కరోనా సమయంలో అతివల సాహస యాత్ర – గ్వాలియర్

0
14

[box type=’note’ fontsize=’16’] కరోనా సమయంతో మహిళా మిత్రులతో తాము చేసిన గ్వాలియర్ సాహస యాత్ర గురించి వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]మే[/dropcap]ము ఎన్నో రోజుల నుంచి… దాదాపు రెండు నెలల నుండి… ఒక కార్యక్రమానికి వెళ్లాలని అందరం అనుకున్నాము అందులో లావణ్య, శోభ, పద్మ, వసంత, శ్రీ దేవీ, మాధవి మరియు కవిత వీళ్ళు అంతా ఎనిమిది మందిమి బయలు దేరాము. మాకు ఉదయానే ఆరు గంటలకి ప్లైట్ ఉంది. కరోనా సమయంలో మేము బయలుదేరడం అనేది చాలా చాలా సాహసమైన యాత్ర అనుకోవాలి. అతివల సాహస యాత్ర కరోనా సమయంలో!

మేము హడావిడిగా వెళ్ళడానికి ఉదయానే మూడు గంటలకి లేచి స్నానాలు చేసి మూడు ముప్ఫై నిమిషాలకు ఇంటి నుంచి భయాలుదేరాము. అపుడు నేను మా డ్రైవర్‌కి ఫోన్ చేసాను. కానీ డ్రైవర్ ఫోన్ ఎత్తట్లలేదు. చాలా కంగారు పడిపోయాను. ఈ లోపల శోభ గారికి ఫోన్ చేసాను. తను ఏం చెప్పింది – అంటే “మీరు ఉప్పల్ వరకూ రండి. నేను మిమ్మల్ని అక్కడక కలుస్తాను” అని. సరే అని చెప్పి నేను మా వారిని లేపి “ఏం అనుకోవద్దు అండి డ్రైవర్ ఫోన్ ఎత్తట్లలేదు. మీరు ఉప్పల్ వరకూ తీసుకువెళ్ళండి, అక్కడ నుంచి నేను శోభ వాళ్ళతో వెళ్లిపొతాను” అని చెప్పా. కాని ఈ లోపల మా డ్రైవర్ వచ్చాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాను.

January 2021 Explorer Narmada Reddy

అప్పుడు తొందర తొందరగా నా బట్టలు అన్నీ తీసుకొని ఒక బ్యాగ్, ఒక సూట్ కేస్ సిద్ధం చేశాను. మా వారు “ఒక సూట్ కేస్ తీసుకుపోకుండా, ఇంకో బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నావు?” అని గొడవ చేసారు. నిజమే, అది ఎక్కువ లగేజ్ అవుతుంది అని ఆయన ఉద్దేశము. కానీ నేను ఖాళీ బ్యాగ్ పట్టుకు వెళ్ళాను. ఎందుకు అంటే సూట్ కేసులో కొన్ని పట్టక పోతే దీంట్లో వెయ్యడానికి సులువుగా ఉంటుంది అని చెప్పి పట్టుకెళ్ళాను. మేము వెళ్ళాల్సిన ప్రదేశాలు ఏంటి అంటే మొదటిగా గ్వాలియర్ ఫోర్ట్, ఓర్చా, సాంచి, వింజోయని, భోపాల్, ఓంకారేశ్వర్, తిరిగి మళ్లీ పెవిలియన్ ఇది మా ప్లాన్. కానీ గ్వాలియర్‌లో రెండు రోజులు వుందాం అని బయలుదేరాము.

రెండు రోజులు అనుకున్న ప్రోగ్రాం కదా! ప్లెట్ దిగగానే రెండు కార్లు మాట్లాడుకున్నాం. రెండు కార్లు ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు వెయ్యి రూపాయలకే వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది. వెయ్యి రూపాయలకు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు రావటం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. వెయ్యి రూపాయలకు ఆ అబ్బాయితో మాట్లాడుకొని విమానాశ్రయం నుంచి ఒక దేవాలయానికి వెళ్ళాము. వినాయకుడి దేవాలయం. అక్కడ ఆ దేవాలయం చూసిన తరువాత సూర్య దేవాలయానికి వెళ్ళాము. సూర్య దేవాలయం చాలా అందంగా వుంది. లోపలి ఆ లోగిలిలోకి వెళ్తూంటే మా చుట్టూ ఒక ఇరవై నెమళ్ళు తమ విన్యాసాలతో మాకు కనువిందు చేసాయి.

