, బి. సరోజాదేవి నటించిన ‘పణమా? పాశమా?’ చిత్రం ఆధారంగా తెలుగులో కృష్ణ, వాణిశ్రీలతో తీసిన సినిమా (1969) ఏది?
  8. విష్ణువర్ధన్, అంబరీష్, లక్ష్మి నటించిన కన్నడ చిత్రం ‘అవళ హెజ్జె’ (1981)ను తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి, లక్ష్మి గార్లతో ఏ పేరిట రీమేక్ చేశారు? (క్లూ: కన్నడంలో దర్శకత్వం వహించిన హెచ్. ఆర్. భార్గవ గారే తెలుగు వెర్షన్‍కి కూడా దర్శకత్వం వహించారు)
  9. సి.వి. రాజేంద్రన్ దర్శకత్వంలో రవిచంద్రన్, అంబిక, అంబరీష్‍లు నటించిన ‘నానే రాజా’ (1984) అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి, విజయశాంతి, భానుప్రియ గార్లతో ఏ పేరిట రీమేక్ చేశారు? (క్లూ: కన్నడంలో దర్శకత్వం వహించిన సి.వి. రాజేంద్రన్ గారే తెలుగు వెర్షన్‍కి కూడా దర్శకత్వం వహించారు)
  10. ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో కన్నడంలో అంబరీష్, జయమాల నటించిన ‘గెలువు నన్నదే’ (1983) చిత్రాన్ని తెలుగులో చిరంజీవి, విజయశాంతి నటించగా ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మే 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 36 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మే 21 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 34 జవాబులు:

1.శోభ 2. అక్కినేని నాగేశ్వరరావు 3. సీతా ఔర్ గీతా 4. ఇద్దరు అమ్మాయిలు 5. లక్ష్మీ నివాసం 6. సచ్చాయి 7. నూతన్ ప్రసాద్ (చలిచీమలు చిత్రం) 8. దీపం 9. రమణారెడ్డి 10. భలే అబ్బాయిలు

సినిమా క్విజ్ 34 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణినాగేంద్రరావు బొండాడ
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రేయ ఎస్. క్షీరసాగర్
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here