Site icon Sanchika

కరో‌నా

[dropcap]ఎ[/dropcap]గిరే పిట్టకు ఏది కరోనా
నీటిలో చేపకు ఏది కరోనా

వీథిలో కుక్కకు ఏది కరోనా
చెరువులో కప్పకు ఎక్కడ కరోనా

మరి ఓ‌ నరుడా….!
నీకెందుకురా ఈ కరోనా

సృష్టిని తెలివిగ ఏమారుస్తూ
ప్రకృతిని వికృతిగ మారుస్తూ
అంతా నా ఇష్టమంటూ
ఎల్లలు దాటి కల్లలు నేర్చి
భూమాతను కొల్లగొడుతూ

విలయతాండవం చేసే ఓ నరుడా
కరోనా నీకు కాక ఇంకెవరికి

జాలి లేని మానవుడా
కరుణ లేని కరోనా
అది నీ ప్రతిరూపమే సరేనా

నీ బుధ్ధి మార్చుకో
తప్పులు సరి దిద్దుకో
సనాతన ధర్మం పాటించు
వికృత చేష్టలు చాలించు

ధర్మో రక్షతి రక్షితః

Exit mobile version