డేటింగ్‌ యాప్‌!

1
8

[dropcap]హై[/dropcap]దరాబాద్‌ రామంతపూర్‌. సిల్వర్‌లైన్‌ టవర్స్‌. ఐదో ఫ్లోర్‌. మన్మథరావు సోఫాలో కూర్చుని స్మార్ట్‌ టీవీలో ‘పోర్న్‌’ వీడియో చూస్తున్నాడు. దానిలోని దృశ్యాలు అతనిలో రక్తాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. వీడియో పూర్తవగానే టీవీ ఆఫ్‌ చేసి బెడ్‌ రూంలోకి వెళ్ళాడు. అక్కడ అతని భార్య సురతి, ఫోటోలో నవ్వుతూ దర్శనమిచ్చింది. ఆమె ఫోటో ముందు నిల్చుని సినిమాల్లోలాగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు మన్మథరావు.

“రతీ! నీవు చనిపోయి అప్పుడే ఐదేళ్లు కావస్తూంది. నీవు అనారోగ్యం పాలయ్యేవరకూ నన్ను శృంగారాంబుధిలో ఓలలాడించావు. కొడుకేమో అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలయ్యాడు. కోడలు కూడ మంచిదే పాపం! అక్కడికి వచ్చేయమని వీళ్లు చెబుతూనే ఉంటారు! పోయినేడాది వెళ్ళి మూడు నెలలుండేసరికి విసుగొచ్చేసింది. వచ్చేశాను. ఎందుకో ఈ మధ్య సెక్స్‌ సుఖాల కోసం మనస్సు వెంపర్లాడుతూంది రతీ! అలా ఆలోచించి నీకన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తూంది. సరే. గుడ్‌ నైట్‌ డియర్‌!”

మంచం మీద వాలి స్మార్ట్‌ ఫోన్‌ తెరిచాడు. మెయిల్స్‌, వాట్సాప్‌ సందేశాలు చూసుకున్నాడు. మెసేజ్‌లోకి వెళ్లాడు. లేటెస్ట్‌ మెసేజ్‌ ఒకటి అతన్ని ఆకర్షించింది. ఇంగ్లీషులో వుందది. దాని సారాంశం ఇది.

“ఒంటరితనం ఫీలవుతున్నారా! మరేం దిగుల్లేదు. మాతో చేరి మీ జీవితాన్ని పరిమళ భరితం చేసుకోండి! వెంటనే ఈ నంబరుకు కాల్‌ చేయండి. పాయల్‌” అని ఒక నంబరిచ్చారు.

“పరిమళ భరితం అంటే ఏమిటబ్బా!” అని ఆలోచించాడు మన్మథరావు. ‘అదేనేమో!’ అనుకున్నాడు. అతని మనసు పులకరించింది. భార్య ఫోటోకు సారీ చెప్పాడు. టైం ఇంకా రాత్రి పది దాటలేదు! ఇలాంటి వ్యవహారాలకు ఇదే మంచి సమయం అనిపించింది! వెంటనే ఆ నంబరుకు డయల్‌ చేశాడు. కోవిడ్‌ జాగ్రత్తలన్నీ విధిలేక విన్న తర్వాత రింగు వెళ్లసాగింది అటు నుంచి ఒక చక్కని గొంతు ఆన్సర్‌ చేసింది.

“హాలో! హూఈజ్‌ కాలింగ్‌!”

“కోయల్‌ జీ, నమస్తే” అన్నాడు మనవాడు.

కిలకిలా నవ్విందా గొంతు!

“మై కోయల్‌ నహీ! పాయల్‌ హు! ఫోన్‌ కర్నేకేలియే ధన్యవాద్‌! ఆఫ్‌ హిందీ మే బాత్‌ కర్‌ సక్‌తే?”

“ఓకె ఐకెన్‌ అండర్‌స్టాండ్‌. బట్‌ మై హిందీ అచ్ఛీ నహీ హోతీ!”