వాటిని చూసుకుంటు లోపలికి వెళ్ళి ఆ సూర్య దేవాలయం చూస్తే పై నుండి కిందకు గూలాబి రంగుతోవున్న ఆ దేవాలయం ఎంత చక్కగా కట్టారంటే మన సూర్యుని ఏవి అయితే సప్త అశ్వములు అంటే గుర్రాలు లాగుతుంటాయో… అలా చక్కటి ఆ గుర్రాలు లాగుతున్నాయి. ఒక రథం లాగా ఆ దేవాలయాన్ని కట్టారు. చాలా అద్భుతమైన కళాసంపద అది.

చెప్పులు కింద ఒక దగ్గర విప్పేసి అవి అన్నీ చూస్తూ చుట్టూ తిరుగుతూ అందరమూ చక్కగా ఫోటోలు దిగాము. మేము మళ్ళీ కారు ఎక్కి హోటల్‌కి వెళ్ళాము. హోటల్ ఆయన ఒక్కటే రూమ్ ఇచ్చాడు, ఎందుకు అంటే అది చెక్-ఇన్ సమయం కాదు కాబట్టి. ఆ ఒక్క రూమ్‌లో మేము విశ్రాంతి తీసుకోన్నాం. కాసేపటికి అదే కార్లలో ఎక్కేసి గ్వాలియర్ ఫోర్ట్‌కి వెళ్ళాము. కోట బయట ఒక అబ్బాయి కలిసి “ఆరు వందలు అవుతుంది మేడమ్, గైడ్ తీసుకొండి” అని అడిగాడు. వేరే ఫ్రెండ్సుకి ఫోన్ చేశాను. “లేదు ఆరు వందలు కాదు, రెండు వందలకే వస్తారు అంట, అని ఇంకోకరు ఫోన్ చేసారు” అన్నాము. “అయితే నేను రెండు వందలకే వస్తా” అన్నాడు. “మరి నువ్వు ఆరు వందలు అంటున్నావు” అని అంటే “లేదు అమ్మా. నేను చెప్పిన తరువాత ఇవ్వండి డబ్బులు. అందరీలాగా కాదు నేను. చాలా పుస్తకాలు చదివి అన్నీ వివరంగా చెప్తాను మీకు” అన్నాడు. నిజంగానే ఆ అబ్బాయి బాగా చెప్పాడు. మేము మూడు వందల యాభైలో నాలుగు వందలకు మాట్లాడుకున్నాక కూడా ఆరు వందలు ఇచ్చాము. ఎందుకు అంటే అంత బాగా చెప్పాడు. దాదాపు నాలుగు గంటలు రాజసౌధం గురించి వింటూ చక్కటి ఫోటోలు తీసుకుంటూ నాలుగు గంటలు అందులోనే వున్నాము.

అందువలన అతనికి చాలా తృప్తిగా ఆరు వందలు ఇచ్చి వేసి అక్కడ నుంచి మేము సాస్ బాహు దేవాలయానికి వెళ్ళాము.

సాస్ బాహు దేవాలయం తరువాత అతి పూరతనమైన గూహల్లలో రాతి శిల్పాలు చుసి అక్కడ ఫోటోలు దిగి మధ్యాహ్నం భోజనం బయట చేసాము. భోజనం చేసిన తరువాత మేము అక్కడ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన చోటుకు వెళ్ళాము. లక్ష్మీబాయి ఇక్కడే చనిపోయింది అని చెప్పిన చోట ఒక విగ్రహం చూశాము. తరువాత ‘రాణి మాలిని దేవి’ సినిమా నటి తను కుతురు నాట్యం చేసిన ఒక చెరువు దగ్గరకి వెళ్ళాము.

