సినిమా క్విజ్-50

0
7

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జి. రామినీడు దర్శకత్వంలో జమున, హరనాథ్ నాయికానాయకులుగా నటించిన ‘బంగారు సంకెళ్ళు’ చిత్రంలోని ‘అందం ఉరికింది వయసుతో పందెం వేసింది’ అనే పాటను ఆత్రేయ వ్రాశారు. ఈ పాటకి సంగీతం అందించినది ఎవరు?
  2. ‘తెంకాసి పట్టణం’ అనే మలయాళ చిత్రం తెలుగులో అర్జున్, జగపతిబాబు గార్లతో ఏ పేరిట రీమేక్ అయింది?
  3. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా నటించిన ‘పోకిరి’ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్‌తో ఏ పేరిట రీమేక్ అయింది?
  4. శోభన్ బాబు, జయలలితలు నటించిన ‘డాక్టర్ బాబు’ చిత్రానికి – హిందీలో మనోజ్ కుమార్, మాలాసిన్హాలు నటించిన ఏ చిత్రం మూలం?
  5. పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం ‘హాస్టల్ డేస్’ (2012)లో నాయికా నాయకులు ఎవరు?
  6. కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘దొంగరాముడు’ చిత్రంలో ‘రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది’ అనే పాటని జిక్కీ పాడగా సావిత్రి అభినయించారు. ఈ పాట మధ్యలో మాట్లాడే వ్యక్తి ఎవరు?
  7. సావిత్రి స్వీయదర్శకత్వంలో ఎన్.టి.ఆర్.తో నటించిన ‘మాతృదేవత’ చిత్రానికి ఏ హిందీ సినిమా ఆధారం?
  8. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహన్, జయసుధలు నటించిన ‘ఆది దంపతులు’ చిత్రానికి ఏ హిందీ చిత్రం ఆధారం? (తనూజ, శ్రీరాం లాగూ, సచిన్, రాజ్ కిరణ్ తారాగణం).
  9. 1976లో రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకం క్రింద బెంగాలీ రచయిత్రి రాసిన నవల ఆధారంగా హిందీలో రాఖీ, పరీక్షిత్ సాహ్ని, లలితా పవార్ లతో ‘తపస్య’ అనే సినిమా తీసారు. ఈ సినిమా ఎ. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో ‘సుజాత’ హీరోయిన్‍గా తెలుగులో ఏ పేరిట రీమేక్ అయింది?
  10. ఎస్.వి.రంగారావు గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘చదరంగం’ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఆగస్ట్ 22 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 50 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఆగస్ట్ 27 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 48 జవాబులు:

1.ఇరుగు పొరుగు 2. శభాష్ సూరి 3. అశోక చక్రవర్తి 4. రామ్‍ ఔర్ శ్యామ్ 5. జగత్ జెట్టీలు 6. బికారి రాముడు 7. బచ్‌పన్ 8. పాల మనసులు 9. మన దేశం 10. సిపాయి కూతురు

సినిమా క్విజ్ 48 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి
  • కొన్నె ప్రశాంత్
  • టి. సత్యలక్ష్మి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here