“నో యిష్యూ సర్‌ హమారా సర్వీసెస్‌కే బారేమే బోల్‌ రహా హూ. ధ్యాన్‌ సే సునియే”

ఆమె చెప్పిన దానికి తెలుగు సేత ఇది.

“మొదట రెండు వేలు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. వ్యాలిడిటీ 3 నెలలు. హై ప్రొఫైల్‌ తేదీని మీకు ‘సంధాన’ పరుస్తాము. ఆమెతో మీరు చాటింగ్‌, డేటింగ్‌ మరియు ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌ కూడ చేయవచ్చు. మీ వయసును బట్టి మీరు ఆమె వయస్సును సెలెక్ట్‌ చేసుకుంటారు. వారానికి రెండు సార్లు ఆమెను మీటవవచ్చు. మీరున్న నగరంలోనే! ఇదంతా అత్యంత గోప్యంగా వుంటుంది. మీ ప్రైవసీకి పూర్తి భద్రత . పోలీసులు, కెమెరాలు, బ్లాక్‌ మెయిలింగ్‌ లాంటివేమీ ఉండవు. మా సంస్థ పేరు ‘డేట్‌ అండ్‌ మేట్‌’ మాకు ఇండియా అంతటా నెట్‌వర్క్‌ ఉంది. ప్రతివారం మీ భాగస్వామిని మార్చుకోవచ్చు. మీరు నా నంబరుకు గూగుల్‌ పే చేయండి. ఎప్పుడు చేస్తారు?”

“రేపుదయాన్నే. సరేగాని ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌ అంటే ఏమిటి పాయల్‌జీ!” అన్నాడు మన్మథుడు.

మళ్లీ కిలకిల నవ్వు! “మీరు అమాయకులేం కాదని నాకు తెలుసు. చక్కగా సెక్స్‌ని ఎంజాయ్‌ చేయండి! గుడ్‌ నైట్‌ సర్‌!”

***

రాత్రంతా నిద్రలేదు మనవాడికి. అన్నీ మధురమైన ఆలోచనలే. ఎంతో కొంత గిల్టీనెస్‌ కూడ ఉన్నది పోయింది. ఉదయం స్నానం, పూజ (?) ముగించి, స్విగ్గీలో ‘ఫీు కారందోసె’ తెప్పించుకని తిన్నాడు. షుగరు, బి.పి. టాబ్లెట్స్‌ వేసుకున్నాడు. పాయల్‌కు రెండువేలు గూగుల్‌ పే చేసేశాడు. పది నిమిషాల్లో వాట్సాప్‌కు మెసేజ్‌! “ఈ లింక్‌ పై నొక్కి, వచ్చిన ఫారంపై మీ వివరాలను నింపండి” పారం ఇలా ఉంది. నింపసాగాడు.

పేరు: కాసేపు ఆలోచించి. కె.యం. రావు అని టైపు చేశాడు. వయస్సు : 52 అని వేశాడు. (కాని అతని వయస్సు 57 సం॥ ఉంటుంది. ముందుగానే వి.ఆర్‌. తీసుకున్నాడు) వృత్తి : బ్యాంక్‌ మేనేజర్‌ ఫోన్‌ : నం. అడ్రస్‌ ఎందుకైనా మంచిదని మార్చి యిచ్చాడు. తన ఫోటోల్లో బాగున్నది ఒకటి పెట్టాడు.

ఏదో ఉద్వేగం మన్మథరావును కుదురుగా నిలవనివ్వడం లేదు.

మధ్యాహ్నం రైస్‌, సాంబారు, పెరుగుతో భోజనం ముగించాడు. సాయంత్రం వాట్సాప్‌ మెసేజ్‌!

“దయచేసి మీకు పంపిన ఫోటోల్లో నుండి ఒకటి సెలెక్ట్‌ చేయండి!”

