సినిమా క్విజ్-91

0
9

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. T.V. సుందరం దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, లలిత, పద్మిని నటించిన ‘రాజరాజన్’ (1957) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: ‘వినువీధి జాబిలి వికసించేనే’ అనే పాట తెలుగు వెర్షన్‍లో ప్రసిద్ధం)
  2. బాబూ భాయ్ మిస్త్రీ దర్శకత్వంలో మహీపాల్, అనితా గుహ నటించిన ‘మాయాబజార్’ (1958) హిందీ చిత్రం తెలుగులో ఏ పేరిట డబ్ అయింది? (క్లూ: తెలుగు వెర్షన్ లో ఎ.ఎమ్. రాజా, పి. సుశీల పాడిన ‘ఈ పూలె మైమరపించే అందించెనే మోదం ఎదమీద’ అనే యుగళగీతం ప్రసిద్ధం)
  3. ఎ. మురగదాస్ దర్శకత్వంలో సూర్య, ఆశిన్, నయనతార నటించిన ‘గజిని’ (2005) చిత్రం తెలుగులో ఏ పేరిట డబ్ అయింది?
  4. భారతీరాజా దర్శకత్వంలో కమల్ హాసన్, మాధవి. స్వప్న నటించిన ‘టిక్ టిక్ టిక్’ (1981) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. కుందన్ షా దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, ప్రీతీ జింటా, టాబు నటించిన ‘క్యా కెహనా’ (2000) చిత్రం తెలుగులో ఏ పేరుతో వచ్చింది?(క్లూ: తెలుగు వెర్షన్‍లో ‘నీ అడుగుల నీడల్లో చిక్కింది మనసే చెలియా’ అనే పాట ఉంది)
  6. విజయ్ దర్శకత్వంలో శ్రీనాథ్, ఉదయకుమార్, భారతి నటించిన ‘రంగమహల్ రహస్య’ (1970) కన్నడ చిత్రాన్ని తెలుగులో ఏ పేరిట డబ్ చేశారు?
  7. శరవణ సుబ్బయ్య దర్శకత్వంలో అజిత్ (ద్విపాత్రాభినయం), మీనా, నగ్మా నటించిన ‘సిటిజెన్’ (2001) అనే సినిమాని తెలుగులో ఏ పేరిట డబ్ చేసారు?
  8. మహేంద్రన్ దర్శకత్వంలో రజనీకాంత్, శరత్ బాబు, జయలక్ష్మి నటించిన ‘ముల్లుమ్ మలరమ్’ (1978) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. A. ఆరుముగం దర్శకత్వంలో ఎం.జి.ఆర్., బి. సరోజా దేవి, M.R. రాధ నటించిన ‘ధర్మం తతైకాకుం’ (1963) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  10. S. గోపాలక్రిష్ణన్ దర్శకత్వంలో జెమినీ గణేశన్, సావిత్రి, M.R. రాధ నటించిన ‘ఆయిరం రూబై’ (1964) చిత్రం తెలుగులో ఏ పేరుతో వచ్చింది? (క్లూ: సావిత్రి ఫిల్మోగ్రఫీ, వికీపీడియా)

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మే 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 91 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూన్ 02 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 89 జవాబులు:

1.కత్తిపట్టిన రైతు (1961) 2. కత్తిపోటు (1966) 3. బొంబాయి (1995) 4.వీర పుత్రుడు (1962) 5. భామనే సత్యభామనే (1996) 6. అల్లావుద్దీన్ అద్భుత దీపం (1979) 7. ప్రాయశ్చిత్తం (1962) 8. మాస్టర్ (2021) 9. డేవిడ్ బిల్లా (2012) 10. ఆకాశం నీ హద్దురా (2020)

సినిమా క్విజ్ 88 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం‌
  • వేదుల సుభద్ర

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here