సినిమా క్విజ్-5

0
14

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. దక్షిణ భారతదేశంలో (మద్రాసు) నిర్మింపబడిన తొలి తెలుగు చిత్రం ఏది?
  2. తెలుగు దేశంలో స్థాపించబడిన మొట్టమొదటి సినిమా థియేటర్ ఏది?
  3. దక్షిణ భారతదేశంలోని మొదటి ఎయిర్ కండీషన్డ్ థియేటర్ ఏది?
  4. దక్షిణ భారతదేశంలో దర్శకత్వం వహించిన ప్రథమ మహిళ ఎవరు? ఆ సినిమా పేరు ఏమిటి?
  5. తెలుగులో దర్శకత్వం చేసిన మొదటి మహిళ ఎవరు?
  6. తెలుగులో వచ్చిన మొట్టమొదటి సాంఘిక చిత్రం ఏది?
  7. 1942లో వచ్చిన ‘బాలనాగమ్మ’ సూపర్ హిట్ చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
  8. 1947లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో కన్నాంబ ముఖ్యపాత్రలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఏది?
  9. 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘సంసారం’ చిత్రంలోని ‘కల నిజమాయెగా కోరిక తీరగా’ పాట ఏ హిందీ చిత్రంలోని పాటకు కాపీ?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 అక్టోబరు 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 16 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 3 జవాబులు:

1.మహమ్మద్ బీన్ తుగ్లక్ 2. ఎదురీత 3. ఎర్రకోట వీరుడు 4. ఆర్. నాగేంద్రరావు 5. ధర్మా 6. అనార్కలి 7. చైర్మన్ చలమయ్య 8. చిలకా గోరింక 9. నిజం చెబితే నమ్మరు (1973) 10. పెళ్ళిరోజు

సినిమా క్విజ్ 3 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • మణి నాగేంద్రరావు బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

~

(గమనిక: సినిమా క్విజ్ 3లో 9వ ప్రశ్న హిందీ సంగీత దర్శకుడు సి. రామచంద్ర తొలిసారిగా సంగీతం అందించిన తెలుగు చిత్రం ఏది? – కి చాలామంది ప్రశ్నలోని ‘తొలిసారి’ అనేది మిస్ అయి, 1979 నాటి ‘అక్బర్ సలీం అనార్కలి’ అని రాశారు. మరికొందరు సి. రామచంద్ర సంగీతం అందించిన ‘విజయకోట వీరుడు’ (1958) అనే తమిళ డబ్బింగ్ సినిమాను ప్రస్తావించారు. రెండూ సరియైన జవాబులు కావని గమనించగలరు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here