సినిమా క్విజ్-88

0
13

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. విజయ్ దర్శకత్వంలో కన్నడ హీరో రాజ్‍కుమార్, మంజుల నటించిన ‘మయార’ (1975) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  2. సూరజ్ బర్‍జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, రేణుకా సాహ్నిలు నటించిన “హమ్ ఆప్ కే హైఁ కాన్ (1994) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  3. జి.ఎన్. రంగరాజన్ దర్శకత్వంలో కమలహాసన్, శ్రీదేవి నటించిన ‘కల్యాణ రామన్’ (1979)చిత్రాన్ని తెలుగులో ఏ పేరిట డబ్ చేశారు?
  4. హరి దర్శకత్వంలో సూర్య, త్రిష నటించిన ‘ఆరు’ (2005) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  5. సూర్య దర్శకత్వంలో అజిత్ (ద్విపాత్రాభినయం), జ్యోతిక, సిమ్రన్ నటించిన ‘వాలి’ (1999) చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు? ఇది తెలుగులో హిట్టయింది.
  6. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్, కాజల్ అగర్వాల్ నటించిన ‘తుప్పాకీ’ (2012) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  7. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, శివాజీ గణేశన్. రమ్యకృష్ణ, సౌందర్యలు నటించిన ‘పడయప్ప’ (1999) చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు? ఇది హిట్ చిత్రం.
  8. 1958లో ఎ. భీమసింగ్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి, ఎం.ఎన్. రాజం నటించిన ‘పతి భక్తి’ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో అనువదించారు?
  9. డి. యోగానంద్ దర్శకత్వంలో జెమినీ గణేశన్, వైజయంతి మాల, యస్.వి.రంగారావు నటించిన ‘పార్తిబన్ కణవు’ (1960) చిత్రం తెలుగులో ఏ పేరిట డబ్ చేయబడింది? –
  10. పి. నీలకంఠన్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్, రాజసులోచన, ఎన్. ఆర్. రాధలు నటించిన ‘నల్లవన్ వాళ్వన్’ (1961) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మే 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 88 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మే 12 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 86 జవాబులు:

1.బాగ్దాద్ గజదొంగ (1960) 2. ముగ్గురు కొడుకులు (1952) 3. నాయకుడు (1987) 4. ఎత్తుకు పై ఎత్తు (1978) 5. పాపపరిహారం (1961) 6. ఏకైక వీరుడు (1960) 7. విజయ కోట వీరుడు (1958) 8. శివపుత్రుడు (2004) 9. అందమైన అనుభవం (1979) 10. ప్రేమ పావురాలు (1989)

సినిమా క్విజ్ 86 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • కె. గాయత్రి
  • ఠాకూర్ ఉపేందర్ సింగ్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here