విపులమైన సమాచారంతో ‘కోవిడ్-ఎయిడ్స్-నేను’

0
11

[dropcap]‘కో[/dropcap]విడ్-ఎయిడ్స్-నేను’ ఈ పుస్తకాన్ని వెలువరించిన రచయిత డాక్టర్ యనమదల మురళీకృష్ణ. కోవిడ్, ఎయిడ్స్‌కి సంబంధించిన అనేక సమాచారం విపులంగా అందించారు ఈ పుస్తకంలో. నిజానికి ఈ రచయిత డాక్టర్ కావడం వల్ల ఎయిడ్స్ మీద తనకంటూ కొన్ని ఆలోచనలు, అనుభవాలను వైద్య వృత్తిలో ప్రవేశపెట్టి, పలువురికి ఉపయోగపడే ప్రయోగాలు చేశారు. అలాగే 2020 తర్వాత ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మీద కూడా తనదైన శైలిలో కొన్ని పరిశోధనలు, ప్రయోగాలు చేసి వైద్య రంగంలో తనదైన సహకారాన్ని, ప్రయోజనాన్ని అందించారు.

ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమమైన ఫేస్‌బుక్‌లో అనేక వ్యాసాలు ఎప్పటికప్పుడు అందిస్తూ కరోనా సమయంలో రోగులు వైద్యుల్ని సంప్రదించలేని స్థితిలో కూడా ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా అనేక సలహాలు సూచనలు, సేవలు అందించారు. అటువంటి చిన్న వ్యాసాలు, వైద్య వృత్తిలోని కొన్ని సమాచారాలు, పరిశోధనలు, పరిశోధన పత్రాలు ఇవన్నీ ఈ పుస్తకంలో చూడవచ్చు.

35 శీర్షికలతో కోవిడ్ గురించి, 25 శీర్షికలతో ఎయిడ్స్ గురించి, 50 శీర్షికలలో తన ఆలోచనలు, ఆశయాలు, సామాజిక సేవ, తన గురించి.. తన వాళ్ల గురించి అనేక విషయాలు స్ఫూర్తి కలిగించేవిగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఈ రెండు రకాల రోగాల బారిన పడే వారికి ఈ పుస్తకం చేత ఉంటే, మానసికంగా ఎంతో ధైర్యాన్ని కలిగించడంతో పాటు, కొంతమేరకు రోగికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకునే వీలు కలిగిస్తుంది. ఇప్పటికే పలు ముద్రణలకు నోచుకున్న ఈ పుస్తకం, ఎంత జనాదరణ పొందుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

***

కోవిడ్-ఎయిడ్స్-నేను (రెండు ప్రపంచ పీడల నుంచి లక్షలాదిమందికి భరోసా)
రచన: డాక్టర్ యనమదల మురళీకృష్ణ,
పేజీలు:164
వెల: ₹ 200/-
ప్రతులకు: డాక్టర్ యనమదల మురళీకృష్ణ,
4-50, పెట్రోల్ బంకు దాటాక,
ఇంద్రపాలెం, కాకినాడ 533 006. 94910 31492
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు
https://www.amazon.in/COVID-AIDS-NENU-Dr-Yanamadala-Murali-Krishna/dp/B09WDXMVJ9

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here