సినిమా క్విజ్-97

0
12

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్, ప్రభు, టబు, అమ్రిష్ పురీ నటించిన ‘కాలాపానీ’ (1996) అనే మలయాళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. భద్రన్ దర్శకత్వంలో సురేష్ గోపి, విజయశాంతి, గీత నటించిన ‘యువతుర్కీ’ (1996) అనే మలయాళ చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు? (క్లూ: మలయాళంలో విజయశాంతి తొలి సినిమా ఇది)
  3. హుణ్‍సూర్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఉదయ్‍కుమార్, లీలావతి, రాజశ్రీ నటించిన ‘రత్నమంజరి’ (1962) అనే కన్నడ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  4. రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, రేఖ, ప్రియాంకా చోప్రా నటించిన ‘క్రిష్’ (2006) అనే హిందీ చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు?
  5. బాలూ మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి, సిల్క్ స్మిత నటించిన ‘మూండ్రాం పిరై’ (1982) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో సూర్య, నయనతార, వడివేలు నటించిన ‘ఆధవన్’ (2009) అనే తమిళ చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు?
  7. శివ దర్శకత్వంలో అజిత్, తమన్నా నటించిన ‘వీరం’ (2014) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా ‘కాటమరాయుడు’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది)
  8. అట్లీ దర్శకత్వంలో విజయ్, కాజల్ అగర్వాల్, నిత్య మీనన్ నటించిన ‘మెర్‍సల్’ (2017) అనే తమిళ చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు?
  9. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి నటించిన ‘లింగా’ (2014) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. పి. మాధవన్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, కె. ఆర్. విజయ, ముత్తురామన్ నటించిన ‘రామన్ ఎత్తనై రామనడి’ (1970) అనే తమిళ చిత్రాన్ని ఏ పేరుతో తెలుగులో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూలై 16 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 97 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూలై 21 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 95 జవాబులు:

1.ప్రజాశక్తి (1962) 2. దొంగనోట్లు (1964) 3. స్వర్గం (1970) 4. అరుణాచలం (1997) 5. జి (2005) 6. యముడు/సింగం (2010) 7. చట్టం (1983) 8. జోధా అక్బర్ (2008) 9. మహిషాసురమర్దని (1959) 10. పోలీస్ కమీషనర్ (1994)

సినిమా క్విజ్ 95 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here