సినిమా క్విజ్-76

0
10

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, రంగనాథ్ నటించిన ‘ఖైదీ’ (1983) సినిమా హిందీలో ఎస్. ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో జితేంద్ర, హేమమాలిని, మాధవి, శత్రుఘన్ సిన్హాలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. (ద్విపాత్రలు), శారద, శ్రీదేవి నటించిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980) చిత్రాన్ని హిందీలో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో జితేంద్ర, లీనా, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‍రాజ్, జగపతి బాబు, సాయి కుమార్, సౌందర్య నటించిన ‘అంతఃపురం’ (1998) సినిమా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, నానా పాటేకర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటించిన ‘హలో బ్రదర్’ (1994) చిత్రాన్ని హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్, రంభలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కృష్ణ, భారతి నటించిన ‘నేరము, శిక్ష’ (1973) సినిమా హిందీలో ఎస్. రామనాథన్ దర్శకత్వంలో రాజ్ కిరణ్, సుష్మా వర్మ, ఇఫ్తికార్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల, జె.డి. చక్రవర్తి నటించిన ‘శివ’ (1989) చిత్రాన్ని హిందీలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల లతో ఏ పేరుతో రీమేక్ చేశారు
  7. కృష్ణ దర్శకత్వంలో కృష్ణ, జయప్రద, మందాకిని నటించిన ‘సింహాసనం’ సినిమా హిందీలో కృష్ణ దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద, మందాకిని లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. శరత్ దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’ (1999) చిత్రాన్ని హిందీలో తాతినేని లక్ష్మీ వరప్రసాద్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, సువర్ణ, ముకేష్ రిషీ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో కృష్ణ, గుమ్మడి, ఎస్.వి.రంగారావు, దేవిక, విజయనిర్మల, జమున నటించిన ‘పండంటి కాపురం’ (1972) సినిమా హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రాజేంద్ర కుమార్, మాలా సిన్హా, హేమమాలిని లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఎస్.వి.రంగారావు, రాజబాబు, సత్యనారాయణ, విజయనిర్మల నటించిన ‘తాత-మనవడు’ (1980) చిత్రాన్ని హిందీలో మోహన్ సైగల్ దర్శకత్వంలో అశోక్ కుమార్, జితేంద్ర, రేఖలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఫిబ్రవరి 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 76 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఫిబ్రవరి 25 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 74 జవాబులు:

1.మాస్టర్ జీ (1986) 2. హిమ్మత్‍వాలా (1983) 3. కామ్‍ చోర్ (1982) 4. ప్యాసా సావన్ (1981) 5. జస్టిస్ చౌదరి (1983) 6. సుర్ సంగమ్ (1985) 7. సూర్యవంశం (1999) 8. అనాడి (1993) 9. బులందీ (2000) 10. ప్రతిబంధ్ (1990)

సినిమా క్విజ్ 74 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • ఠాకూర్ ఉపేందర్ సింగ్
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here