సినిమా క్విజ్-89

0
12

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. ఎ.ఎస్.ఎ. సామి మరియు ఎ. కాశిలింగం దర్శకత్వంలో ఎం.జి.ఆర్., పద్మిని, రాజసులోచన నటించిన ‘అరసిలాన్ కుమారి’ (1961) సినిమాని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు? (క్లూ: గాలానికి పడిందయా గిరగిరా – అనే పాట ప్రసిద్ధం)
  2. వై.ఆర్. స్వామి దర్శకత్వంలో కన్నడ హీరో రాజ్‍కుమార్, ఉదయచంద్రిక, వాణిశ్రీ, ఉదయ కుమార్‌లు నటించిన ‘కటారి వీర’ (1966) చిత్రం ఏ పేరుతో తెలుగులో డబ్ అయింది? (క్లూ: చెంగు చెంగునా హాయిగా – అనే పి. సుశీల పాట దీనిలోనిదే).
  3. మణిరత్నం దర్శకత్వంలో అరవిందస్వామి, మనీషా కొయిరాలా నటించిన ‘బాంబే’ (1995) సినిమాని తెలుగులో ఏ పేరిట అనువదించారు?
  4. ఎం.ఎ. తిరుముగం దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, M. R. రాధ నటించిన ‘తాయై కత్త తనయన్’ (1962) చిత్రం ఏ పేరుతో తెలుగులో డబ్ అయింది? (క్లూ: పేరున పిలిచేమా? నాథుని పేరున పిలిచేమా? అనే పి. సుశీల పాట ఇందులోనిదే).
  5. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో కమలహాసన్, జెమినీ గణేశన్, మీనా, నాసర్, హీరా నటించిన ‘అవ్వాయ్ షణ్ముగి’ (1996) చిత్రాన్ని తెలుగులో ఏ పేరిట డబ్ చేశారు?
  6. ఐ.వి. శశి దర్శకత్వంలో రజనీ కాంత్, కమల్ హాసన్, జయభారతి నటించిన ‘అల్లావుద్దీనుమ్ అర్పుత విళక్కుమ్’ (1979) చిత్రం ఏ పేరుతో తెలుగులో డబ్ అయింది?
  7. ఏ. భీమ్‌సింగ్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, బి. సరోజదేవి నటించిన ‘పాలుం పళమున్’ (1961) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (క్లూ: పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా – పాట ఈ సినిమా లోనిదే).
  8. లోగేష్ కనకరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహన్ నటించిన ‘మాస్టర్’ (2021) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  9. చక్రి తోలేటి దర్శకత్వంలో అజిత్, విద్యుత్ జమాల్, బ్రూనా అబ్దుల్లా నటించిన ‘బిల్లా II’ (2012) చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు?
  10. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్‌ రావల్‌, ఊర్వశి నటించిన ‘సూరారయ్ పొట్రు’ (2020) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మే 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 89 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మే 19 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 87 జవాబులు:

1.ఖైదీ వేట (1985) 2. దేవా (2007) 3. జేబుదొంగ (1961) 4. వీరపాండ్య కట్టబ్రహ్మన (1959) 5. భైరవి 6. విజిల్ (2019) 7. ప్రియురాలు పిలిచింది (2000) 8. నువ్వు నేను ప్రేమ (2006) 9. దేసింగు రాజు కథ (1960) 10. ప్రేమతో (1998)

సినిమా క్విజ్ 87 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • వి. భాగ్య
  • కె. ప్రశాంత్
  • టి. మమన్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here