సినిమా క్విజ్-9

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎన్‌టిఆర్ చిత్రం ‘కథానాయకుడు’ తమిళంలో ఏ పేరున వచ్చింది?
  2. ఎన్‌టిఆర్ నటించిన ‘అగ్గిరాముడు’ చిత్రం ఏ పేరున హిందీలో వచ్చింది? కథానాయకుడెవరు?
  3. తమిళ చిత్రం ‘మురుడన్ ముత్తు’ ఆధారంగా తెలుగులో వచ్చిన ఎన్.టి.ఆర్. చిత్రం ఏది?
  4. అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన ‘బందిపోటు దొంగలు’ చిత్రంలోని ‘విన్నానులే ప్రియా’ అన్న పాట ఏ తమిళ చిత్రం నుంచి కాపీ ? (క్లూ – శివాజీగణేశన్, కె.ఆర్. విజయలు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు సి. వి. శ్రీధర్.)
  5. బి. విఠలాచార్య చిత్రం ‘చిక్కడు దొరకడు’ని – హిందీలో ఏ పేరున తీశారు?
  6. ఎన్.టి.ఆర్. ‘మనుషుల్లో దేవుడు’ చిత్రాన్ని హిందీ ఎల్.వి. ప్రసాద్ గారు ఏ పేరున తీశారు?
  7. తెలుగులో వచ్చిన ‘రాము’ చిత్రంలో నాయికా నాయకులు ఎన్.టి.ఆర్., జమున కాగా, దాని మాతృక తమిళ ‘రాము’లో ఆ పాత్రలు ఎవరు పోషించారు?
  8. ఎన్.టి.ఆర్. ‘దేవాంతకుడు’ చిత్రంలో చిత్రగుప్తుడిగా వేసినదెవరు?
  9. తెలుగులో వచ్చిన ‘పూజ’ చిత్రంలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటకు మాతృక అయిక కన్నడ చిత్రం పేరు?
  10. తమిళ చిత్రం ‘కళత్తూర్ కణ్ణమ్మ’ ను ఏ పేరుతో తెలుగులో పునర్నిర్మించారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 నవంబరు 08వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 నవంబరు 13 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 7 జవాబులు:

1.మేనరికం 2. పక్కింటి అమ్మాయి 3. మామకు తగ్గ అల్లుడు 4. మాయాబజార్ 5. అంజలీదేవి 6. దేవతలారా దీవించండి 7. ఒక నారి వంద తుపాకులు, 34 థియేటర్లలో 70mm బ్లో అప్ ఇచ్చారు 8. కృష్ణ, వాణిశ్రీ – వింత కథ 9. కృష్ణ, దేవుడు లాంటి మనిషి 10. రావణుడే రాముడైతే

సినిమా క్విజ్ 7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • బి. మణి నాగేంద్రరావు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • ఎస్. సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here