కాలేజీలో లెక్చరర్‌గా… ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా….

0
11

[box type=’note’ fontsize=’16’] కాలేజీలో లెక్చరర్‌గా… ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా…. సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]నీ[/dropcap]రజ్‌గారు వంగిపోయారు. కుంటుకుంటూ నడుస్తున్నారు. అక్కడ తన కోసం ఏర్పాటు చేయబడిన ఆఫీసు వంక చూసారు. మంగలాయతన్ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్, వైస్‌ఛాన్స్‌లర్‌గా నియామకం జరిగింది. వారు ఇంటి వరండాలోనే ఆఫీసుని ఏర్పాటు చేస్తున్నారు. వారు బీడీ తాగుతున్నారు. ఆయన ముఖంలో ఒకసారి ఆనందం, ఒకసారి కోపం, మరో సారి గర్వం, వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఆయన కొన్ని కొత్త విషయాల గురించి, చెప్పడం మొదలు పెట్టారు. “ఈ పదవి ఎంతో గౌరవప్రదమైనది. ఇది గవర్నర్ పదవితో సమానం. ఒకసారి ములాయమ్‌సింహ్‌ యాదవ్ ఎదురుకుండా పవన్‌కుమార్‌ జైన్ ఒక కార్యక్రమంలో దీన్ని గురించి ప్రస్తావించారు” అంటూ నలువైపులా దృష్టి సారించారు. పెద్దగా నవ్వారు – “చూసావుగా! ముందు చూస్తే నుయ్యి వెనకు చూస్తే గొయ్యి… (అక్కడ ఒక గుండ్రటి చెక్క బల్ల ఉంది) ఇప్పుడు ఎ.సి. లేదు, ఫాక్స్ మిషను లేదు, కంప్యూటరు లేదు, టెలిఫోన్ లేదు, టైప్ రైటర్ లేదు, టైపిస్టు లేడు. మూడు టేబుళ్ళు ఉన్నాయి. కాని కుర్చీలు లేవు. వాళ్ళు 30 వేలు పంపుతారు. నా పి.ఏకి 9 వేలు జీతం ఇవ్వాలి. 3 వేలు డ్రైవర్‌కి, 1 వెయ్యి స్వీపర్‌కి, 2,3 వేలు పెట్రోలికి ఖర్చవుతాయి. ఆఫీసు ఖర్చు.”

లోపలికి వచ్చి కూర్చున్నాము. మళ్ళీ ఆయన చెప్పడం మొదలు పెట్టారు – “ఈ మధ్య కొత్త-కొత్త పేర్లతో కొత్త కొత్త కాలేజీలు, సంస్థానాలు, విశ్వవిద్యాలయాలు వెలుస్తున్నాయి. ఇవన్నీ డబ్బుల ఉత్పత్తి చేసే కార్ఖానాలు. వీటి ద్వారా చదువు పేరిట వ్యాపారం, దొంగతనం జరుగుతున్నాయి.”

