కరోనా… కరోనా…

0
10

[dropcap]“డా[/dropcap]క్టర్ గారూ! కరోనా వచ్చింది”

“ఏంటీ.. కరోనా వచ్చిందా?” ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్.

“అవునండి” తేలికగా చెప్పాడు కంపౌండర్.

“డాక్టర్‍వి నువ్వా నేనా…?”

“అలా అంటారేమిటి డాక్టర్ గారూ… మీరే”

“అయినా వచ్చింది కరోనానో.. మరేదైనానో నిర్ధారించవలసింది నేను. నువ్వు కాదుకదా!”

“లేదండి. నిజంగా కరోనా వచ్చిందండి. కావాలంటే బయటికొచ్చి చూడండి”

“ఏమిటీ?.. కరోనా బైట ఉందా?”

“అవునండి ఆయ్ఁ”

కరోనా బైటుండడమేమిటో అర్థం కాక తెల్లమొహమేసుకొని డాక్టర్ తుర్‌మని బైటకి పరిగెత్తాడు. అతని వెంట కాంపౌండర్ కూడా పయనమయ్యాడు. వేగంగా డోర్ తీసుకొని బయటకొచ్చి చూసాడు డాక్టర్ ఆత్రంగా.. కరోనా రూపం ఎలాగుంటుందో చూద్దామన్న కుతూహలంతో, నలుదిక్కులా చూసాడు. ఏమీ కనబడలేదు.

“ఏదయ్యా! కరోనా?” కోపంగా అడిగాడు డాక్టర్.

“ఇదిగోనండి కూర్చున్న ఆవిడే కరోనా..” చెప్పాడు కాంపౌండర్.

“ఏమిటి ఈమె కరోనానా?”

“అవునండి. కావాలంటే ఆవిడనే అడగండి”

“ఏవమ్మా నీ పేరు కరోనానా?”

“అవును డాక్టరు గారూ!” అంది పేషంట్ కుర్చీలోంచి లేస్తూ.

“కరోనా అంటే మరేదో అనుకున్నాను.. మీరా?.. అయినా కరోనా అనే పదం ఈ మధ్య వచ్చింది కదా! మరి మీకా పేరు 40 ఏళ్ళ క్రితమే ఎలా పెట్టారు?” ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్.

“సార్ సార్.. ఆవిడ పేరు కరోనా కాదండీ.. కరుణ.. కరుణ.. మూడు నెల్లగా కరోనా పేరు ప్రపంచమంతా మారుమ్రోగుతండడటంతో ఆమె పేరే మర్చిపోయి, కరోనా అని ఫిక్సైపోయింది” పరుగు పరుగున వచ్చి ఆమె భర్త అసలు విషయం చెప్పాడు.

‘వార్నీ.. మూడు నెల్లకే అసలు పేరు మర్చిపోయేంతగా కరోన, ప్రపంచం పై తన ప్రభావాన్ని ఎంతగా చూపించింది” తల బరుక్కున్నాడు డాక్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here