అటూ ఇటూ తిరిగి కొన్ని ఫోటోలు తీసుకోని అక్కడ నుంచి తాన్‌సేన్ సమాధి వద్దకు వెళ్ళాము. దగ్గర దగ్గరగా ఒక కిలోమీటరు నడిచాము. ఆయన పాటలు పడినప్పుడు ఆ అంతస్తు కొద్దిగా వొంగిపోయింది అనీ; అంతే కాకుండా తాన్‌సేన్ పాడినప్పుడు వర్షాలు కూడా కురిసేవనీ; అంత మైమరచి పోతాయి ప్రతిదీ అనీ – నా చిన్నప్పుడు ఎప్పుడో పాఠశాలకు వెళ్ళే రోజుల్లో చదివాను, అవన్నీ గుర్తుకు వచ్చాయి లోపలికి వెళ్లేటప్పుడు. నాకు తాన్‌‌సేన్ అక్బర్ కాలంలో తొమ్మిది మంది వజ్రాలు లాంటి కవులలో ‌సాహితీవేత్లతలో ఒకరని తెలిసింది. ఈయన గురించి అక్కడ మొత్తం చాలా పెద్ద ఆవరణలో దాదాపు ఒక పది ఎకరాలు స్థలం ఉంది. అంత పెద్ద స్థలంలో చక్కటి అంతస్తులు వున్నాయి. ఆయన సమాధి అక్కడే వుంది. ఆయన సమాధికి మొక్కి తాన్‌సేన్ తిరిగిన అన్ని స్థలాలు చూసి బయటికి వచ్చిన తరువాత కాఫీ తాగాము. తరువాత మేము మళ్లీ షాపింగ్‌కి వెళ్ళాము. షాపింగ్ ఎంతో సేపు చేయలేదు, ఒక అరగంట అంతే. అక్కడి నుంచి బసకి వచ్చి చక్కటి భోజనం తిని నిద్రపోయాము. ఇది మొదటి రోజు. అయితే ఇందులో గ్వాలియర్ ఫోర్ట్ గురించి చెప్పాలి.

గ్వాలియర్ ఫోర్ట్:

గ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో ఒక ప్రధాన నగరం. గ్వాలియర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది డిల్లీకి దక్షిణంగా 343 కి.మీ దూరంలో ఉంది. ఇది ఆగ్రా నుండి 120 కి.మీ. దూరంలోనూ; రాష్ట్ర రాజధాని భూపాల్ నుండి 414 కి.మీ దూరంలోనూ ఉంది. ఢిల్లీ నగరానికి వలస వచ్చే వారి వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన కౌంటర్-మాగ్నెట్ నగరాల్లో ఇది ఒకటి. గాల్వియర్ భారతదేశంలోని గీర్ట్ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఈ చారిత్రక నగరాన్ని దాని కోటను అనేక ఉత్తర భారత రాజ్యాలు పాలించాయి. 10వ శతాబ్దంలో కచ్ఛపగతలు, 13వ శతాబ్దంలో తోమర్లు, ఆ తరువాత మొఘలులు, 1754లో మరాఠాలు, తరువాత 18వ శతాబ్దంలో సింధియాలు పాలించారు. 2016లో పట్టణ కాలుష్యంపై జరిపిన అధ్యయనంలో ఈ నగరం భారతదేశంలో అత్యధిక స్థాయిలో కాలుష్యం ఉన్న నగరమని, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని తేలింది.

గ్వాలియర్ మాజీ మధ్య భారత్ రాష్ట్రానికి శీతాకాలపు రాజధాని. తరువాత ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. భారత స్వాతంత్ర్యానికి ముందు గ్వాలియర్ బ్రిటిష్ పాలనలో సంస్థానంగా సింధియాలు స్థానిక పాలకులుగా కొనసాగింది. ఎత్తెన రాతి కొండలు నగరాన్ని అన్ని వైపులా నుండి చుట్టూ ముట్టి ఉంటాయి. ఉత్తరాన ఇది గంగా-యమున డ్రైనేజ్ బేసిన్‌కి సరిహద్దుగా ఉంది. అయితే ఈ నగరం కొండల మద్య లోపల ఉంది. గ్వాలియర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో గ్వాలియర్ నగరం, మెరార్ కంటోన్మెంట్, లష్కర్ గ్వాలియర్ (లష్కర్ ఉపనగరం), మహారాజ్ బడా, పూల్ బాగ్, తటీపూర్లు భాగంగా ఉన్నాయి.

