సినిమా క్విజ్-96

0
11

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు (మణిరత్నం స్పెషల్).

ప్రశ్నలు:

  1. మణిరత్నం దర్శకత్వంలో మోహన్, కార్తీక్, రేవతి నటించిన ‘మౌనరాగం’ (1986) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. మణిరత్నం దర్శకత్వంలో అనిల్ కపూర్, లక్ష్మి నటించిన ‘పల్లవి అనుపల్లవి’ (1983) అనే కన్నడ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. మణిరత్నం దర్శకత్వంలో ప్రభు, కార్తీక్, అమల, నిరోషా నటించిన ‘అగ్నినచ్చత్రం’ (1988) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  4. కె. సుభాష్ దర్శకత్వంలో మణిరత్నం నిర్మించగా – విజయకాంత్, భానుప్రియ నటించిన ‘చత్రియన్’ (1990) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, ముమ్ముట్టి, అరవింద స్వామి, శోభన, భానుప్రియ, గీత నటించిన ‘తలపతి’ (1991) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. మణిరత్నం దర్శకత్వంలో కె. బాలచందర్ నిర్మించగా అరవింద స్వామి, మధుబాల నటించిన ‘రోజా’ (1992) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  7. మణిరత్నం దర్శకత్వంలో ప్రశాంత్, అను అగర్వాల్, హీరా, ఎస్.పి. బాలసుబ్రమణ్యం నటించిన ‘తిరుడ తిరుడ’ (1993) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  8. మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, రేవతి నటించిన ‘ఇరువర్’ (1997) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. మణిరత్నం దర్శకత్వంలో రఘువరన్, రేవతి, మాస్టర్ తరుణ్, బేబి షామిలి నటించిన ‘అంజలి’ (1993) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. మణిరత్నం దర్శకత్వంలో అర్జున్ సర్జా, అరవింద స్వామి, గౌతమ్ కార్తీక్, మంచు లక్ష్మి నటించిన ‘కడల్’ (2013) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూలై 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 96 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూలై 14 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 94 జవాబులు:

1.డాక్టర్ నందిని 2. ఇద్దరూ ఇద్దరే 3. పోలీస్ కమీషనర్ 4. విలన్ 5. గురు 6. వీడొక్కడే 7. విశ్వాసం 8. సర్కార్ 9. కబాలి 10. కర్ణ

సినిమా క్విజ్ 94 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • కె. శాంతి
  • కొన్నె ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here