మంచం మీద ఒరిగారు. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. “నాకు విద్యాసంస్థలతో చాలా సంబంధం ఉంది. అందువలన వాటిలో ఉన్న లోపాలు, వాటి వలన ఉన్న లాభాల గురించి నాకు బాగా తెలుసు. రకరకాల అనుభవాలు నాకు ఎదురైయ్యాయి. 1955 లోని జరిగిన సంఘటన అది. మీరట్ కాలేజీలో ఒక సంవత్సరం కోసం టెంపరరీగా పని చేసాను. ఒక సంవత్సరం అయ్యాక మళ్ళీ పోస్ట్ కోసం అడ్వర్‌టైజ్‌మెంటు ఇచ్చారు. మేనేజ్‌మెంటు సభ్యుడు కూతురు ఎమ్.ఎ చేసింది. ఆయన తన కూతురికి అపాయింట్‌మెంట్ ఇప్పించాలనుకున్నాడు. ఆరు నెలలు పని చేస్తే స్కాలర్‌షిప్ దొరుకుతుంది. తరువాత విదేశాలకు వెళ్ళవచ్చు. విభాగాధ్యక్షుడికి నేనంటే పడదు. ఆయనతో నాకు వ్యతిరేకంగా ఒక ఉత్తరం రాయించారు. ఇదంతా మేనేజ్‌మెంటుకు తెలిసాక వాళ్ళల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. శ్రీ కమలాచౌదరి, మిత్తల్ అధ్యక్షుడు అమర్‌నాథ్‌గారు నా పక్షాన నలబడ్డారు. ఇంటర్‌వ్యూకి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఒకరు పని చేస్తున్నారు. అందు వలన మరొకరిని తీసుకోరని అందరికి తెలుసు. కాని అక్కడ మరో విధంగా పథకం నడుస్తోంది. ఇంటర్య్వూ మొదలు కాకముందు ఒక మీటింగ్ జరిగింది. డా.రాజారామ్‌జీ హిందీ విభాగ అధ్యక్షుడితో ‘మీరు రాసిన రిపోర్డు లోని విషయాలు నాకు తెలిసిపోయాయి. అందువలన ఇక ఈ రిపోర్టు సీక్రెట్ కాదు. అసలు ఇది సీక్రెట్‌గా ఉండాలి, ఈ టైమ్‌లో మాకు తెలియాలి. ఇక ఇప్పుడు ఇది అనవసరం. అందువలన చింపేయండి’ అన్నారు. చివరికి నన్ను అపాయింట్ చేసారు. రెండో రోజు ప్రిన్సిపాల్ మదన్‌మోహన్ నన్ను పిలిచారు. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. ‘ఈ అమ్మాయిని అపాయింట్ చేయడానికి నాకు వ్యతిరేకంగా అబద్ధపు రిపోర్టు రాసారు. ఇక ముందు కూడా ఇట్లాంటి రిపోర్డులు రాయరని ఎట్లా నమ్మాలి? ఏమో రేపు బలాత్కారం చేసాడని నేరం మోపవచ్చు. ఇక నేను ఇక్కడ పని చేయను. అపాయింట్‌మెంట్ లెటర్ వెనక్కి తీసుకోండి’ అని ఆయనకి చెప్పాను. ఆ సమయంలో నేను అలీఘడ్‌లోని కొందరితో మాట్లాడాను, అంతా చెప్పాను. ఇక్కడ ధర్మసమాజ్ కాలేజీలో అపాయింట్‌మెంటు అయినప్పుడు డా. జి.కె గహరానా సాహెబ్, సంత్‌లాల్ జైన్ మరో వ్యక్తి ఆయన పేరు గుర్తుకు రావడం లేదు, ఖిరినీ గోట్ దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు, ప్రిన్సిపాల్ ఝింగరన్ సాహెబ్ నన్ను కాలేజీలో తీసికోవలనుకున్నారు. కాని అప్పటి అధ్యక్షడు డా.మన్‌హర్‌లాల్‌ గౌడ్ – ‘అసలు ఈయన హిందీ కవితలు ఎక్కడ రాస్తారు? ఈయన హిందీని ఉర్దూలో రాస్తారు.’ అన్నారు. ‘మరి ఈయన ఇంగ్లీషులో కూడా కవితలు రాస్తారు.’ అని ఝింగరన్ అన్నారు. నిజానికి నేను వీళ్ళ ఋణం తీర్చుకోలేను. నా గడ్డు రోజులలో నాకు వీరు సహాయపడ్డారు. 1956లో ధర్మసమాజ్ కాలేజీలో చేరాను. 67,68 లో నేను రెండేళ్లు సెలవు తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాను.. నేను వెనక్కి వచ్చినాక 69లో ఝింగరన్ సాహెబ్ రిటైర్ అయిపోయారు. ఆయన స్థానంలో డి.ఎమ్.గుప్తా ప్రిన్సిపాల్ అయ్యారు. నా వెనక ఇక్కడ డా. శ్రీరామ్ శర్మ పన్నాగాలు పన్నడం మొదలు పెట్టాడు. ఈయన మగ పిల్లలను, డి.ఎమ్ గుప్తాని రెచ్చగొట్టాడు. నిరాశ చెంది 30 జనవరి 1970లో ధర్మసమాజ్ కాలేజీ నుండి రిజైన్ చేసాను. తరువాత ఒక సారి ఈ కాలేజీలో జరిగిన ఒక కవి సమ్మేళనానికి పిలిచారు. నేను వేదిక పై నుండి ధర్మసమాజ్ కాలేజీని ప్రశంసించాను. ‘ఇక్కడ నాకు ఎంతో సహాయం లభించింది’ అని చెప్పాను. అసలు నా జీవన ధ్యేయం ఏమిటంటే నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం. అసలు ఈ రెండిటికి ఏ షరతులు పెట్టనఖర లేదు. నిజాయితీగా ఉండటం నా స్వభావం. ఒక వేళ అవతల వాళ్ళు నీతి – నిజాయితీగా లేకపోయినందు వలన నేను ఏమాత్రం వాళ్ళ కోసం కిందకి దిగజారను. అసలు ఈ గుణమే నన్ను బద్ధ శత్రువుల నుండి ఎంత బాధపెట్టినా వాళ్ళని క్షమించే శక్తిని ఇచ్చింది. నేను క్షమించాను కూడా.”

“అందు వలనే నేను చెప్పాను. నేను విద్యాసంస్థల విషయంలో వింత-వింత పరిస్థితులను చూసాను. కాన్‌పూర్ డి.ఎ.వి కాలేజీలో యోగ్యత కాకుండా రికమేండేషన్స్ పైనే వ్యవహారం ఎట్లా నడుస్తుందో చెప్పాను.”

బయట నుండి సింగ్-సింగ్ పిలవడం వలన, వంగి నడుస్తూ మూలుగుతూ, లేచి బయటకి వెళ్ళారు. బయట ఆఫీసు నుండి బయటకి వెళ్ళి పని చూసుకుని వచ్చారు. నేత టైప్ ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడే నిల్చుని అతనితో మాట్లాడారు. అతడు కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు. నవ్వుతూ ఆయన లోపలికి వచ్చారు.

