సినిమా క్విజ్-59

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. హాస్య నటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన తొలి తెలుగు చిత్రం ఏది?
  2. టి. గోపీచంద్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘తొలివలపు’ (2001) కాగా, విలన్‍గా నటించిన తొలి చిత్రం ఏది?
  3. దర్శకుడు వి. రామచంద్రరావు 1971లో శారద, హరనాథ్, గుమ్మడి, రాజనాల గార్లతో ‘పగబట్టిన పడుచు’ అనే సినిమా తీశారు? ఇది ఏ హిందీ సినిమాకి రీమేక్?
  4. కె. విశ్వనాథ్ 1968లో కృష్ణ, జమునలతో తీసిన ‘ఉండమ్మా బొట్టు పెడతా’ సినిమాకి ఏ మరాఠీ సినిమా ఆధారం?
  5. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో కృష్ణ, కాంతారావు, రాజశ్రీలు నటించిన ‘ప్రేమజీవులు’ (1971) సినిమాకి ఏ మలయాళ చిత్రం ఆధారం? (క్లూ: కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వంలో ప్రేమ్ నజీర్, జయభారతి నటించారు)
  6. వంశీ దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని, రాజేంద్రప్రసాద్‍లు నటించిన ‘మంచుపల్లకీ’ (1982) చిత్రానికి ఏ తమిళ చిత్రం ఆధారం?
  7. తమిళంలో రాజేంద్రప్రసాద్ డైరక్టుగా నటించిన చిత్రం (1983) ఏది? దర్శకత్వం టి. రామలింగం. చంద్రశేఖర్, నిషా నూర్, గౌండమణి ఇతర తారాగణం.
  8. 1998లో విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో విజయ్, కౌసల్య నటించిన ‘ప్రియముదన్’ తెలుగులో వడ్డె నవీన్, కీర్తి రెడ్డిలతో ఏ పేరురో రీమేక్ చేశారు?
  9. 1984లో ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించిన ‘దేవాంతకుడు’ చిత్రానికి ఏ కన్నడ చిత్రం మూలం? (క్లూ: కన్నడంలో అంబరీష్, వజ్రముని నటించారు)
  10. ఎవిఎం వారి ‘రాము’ చిత్రంలో ఎన్.టి.ఆర్. మొదటి భార్యగా నటించిన నటి పేరు? (క్లూ: ఈమె తమిళ నటుడు ఎవిఎం రాజన్ భార్య)

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 అక్టోబర్ 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 59 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 అక్టోబర్ 29 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 57 జవాబులు:

1.మాయని మమత 2. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన అన్నాచెల్లెలు 3. బంగారు బుల్లోడు, నిప్పురవ్వ 4. వదినగారి గాజులు 5. చివరకు మిగిలేది (1960) 6. మా బాబు (1960) 7. జేబున్నిసా 8. పంచమ్ 9. కోతిగళు సర్ కోతిగళు (2001) 10. మర్ద్ కీ జబాన్ (1987) 11. షావుకారు జానకి

సినిమా క్విజ్ 57 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి.బృందావనరావు
  • మణి నాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వర్ధని మాదిరాజు
  • వాసు విశ్వనాథ
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • యం. రేణుమతి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here