పురాణాలు ప్రకారం గ్వలీపా అనే సిద్ధుడు ఇచ్చిన పానీయం తాగడంతో, స్థానిక అదిపతి సూరజ్ సేన్‌కు కుష్టు వ్యాధి నయం అయింది క్రీ.శ. 8వ శతాబ్దంలో అతడి పేరిట గ్వాలియర్ నగరాన్ని స్థాపించాడు. గ్వాలియర్ వద్ద లభించిన తొలి చారిత్రక రికార్డు హూణ పాలకుడు మిహిరకులుడు వేయించిన శాసనం. మిహిరకులుడి తండ్రి తోరమానుడు (493-515) ను కీర్తిస్తూ “(భూమి) యొక్క పాలకుడు, గొప్ప యెగ్యత కలిగిన వాడు, అద్బుతమూ తోరమానుండి పేరుతో ప్రసిద్ధి చెందాడు; వీరి ద్వారా భూమి ధర్మంగా పరిపాలించబడింది.” 9వ శతాబ్దంలో సర్జర-ప్రతీహర రాజవంశం గ్వాలియర్‌ను పాలించింది. తమ పాలనలో వారు తేలీ కా మందిర్ ఆలయాన్నీ నిర్మించారు. 1021లో గ్వాలియర్ ను మాహమూద్ నేతృత్వంలో దళాలు దాడి చేశాయి, కాని గ్వాలియర్ పాలకులు వారిని తిప్పి కొట్టారు.

1231లో ఇల్టుటట్మిష్ 11 నెలలు సుదీర్ఘ ప్రయత్నం తర్వాత గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుండి 13వ శతాబ్దం వరకు ఇది ముస్లింల పాలనలో ఉంది. 1375లో రాజా వీర్ సింగ్ గ్వాలియర్ పాలకుడయ్యడు అతను తోమర్ వంశ పాలనను స్థాపించాడు. వారి పాలన కాలంలో గ్వాలియర్ స్వర్ణ దశను అనుభవించింది

గ్వాలియర్ కోటలోని జైన శిల్పాలు తోమర్ పాలనలో నిర్మించారు. మాన్ సింగ్ తోమర్ తన కాలంలో భవంతి, మన్మందిర్ ప్రాసాదాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట వద్ద ఇప్పుడిది ఒక పర్యాటన ఆకర్షణ. బాబర్ “ఇది బారాతదేశపు కోటలలో ముత్యం వంటిది” అని ఈ కోట గురించి అభివర్ణించాడు. అక్కడ ఏర్పాటు చేసిన సౌండ్ లైట్ షో గ్వాలియర్ కోట, మన్ మందిర్ ప్రాసాదాల చరిత్ర గురించి చెబుతుంది. 15వ శతాబ్దం నాటికి, నగరంలో ప్రసిద్ధ సంగీత పాఠశాల ఉంది. ఇక్కడే తాన్‌సేన్ అభ్యసించాడు. తరువాత 1730లో, సింధియాలు గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఇది ఒక సంస్థానంగా మిగిలిపోయింది.

1857 తిరుగుబాటు:

గ్వాలియర్ 1857 తిరుగుబాటులో పాల్గొనపోవటానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా రాణీ లక్ష్మీబాయి తో సహకరించకుండా ఉండడమే దీనికి కారణం. 1858 మే 24న కల్పి (ఝాన్సీ) బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చిన తరువాత, లక్ష్మీబాయి గ్వాలియర్ కోట వద్ద ఆశ్రయం కోసం వెళ్ళింది. గ్వాలియర్ మహారాజా బ్రిటిష్ వారి బలమైన మిత్రుడు కావడంతో పోరాటం లేకుండా తన కోటను ఆమెకు వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ చర్చల తర్వాత, అతని దళాలు లొంగిపోయాయి. తిరుగుబాటుదారులు కోటను స్వాధీనం చేసుకున్నారు, వెనువెంటనే బ్రిటిష్ వారు గ్వాలియర్ పై దాడి చేశారు. లక్ష్మీబాయి వారితో యుద్ధం చేసింది, భారత దళాలు 20,000 కాగా, బ్రిటిష్ దళాలు 1600 మంది ఉన్నారు. లక్ష్మీబాయి పోరాటాన్ని భారత జాతీయ వాదులు ఈ రోజుకూ స్మరించుకుంటారు. ఆమె పోరాడుతూ మరణించింది. గ్వాలియర్ తిరుగుబాటుదారుల నుండి విముక్తి పొందింది. గుర్రంపై లక్ష్మీబాయి ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది, ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చేసిన కృషిని గుర్తు చేస్తోంది. తాంతియా తోపే, రావు సాహిబ్ తప్పించుకున్నారు. తాంతియాతోపే ఆ తరువాత 1859 ఏప్రిల్‌లో బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు.

