సినిమా క్విజ్-57

0
9

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. దర్శకులు కమలాకర కామేశ్వరరావు, అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి లతో తీసిన సాంఘిక చిత్రం ఏది?
  2. 1954లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అక్కినేని, సావిత్రి గార్లతో ‘పరివర్తన’ చిత్రానికి ఏ నవల ఆధారం?
  3. 1993 సెప్టెంబరు 3 నాడు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవి ఏవి?
  4. 1955లో రజనీకాంత్ దర్శకత్వంలో అంజలీ దేవి, అమర్‍నాథ్, చలం నటించిన ఏ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించారు?
  5. బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయ్’ ఆధారంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో కాంతారావు, బాలయ్య, సావిత్రి, డా. ప్రభాకర రెడ్డి (తొలి పరిచయం) లతో తీసిన తెలుగు సినిమా ఏది?
  6. 1959లో వచ్చిన ‘చిరాగ్ కహాఁ రోషనీ కహాఁ’ అనే హిందీ చిత్రంలో రాజేంద్ర కుమార్, మీనా కుమారి నటించారు. టి. ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్ర్రి నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ ఏది?
  7. హిందీ హీరో గోవిందాకు స్వంత పిన్ని అయిన నటి ‘కుమ్‍కుమ్’ అసలు పేరు?
  8. 300ల చిత్రాలకు పైగా సంగీతం అందించిన ప్రఖ్యాత స్వరకర్త రాహుల్ దేవ్ బర్మన్ మరో పేరు?
  9. ముప్పలనేని శివ దర్శకత్వంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీ, రాశి, సంఘవి నటించిన ‘సందడే సందడి’ చిత్రం ఏ కన్నడ చిత్రానికి రీమేక్?
  10. 1978లో బాపయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయప్రద, సత్యనారాయణలతో వైజయంతి మూవీస్ వారు తీసిన ‘యుగపురుషుడు’ సినిమాని అదే దర్శకుడితో ధర్మేంద్ర, జాకీ ష్రాప్, పూనం థిల్లాన్, కిమీ కాట్కర్ లతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  11. ఇటీవల ప్రముఖ నటి వహీదా రెహమాన్‍కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించారు. ఆమె తెలుగులో తొలిసారిగా హీరోయిన్‍గా నటించిన ‘జయసింహ’ (1955) చిత్రంలో ఎన్.టి.ఆర్. హీరో. ఈ సినిమాలో వహీదాకు గాత్రదానం చేసిన నటి ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 అక్టోబర్ 10 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 57 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 అక్టోబర్ 15 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 55 జవాబులు:

1.అభిలాష 2. రామాపురంలో సీత (1981) 3. తేనె మనసులు (1987) 4. అమ్మాయిల శపథం (1975) 5. పెళ్ళిపీటలు (1998) 6. వెల్లాల సుబ్బమ్మ 7. ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య 8. మహ్‍జబీన్ బానో 9. హరిలాల్ జెఠాలాల్ జరీవాలా 10. ఫాతిమా రషీద్

సినిమా క్విజ్ 55 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • ఎం. రేణుమతి
  • ఎస్. వికాస్ చౌదరి
  • దీప్తి మహంతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here