కరోనా

2
7

[dropcap]అ[/dropcap]రే కరోనా /జరా సునోనా
నోరు మూసుకుని/ ఉధర్ ఖడోనా.
నీ అమ్మమ్మలు/ నీ అబ్బబ్బలు
ఎందరెందరో /తోకలు ముడిచార్.
కలరా కూచి/ ప్లేగు పెద్దమ్మా
T.B.తాత /డెంగ్యూ బావ
స్వైన్ ఫ్లూ అన్న,చికెన్ గున్యా
ఉప్పెనలాగా /మీద దూకినా
బెంబెలెత్తక /బ్రతికే వున్నాం.
నువ్వెంతా నీ /బతుకెంతా
నాణ్యత లేనీ /చైనా మేడువి.
నువ్వే౦చేస్తావ్/ఏమి పొడుస్తావ్?
మిగతా వైరస్ /భూతాల్లాగే
నీ లైఫూ ఓ /త్రై మాసికమే.
ఆ తరవాతా/టీకాలొస్తై
టేబ్లేట్లోస్తై/నిన్ను తరుముతై.
ఇంతదానికే /ఉలిక్కిపడితే
ఇంతకాలమూ /ఎలాగవున్నాం
నిన్నుమించిన /వన్నెలాడులను
ఎంతోమందిని /ఎపుడో కన్నాం.
నీతోపాటు /వారు అందరూ
వచ్చీపోయే /ప్రయాణీకులే.
మీ అందర్నీ /మించిన వాళ్ళని
చూపిస్తా నువు /చూస్తావా.
దమ్ముంటే /ఎదురొస్తావా
యుగాలనించీ /జనాలనెత్తిన
నాట్యం చేసే /మతాన్ని చూడు
మనుషులచంపే /కులాన్ని చూడు
పేదాగొప్పల /తేడా చూడు
రాజకీయాల /రొచ్చునుచూడు
క్షణ క్షణానికి /వామన మూర్తయ్
పెరుగుతున్న /అవినీతిని చూడు.
విపరీతంగా /విచ్చలవిడిగా
పెరుగుతున్న /కాలుష్యం చూడు

తరిగి పోతున్న /సమతను చూడు
తమకులపోల్లకే పీటలువేసే
సాటిలేని ధృతరాష్ట్రుల చూడు.
మానవత్వాన్ని /మట్టిలొకలిపే
ఆకలి చావుల /నృత్యం చూడు.
రైతన్నల /ఆక్రందన చూడు.
బడాబాబులకి /గొడుగులుపట్టే
బేంక్ లోన్ల /బండారం చూడు .
పధకాలేస్తూ/పొట్టలు పెంచే
ప్రభుత్వాల /నైపుణ్యం చూడు.
ఉచితంకోసం/బిచ్చగాళ్ళుగా
క్యూలో నిలిచే /ప్రజల్ని చూడు.
వేలఏళ్ళుగా /పాతుకుపోయిన
లంచమనే /మహమ్మారిని చూడు.
ఇన్నిదెయ్యాలు /చుట్టూవున్నా
బ్రతికే వున్నాం /బ్రతికే వుంటాం.
నిన్నగాక/మొన్నొచ్చినగుంటవి
నువ్వేం చేస్తావ్ /ఏంచెయ్య గలవ్?
పళ్ళు నూరకే /పిల్ల పిశాచీ
చెయ్యి వెయ్యకే /చైనా బూచీ
వచ్చిన చోటుకె /వెళ్ళకపోతే
అన్నీమానీ /నిన్నే తింటాం.
వైను గ్లాసులో /నిన్నేపోసీ
మంచు ముక్కతో /కలిపి మింగుతాం
మా ముందరనీ/కుప్పిగంతులా
మా ఎదటేనీ / విన్యాసాలా
వచ్చిన దారినె/వెనక్కి పో
నీ పుట్టింటికి/పరుగిడిపో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here