గ్వాలియర్ సంస్థానం:

సింధియా ఓ వంశం. ఈ వంశం వారు 18, 19 వ శతాబ్దంలో గ్వాలియర్ రాజ్య పాలకులు. ఆ తరువాత భారతదేశం స్వతంత్రం అయ్యేవరకు బ్రిటిష్ ప్రభుత్వానికి మిత్రులు. స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులు.

సింధియాల పాలనలో గ్వాలియర్ రాజ్యం 18 వ శతాబ్దం రెండవ భాగంలో ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా మారింది. మూడు ఆంగ్ల మరాఠా యుద్ధాలలో ప్రముఖంగా కనిపించింది. 1780లో గ్వాలియర్ మొదటిసారిగా బ్రిటిష్ వారి చేతిలో ఓడింది. సింధియాలకు అనేక రాజపుత్ర రాజ్యాలపై గణనీయమైన అధికారం ఉండేది. అజ్మీర్ రాజ్యాన్ని జయించారు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు దళాలు బ్రిటీషు వారి చేతిలో ఓడే వరకు కొద్దికాలంపాటు నగరాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు సింధియా కుటుంబం గ్వాలియర్‌ని పాలించింది. మహరాజా జివాజిరావ్ సింధియా తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో కలిపారు. గ్వాలియర్‌తో పాటు అనేక ఇతర సంస్థానాలని భారతదేశంలో కల్పినాడు. గ్వాలియర్ అనేక ఇతర సంస్థానాలలో కలిసి మధ్య భారత్ అనే కొత్త భారత రాష్ట్రంగా అవతరించింది. జివాజిరావ్ సింధియా రాష్ట్ర రాజు. ప్రముఖంగా 1948 మే 28 నుండి 1956 అక్టోబరు 31 వరకు (మధ్య భారత్‌ను మధ్య ప్రదేశ్‌లో విలీనం చేసిన అంతవరకు) పనిచేశారు.

1962 లో మహారాజ జివాజీరావ్ సింధియా వితంతువు అయిన రాజమాత విజయరాజే సింధియా లోక్‌సభకు ఎన్నికయింది. ఎన్నికల రాజకీయాలలో తమ కుటుంబానికి ప్రాతినిధ్యాన్ని  ప్రారంభించింది. ఆమె మొదట కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, తరువాత భారతీయ జనతా పార్టీలో ప్రభావితమైన సభ్యురాలు అయ్యారు. ఆమె కుమారుడు, మహారాజా మాధవరావు సింధియా 1971లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 2001లో మరణించేవరకు కాంగ్రెస్ లోనే పనిచేశాడు‌. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతని కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా గతంలో 2004లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సీటుకు ఎన్నికయ్యాడు. 2020లో ఆతడు భారతీయ జనతా పార్టీలో చేరాడు.

మన గ్వాలియర్ ఫోర్ట్ చూశాక మేము గ్వాలియర్ నుంచి సాస్ బహు దేవాలయానికి వెళ్ళాము. ఇది స్థానికంగా చాలా ప్రసిద్ధికెక్కిన దేవాలయం. ఇది 9, 10 శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయము. ఇందులో విశిష్టత ఏమిటి అంటే అత్త కొరకు ఒక దేవాలయం, కోడలి కొరకు ఒక దేవాలయం. ఒకటి విష్ణు దేవాలయం కాగా, ఇంకొకటి కృష్ణ దేవాలయం. ఈ రెండు దేవాలయాలు చాలా ప్రసిద్ధి కెక్కినవి. ఇవి చాలా చక్కటి శిల్పకళా సౌందర్యం తోటి ఎంతో అందంగా కట్టించిన దేవాలయాలు. ఎంత అందంగా ఉన్నాయి అంటే ప్రతి స్తంభం కూడా శిల్ప సౌందర్యంతో అలరాలుతుంది. ఈ దేవాలయాలు చూసుకోని మేము గ్వాలియర్ నుంచి ఓర్చా బయలుదేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here