సినిమా క్విజ్-52

0
10

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. 1971లో వచ్చిన తమిళ చిత్రం ‘సవాళే సమాళి’లో శివాజీ గణేశన్, జయలలిత నటించగా, ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఏ పేరుతో తెలుగులో రీమేక్ అయింది (అక్కినేని, కాంచనలతో)?
  2. కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రదలు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన ‘అడవి సింహాలు’ సినిమాని హిందీలో ఏ పేరుతో జితేంద్ర, ధర్మేంద్ర, శ్రీదేవి, పర్వీన్ బాబీలతో తీశారు?
  3. సినిమా పంపిణీదారులలో ఒక ప్రాంతం అయిన ‘సీడెడ్’ అంటే?
  4. 2012లో నరేష్, శర్వానంద్, శ్రియా శరణ నటించిన ‘నువ్వా నేనా’ చిత్రానికి మూలం హిందీలో గోవిందా, అనిల్ కపూర్, జుహీచావ్లా, కాదర్ ఖాన్‍లు నటించిన చిత్రం. ఆ హిందీ సినిమా ఏది?
  5. కమలకార కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి నటించిన ‘పాండవ వనవాసం’ చిత్రంలో గంధర్వరాజు చిత్రసేనుడిగా నటించినది ఎవరు?
  6. వి. మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ‘వీరాభిమన్యు’ చిత్రంలో అర్జునుడిగా కాంతారావు నటించారు. ద్రౌపదిగా నటించినది ఎవరు?
  7. కె. హేమాంబరధర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అదృష్ట జాతకుడు’ చిత్రంలో ఎన్.టి.ఆర్. చెల్లెలు పాత్రధారి ఎవరు?
  8. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., రాజశ్రీలు నటించిన ‘అగ్గిబరాటా’ చిత్రంలో మాంత్రికుని వేషం వేసిన నటుడు ఎవరు?
  9. పేకేటి శివరాం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. త్రిపాత్రాభియనం చేసిన ‘కుల గౌరవం’ సినిమాకి ఛాయాగ్రాహకుడు ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు?
  10. కె. బాలచందర్ దర్శకత్వంలో జెమినీ గణేశన్, షావుకారు జానకి, జయంతి నటించిన ‘ఇరుకొడుగల్’ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 సెప్టెంబర్ 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 52 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 సెప్టెంబర్ 10 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 50 జవాబులు:

1.ఎం. పూర్ణచంద్రరావు 2. హనుమాన్ జంక్షన్ 3. వాంటెడ్ 4. హిమాలయ్ కీ గోద్ మే 5. రాజా, గజల్ ఠాకూర్ 6. మద్దాలి కృష్ణమూర్తి 7. ఆంచల్ 8. ఘర్‍ ద్వార్ 9. సంధ్య (1980) 10. టి.వి.రాజు

సినిమా క్విజ్ 50 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఆర్ వి సి హెచ్ నాగేశ్వరరావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • కొన్నె ప్రశాంత్
  • యం.రేణుమతి
  • జి. రాధిక
  • నందు
  • లత హెచ్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here