సినిమా క్విజ్-85

0
16

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. కృష్ణన్ పంజు దర్శకత్వంలో శివాజీ గణేషన్, S.S.రాజేంద్రన్ నటించిన ‘దైవపిరవి’ (1960) చిత్రం తెలుగులో ఏ పేరున డబ్ అయింది?
  2. దాదా మిరాసి కథను దర్శకులు బి.ఆర్.పంతులు – శివాజీ గణేషన్, మాలిని, బి.సరోజాదేవి లతో తీసిన ‘శభాష్ మీనా’ (1958) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. దర్శకుడు సుందర్ రావు నాదకర్ణి, ఎం.జి.ఆర్, సావిత్రి గార్లతో తీసిన ‘మహాదేవి’ (1957) చిత్రం తెలుగులో ఏ పేరున డబ్ చేయబడింది?
  4. V. శ్రీధర్ దర్శకత్వంలో జెమినీ గణేషన్, వైజయంతి మాల నటించిన ‘తేన్ నిలవు’ (1961) చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ ఛేశారు?
  5. కమల్ హాసన్, మాధవి, L.V. ప్రసాద్ గార్లు నటించిన తమిళ చిత్రం ‘రాజా పార్వై’ కి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ సినిమా ఏ పేరుతో తెలుగులోకి డబ్ అయింది?
  6. ఎం. జి. రామచంద్రన్, T. R. రాజకుమారి, బి. సరోజాదేవి లతో దర్శకుడు R. రామన్న తీసిన ‘పుదుమై పితాన్’ (1951) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  7. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వంలో జెమినీ గణేషన్, బి. సరోజాదేవి లతో తీసిన ‘పాణితిరై’ (1961) చిత్రం తెలుగులో పేరిట డబ్ అయింది?
  8. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్, నగ్మా, రఘువరన్ నటించిన ‘బాషా’ (1995) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (తెలుగులో సూపర్ హిట్)
  9. అజిత్, దేవయాని లతో దర్శకుడు అగస్తియిన్ తీసిన ‘కాదల్ కోట్టయ్’ (1996) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (హిట్ చిత్రం)
  10. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘24’ చిత్రంలో సూర్య, సమంత, నిత్యామీనన్ నటించారు. ఆ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఏప్రిల్ 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 85 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఏప్రిల్ 28 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 83 జవాబులు:

1.మా ఊరి ఉమ్మాయి 2. సాహసవీరుడు (1956) 3. అనగనగా ఒక రాజు 4. పరాశక్తి 5. రత్నగిరి రహస్యం 6. కార్మిక విజయం 7. సర్వర్ సుందరం (1966) 8. మన్మథలీల 9. గర్జనం (1981) 10. వయసు పిలిచింది (1978)

సినిమా క్విజ్ 83 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • ఎం. గోవర్ధన్ నేత
  • డి. నవీన

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here