“ఆ… గుర్తుకు వచ్చింది. నేను రాజకీయాలలో కూడా ఒకసారి వెళ్ళాను. ఒకసారి 1956లో ఎలక్షన్లు వచ్చాయి. కాన్‌పూర్ నుండి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నిల్చోమని ప్రజలు కోరారు. నేను నిల్చున్నాను. నా కోసం ఒక అతను లౌడ్ స్పీకర్ రెండొందల ఏభై రూపాయలకు తీసుకున్నాడు. కొందరు తాము స్వయంగా, ఇంకా మరి కొందరు యువకులను తీసుకుని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అసలు నా దగ్గర కారు లేదు. బంగళా లేదు, స్కూటర్ లేదు, ఏదో కవి-సమ్మేళనాలలో పాల్గొంటున్నాను. అదే నా బతుకు తెరువు. అందరు ప్రచారం చేస్తున్నారు కాని స్పీచ్ ఇచ్చేవాడిని నేనొక్కడినే. మొదటి రోజునే నేను జనరల్ గంజ్‌లో స్పీజ్ ఇచ్చినప్పుటి నుండి అందరు నా వెనక రావడం మొదలు పెట్టారు. అరిచి-అరచి నా గొంతు పోయింది. మూడో రోజు మెస్టన్ రోడ్‌లో పెద్ద సభ జరిగింది. చాలా మంది ఆ వేదిక పై నుండి స్పీచ్ ఇవ్వాలనుకున్నారు. నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. కొందరు యువకులు వచ్చారు. నన్ను రమ్మనమని పదే పదే కోరారు. నేను అప్పుడు హోటల్ రూమ్‌లో ఉన్నాను. నన్ను బలవంతంగా తీసుకువెళ్ళారు. అక్కడ ఎవరో కాంగ్రెస్ నేత స్పీచ్ ఇస్తున్నాడు. నేను అక్కడికి చేరగానే ‘ఇక మీరు ఆపేయండి, నీరజ్‌గారు మాట్లాడుతారు’ అని ప్రజలన్నారు. ఏభై అరవై వేల మంది దాకా ప్రజలు అక్కడ ఉన్నారు. నేను స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఇంతలో ఎవరో వేరే పార్టీకి చెందిన వ్యక్తి బయట ఆవుని తోలాడు. గుంపంతా చెల్లా చెదరయ్యారు. ‘ఇదే మీ రాజనీతి అయితే నేను ఇక మాట్లాడను. అసలు ఈ ఛండాలన్ని శుభ్రం చేయాలని నా ధ్యేయం కాని మీరు చేయనీయరుగా….’ అని నేనన్నాను. హోటల్ రూమ్‌కి వచ్చేసాను. కమ్యూనిస్ట్ పార్టీని సమర్థించే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ‘నీరజ్ గారు పదిహేను రోజుల సమయం ఉంది. మీ దగ్గర ఏ సాధనాలు లేవు. మీరు ఎటూ గెలవరు, కాని మేం ఓడిపోతాం.’ అని అతను అన్నాడు. ‘నేను ఆలోచిస్తాను’ అని నేనన్నాను. నిజానికి అతను చెప్పిందాట్లో సత్యం ఉంది. అతని తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఒకతను వచ్చాడు. ‘నీరజ్‌గారూ మీరు మానేయకండి మేం మీకు ఓటు ఇస్తాం. ఓట్లు వేయిస్తాం. మీరు మానేస్తే ఈ బెనర్జీ మూడోసారి కూడా వస్తాడు’ అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాక మన్నులాల్ శర్మ ‘షీల్’ వచ్చారు. ఆయన కవి. ‘నీరజ్‌గారూ మీరు ఎటు గెలవలేరు. మీరు రామ్ అసరే‌ని సమర్థించండి’ అని సలహా ఇచ్చారు. నేను షీల్ గారిని పెద్దన్నయ్యలా భావిస్తాను. రామ్ ఆసరే కూడా మా ఇద్దరికి స్నేహితుడు. రామ్ ఆసరే నిజానికి వాళ్ళని వీళ్ళని బిచ్చం అడిగి ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. మరునాడు పెద్ద సభ జరిగింది. అందులో రామ్ ఆసరేని సమర్థించాను. నేను ఎలక్షన్ నుంచి తొలగిపోయాను. ఆ మరునాడు నాకు పాట్నాలో ఒక కవి సమ్మేళనం ఉంది. ఆ టైమ్‌లో నేను చూసిన రాజకీయాలు, ఈ నాటి కన్నా ఎంతో మెరుగ్గా ఉండేవి. బెనర్జీ కేవలం ఐదు వేల ఓట్లతో గెలిచాడు. ఒకవేళ నేను తొలిగి ఉండకపోతే నేనే గెలిచేవాడిని. కాన్‌పూర్ ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఇప్పటికీ ‘మీరు కాన్‌పూర్ వారే’ అని వాళ్ళు అంటూ ఉంటారు.

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here