సినిమా క్విజ్-72

0
13

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. తాతినేని రామారావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘ఆలు మగలు’ (1977) చిత్రం హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలో జితేంద్ర, రేఖలతో ఏ పేరిట రీమేక్ అయింది?
  2. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ, జయచిత్ర నటించిన ‘కటకటాల రుద్రయ్య’ (1978) సినిమాని హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో జితేంద్ర, వినోద్ మెహ్రా, వహీదా రెహమాన్, మౌసమీ చటర్జీ, సారికలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. కన్నడ చిత్రం ‘పడువారళ్ళి పాండవరు’ ఆధారంగా బాపు దర్శకత్వంలో చిరంజీవి, మురళీమోహన్, కృష్ణంరాజు నటించిన ‘మన ఊరి పాండవులు’ (1978) చిత్రం హిందీలో బాపు దర్శకత్వంలో సంజీవ్ కుమార్, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, మిథున్ చక్రవర్తి లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, సరిత, మాధవి నటించిన ‘మరో చరిత్ర’ (1978) సినిమాని హిందీలో కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి, మాధవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, తాళ్ళూరి రామేశ్వరి నటించిన ‘సీతామహాలక్ష్మి’ (1978) చిత్రం హిందీలో మేరజ్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, జరీనా వహాబ్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు, సావిత్రి, సుజాత నటించిన ‘గోరింటాకు’ (1979) సినిమాని హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, అనితా రాజ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, శ్రీదేవి నటించిన ‘కార్తీక దీపం’ (1979) చిత్రం హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, మౌసమీ చటర్జీ లతో ఏ పేరిట రీమేక్ అయింది?
  8. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో సత్యనారాయణ, షావుకారు జానకి, చంద్రమోహన్ నటించిన ‘తాయారమ్మ బంగారయ్య’ (1979) సినిమాని హిందీలో విజయ్ రెడ్డి దర్శకత్వంలో సంజీవ్ కుమార్, రాఖీ, రాకేష్ రోషన్‍లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., శ్రీదేవి, జగ్గయ్య నటించిన ‘వేటగాడు’ (1979) చిత్రం హిందీలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి నటించిన ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ (1979) సినిమాని హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జనవరి 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 72 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జనవరి 28 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 70 జవాబులు:

  1. ఇష్క్ హై తుమ్‍సే (2004) 2. ఇట్స్ మై లైఫ్ (2020) 3. జాగ్ ఉఠా ఇన్సాన్ (1984) 4. జానీ దోస్త్ (1983) 5. పైసా యా ప్యార్ (1970) 6. లాఖోంమే ఏక్ (1971) 7. దిల్ కా రాజా (1972) 8. సబ్ కా సాథీ (1972) 9. నన్హా ఫరిస్తా (1969) 10. రాస్తే ప్యార్ కే (1982)

సినిమా క్విజ్ 70 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఎ. ఎండి. జాకీర్ హుస్సేన్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • ఎమ్. గోవర్ధన్
  • దీప్తి మహంతి
  • ఠాగూర్ ఉపేందర్ సింగ్
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here