సినిమా క్విజ్-45

0
9

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎన్.టి.ఆర్. తీసిన ‘శ్రీకృష్ణపాండవీయం’ చిత్రం లోని ఒక ఘట్టం ‘రుక్మిణీ కళ్యాణం’. ఇందులోని మాటలు పద్యాలు వ్రాసినదెవరు?
  2. దారాసింగ్ హీరోగా హిందీలో తమిళ తెలుగు నటి రాజశ్రీ నటించిన చిత్రం ఏది?
  3. హిందీ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ తెలుగులో ఒకే ఒక్క సినిమా వాణిశ్రీ నాయికగా తీశారు. ఆ చిత్రం పేరు?
  4. దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ కన్నడంలో ‘సహోదర సవాల్’ అన్న సినిమా తీసి, దానిని తెలుగులో కృష్ణ, రజనీకాంత్‍లతో ఏ పేరిట తీశారు?
  5. దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ గారు ఆఖరిసారిగా కమల్ హాసన్ నటించిన ఏ చిత్రంలో కనిపించారు?
  6. కె. బాలచందర్ దర్శకుడిగా తమిళంలో ‘అవర్ ఒరు తోడర్ కథై’ సినిమాలో సుజాత హీరోయిన్ కాగా, కమల్ హాసన్ ‘తాళికట్టు శుభవేళ’ తమిళపాటలో నటించారు. తెలుగులో జయప్రద హీరోయిన్ కాగా, ‘తాళికట్టు శుభవేళ’ పాటను నారాయణరావు పై చిత్రీకరించారు. తెలుగు సినిమా పేరేమిటి?
  7. టి.ఆర్. రామన్న తమిళ నిర్మాత, దర్శకులు. ఆయన ఏకకాలంలో తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి; తెలుగులో ఎన్.టి.ఆర్., సావిత్రి గార్లతో జి. రామనాథన్ సంగీత దర్శకత్వంలో తీసిన సినిమా ఏది?
  8. పద్మా ఫిలింస్ సమర్పణలో, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల – ఏ పేరున సి.ఎస్. రావు దర్శకత్వంలో వచ్చింది? దానిలో ఎన్.టి.ఆర్. పాత్ర పేరు ఏమిటి?
  9. పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల సంగీతంలో వచ్చిన పాట ‘ఎందుకనో నిను చూడగానే ఏదో కావాలంటున్నది’ – జమున, ఎన్.టి.ఆర్. గార్లపై తాపీ చాణక్య చిత్రీకరించిన చిత్రం ఏది?
  10. ఆరుద్ర రచించిన ‘హృదయమా, ఓ బేల హృదయమా, ఒకేసారిగా నీకింత సంతోషమా’ పాటకు పెండ్యాల స్వరాలందించారు. ఘంటసాల, సుశీల పాడారు. పి. ఎ. పద్మనాభరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు?
  11. ప్రస్తుత కాలంలో హీరోయిన్లు అవకాశాలు రాకో, ఇతర కారణాల వల్లో ‘ఐటమ్ సాంగ్స్’ చేస్తున్నారు. కానీ అలనాటి అందాల తార, ఫేమస్ హీరోయిన్ – కాంచన – కథానాయిక పాత్రలు ధరిస్తూనే 1967లో వచ్చిన ఓ చిత్రంలో  ‘ఐటమ్ సాంగ్’ చేశారు. ఎన్.టి.ఆర్. హీరో. సి.ఎస్. రావు దర్శకుడు. సూపర్ హిట్ అయిన ఆ సినిమా ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూలై 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 45 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూలై 23 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 43 జవాబులు:

1.యమపాశం 2. జీవితం 3. దొంగల్లో దొర 4. జగత్ కిలాడీలు 5. మనుషులంతా ఒక్కటే 6. అభిమానం 7. అమాయకుడు 8. మహా సంగ్రామం (1992) 9. జగత్ జెట్టీలు 10. నాలుగు. అవి (అ) మంచి మిత్రులు చిత్రంలో ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ (బి) ఏకవీర చిత్రంలో ‘ప్రతీరాత్రి వసంత రాత్రి’ (సి) దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా’ (డి) నీతి నిజాయితీ చిత్రంలో ‘భలే మజాలే భలే ఖుషీలే’

సినిమా క్విజ్ 43 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శ్రేయా ఎస్. క్షీరసాగర్
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here