సినిమా క్విజ్-70

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో అర్జున్ బాజ్వా, కంచి కౌల్ నటించిన ‘సంపంగి’ (2001) చిత్రం హిందీలో జి.కృష్ణ దర్శకత్వంలో డినోమోరియా, బిపాసా బాసులతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా, సిద్ధార్థ్, ప్రకాశ్ రాజ్‍లతో తీసిన ‘బొమ్మరిల్లు’ (2006) చిత్రాన్ని హిందీలో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో హర్మన్ భావెజా, జెనీలియా, నానా పాటేకర్‍లతో ఏ పేరున రీమేక్ చేశారు?
  3. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో జె.వి.సోమయాజులు, సబిత, అల్లు రామలింగయ్య నటించిన ‘సప్తపది’ (1981) చిత్రం హిందీలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, రాకేష్ రోషన్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రదలు నటించిన ‘అడవి సింహాలు’ (1983) చిత్రాన్ని – కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ధర్మేంద్ర, జితేంద్ర, శ్రీదేవిలతో హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. వి. రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ నటించిన ‘ఆస్తులు అంతస్తులు’ (1969) చిత్రం – హిందీలో జావర్ సీతారామన్ దర్శకత్వంలో అశోక్ కుమార్, బిస్వజిత్, మాలా సిన్హాలతో ఏ పేరుతో రీమేక్ అయింది? (క్లూ: ఈ చిత్రానికి తమిళ చిత్రం ‘పనమా పాశమా’ మూలం అని కొందరంటారు).
  6. 1968లో వచ్చిన తమిళ చిత్రం ‘ఎతిర్ నీచల్’ ఆధారంగా తెలుగులో జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వంలో చలం, శారద, ఎస్.వి.రంగారావు నటించిన ‘సంబరాల రాంబాబు’ (1970) చిత్రాన్ని హిందీలో జెమినీ ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వంలో మహమూద్, రాధా సాలుజా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. అక్కినేని సంజీవి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, జానకి నటించిన ‘ధర్మదాత’ (1970) చిత్రం హిందీలో పి. మాధవన్ దర్శకత్వంలో రాజ్‍కుమార్, వహీదా రెహ్మాన్, లీనా చందావార్కర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. తమిళచిత్రం ‘పావమణిప్పు’ ఆధారంగా ఎ. భీమ్‍సింగ్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, నాగయ్య, నాగభూషణం నటించిన ‘ఒకే కుటుంబం’ (1970) చిత్రాన్ని హిందీలో ఎ. భీమ్‍సింగ్ దర్శకత్వంలో వినోద్ ఖన్నా, రాఖీ, సంజయ్ ఖాన్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వంలో త్యాగరాజు, సత్యనారాయణ, బేబి రాణి, రామదాసు, జగ్గయ్య, దేవిక నటించిన ‘పాప కోసం’ (1968) చిత్రం – హిందీలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ప్రాణ్, అజిత్, అన్వర్ హుస్సేన్, పద్మిని, బలరాజ్ సహ్ని లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. వి.బి. రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘దసరా బుల్లోడు’ (1971) చిత్రాన్ని హిందీలో వి.బి. రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, షబనా అజ్మీలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జనవరి 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 70 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జనవరి 14 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 68 జవాబులు:

1.ఆజ్ కా గూండారాజ్ (1992) 2. ఆజ్ కా ఎమ్.ఎల్.ఎ. రామ్ అవతార్ (1984) 3. ఆధా దిన్ ఆధీ రాత్ (1977) 4. అజబ్ గజబ్ లవ్ (2012) 5. అమీరీ గరీబీ (1971) 6. బాఘీ (2016) 7. బందిష్ (1980) 8. హర్ దిల్ జో ప్యార్ కరేగా (2000) 9. ఈశ్వర్ (1989) 10. ఏక్ – ది పవర్ ఆఫ్ వన్ (2009)

సినిమా క్విజ్ 68 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. రేణుమతి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here