సినిమా క్విజ్-67

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జంధ్యాల దర్శకత్వంలో నరేష్, పూర్ణిమ, తులసి, ప్రదీప్‍లు నటించిన ‘నాలుగు స్తంభాలాట’ (1982) చిత్రాన్ని హిందీలో వి.బి.రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో సంజయ్ దత్, పద్మినీ కొల్హాపురి, సుప్రియ పాఠక్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  2. డా॥ రాజశేఖర్, గౌతమి, రోజాలు నటించిన ‘అన్న’ (1994) చిత్రానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రాన్ని హిందీలో సునీల్ శెట్టి, పూజా బాత్రా, సోనాలి బింద్రె లతో దర్శకులు దీపక్ శివదాసాని ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి నటించిన ‘చూడాలని ఉంది’ (1998) చిత్రాన్ని హిందీలో అనిల్ కపూర్, రాణి ముఖర్జీలు నటించగా దర్శకుడు సుధీర్ మిశ్రా ఏ పేరుతో రీమేక్ చేశారు?
  4. 2005లో S. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, శ్రియాలు నటించిన ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో దర్శకుడు వి.వి.వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్ భరూచా, భాగ్యశ్రీ లతో రీమేక్ చేసిన చిత్రం?
  5. దర్శకుడు కె. బి. తిలక్ – జగ్గయ్య, జమునలతో తీసిన ‘ముద్దుబిడ్డ’ (1956) చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్, నిరుపరాయ్ లతో ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
  6. ‘రోషగాడు’ (1983) చిత్రంలో చిరంజీవి, మాధవి, సిల్క్‌స్మిత నటించగా దర్శకుడు S.R. దాస్ తీశారు. హిందీలో కమల్ శర్మ దర్శకత్వంలో జితేంద్ర, భానుప్రియ నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  7. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, శారద, జయసుధలు నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984) చిత్రాన్ని హిందీలో దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవిలతో స్వీయ దర్శకత్వంలో కె. రాఘవేంద్రరావు ఏ పేరుతో రీమేక్ చేశారు?
  8. సురేష్ ప్రొడక్షన్స్ వారు శోభన్‌బాబు, వాణిశ్రీ, కృష్ణంరాజు లతో తాతినేని రామారావు దర్శకత్వంలో తీసిన ‘జీవన తరంగాలు’ (1973) చిత్రాన్ని హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, మౌసమి చటర్జీ, అశోక్ కుమార్‍లతో రీమేక్ చేసిన చిత్రం పేరు?
  9. కృష్ణవంశీ దర్శకుడిగా పరిచయమైన ‘గులాబి’ చిత్రంలో D. చక్రవర్తి మహేశ్వరిలు నటించగా, హిందీలో ఇంద్రకుమార్ దర్శకత్వంలో, బాబీ దేవల్ కరిష్మాకపూర్ లతో రీమేక్ అయిన చిత్రం పేరు?
  10. సురేష్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్, మోనికా బేడీలు నటించిన ‘శివయ్య’ (1998) చిత్రాన్ని హిందీలో సునీల్ శెట్టి, సుస్మితాసేన్, నమ్రతా శిరోద్కర్ లతో దర్శకుడు యోగష్ ఈశ్వర్ ఏ పేరుతో రీమేక్ చేశారు??

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 డిసెంబర్ 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 66 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 డిసెంబర్ 24 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 65 జవాబులు:

1.పూజా కే ఫూల్ (1964) 2. స్వయంవర్ (1980) 3. రాఖి (1963) 4. మెహర్బాన్ (1967) 5. మిలన్ (1967) 6. రామ్ ఔర్ శ్యామ్ (1967) 7. జ్వార్ భాటా (1973) 8. మై భీ లడ్కీ హూఁ (1966) 9. రిస్తే నాతే 10. నయా దిన్ నయీ రాత్ (1974)

సినిమా క్విజ్ 65 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • Kan Kri
  • మణి నాగేంద్ర రావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. రేణు
  • దీప్తి మహంతి
  • కె. గాయత్రి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here