ఆరు ఫోటోలున్నాయి! అందరూ బాగున్నారు. వక్షోజాలు, తొడలు పాక్షికంగా కనపడేలాగ ఫోజులిచ్చారు. అందరి వయస్సులూ ఇంచుమించు 40-45 సం॥ల మధ్య ఉండొచ్చుననుకున్నాడు. మూడో ఫోటోలో ఉన్నామె నచ్చింది! దాన్ని సెలెక్ట్‌ చేసి పంపాడు.

అరగంటలో పాయల్‌ పాప ఫోన్‌!

“మన్‌మద్‌రన్‌ జీ! మేడమ్‌సే బాత్‌ హువా! వో భీ తైయార్‌హై! ఆప్‌ బీస్‌ హాజర్‌ రూపయే (20,000/-) పే కర్‌నా పడేగా! కాషన్‌ డిపాజిట్‌! హాయ్‌ ఏ అమౌంట్‌కో రిఫండ్‌ కరేంగే, ఆప్‌కీ రిజిస్ట్రేషన్‌ పీరియడ్‌ పూరా హోనేకీ బాద్‌!”

“ఈ విషయం మీరు నాకు ముందే చెప్పలేదే!”

కిల కిల నవ్వు తర్వాత “ఇప్పుడు చెబుతున్నాకద సార్‌! డబ్బు అందిన వెంటనే మా కంపెనీ ఐడి కార్డు, మేడం పేరు, ఫోన్‌ నం. అడ్రస్‌ యిస్తాం. వారంలో రెండు రోజులు మీరు ఆమెతో ఎంజాయ్‌ చేయవచ్చు. మంజూర్‌ హై?”

“గివ్‌ మీ టెన్‌ మినిట్స్‌! అని కట్‌ చేశాడు. ఇందులో ఏదైనా మోసం ఉందేమో అని ఆలోచించాడు. ఇరవై వేలు తనకు లెక్కకాదు. అదీ రిఫండబుల్‌ అంటున్నారు. డెందములో సందడి చేస్తున్న కోరికలు, ఫోటోలోని మేడం అందాలు అతన్ని ప్రేరేపించాయి. ఇరవై వేలు పంపేశాడు!

అరగంటలోపే వివరాలన్నీ వచ్చాయి. ఆమె నంబరుకు ఫోన్‌ చేశాడు. డయల్‌ చేస్తూంటే చేతులు వణికాయి. అవతల్నించి కోమల స్వరం.

“హలో! మన్మథరావుగారేనా? వెల్‌కం డియర్‌!”

మన్మథరావు నరాలు జివ్వుమన్నాయి!

“యస్‌ డియర్‌! హౌ ఆర్యూ స్వీటీ!” అన్నాడు. గొంతు హస్కీగా మారింది.

“మీరు ఈ రోజు రాత్రి డిన్నర్‌కి రాగలరా?” అన్నదా స్వీటీ.

“తప్పకుండా! మీరు తెలుగువారా!”

“కాదు. కాని చాలాకాలం నుండి హైదరాబాద్‌లో ఉండటం వల్ల తెలుగు బాగా వచ్చు. లోకేషన్‌ షేర్‌ చేస్తున్నాను. రాత్రి 7 గం॥ కల్లా వచ్చేయండి. ఎదురు చూస్తుంటా!” ఒక కిస్‌తో ఫోన్‌ పెట్టేసింది.

మన్మథరావు ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నాయి. టైము చూశాడు ఐదయింది. టీ పెట్టుకొని తాగాడు. ఇంకా రెండు గంటలు. లోకేషన్‌ చూశాడు. హయత్‌నగర్‌. ఫరవాలేదు. నలభై నిమిషాల రైడ్‌ అనుకున్నాడు.

ఇన్‌స్టెంట్‌ హెయిర్‌ డై వేసుకొని, బ్రష్‌ చేసి, వేడినీళ్ళతో స్నానం చేశాడు. ఆ రోజే షేవ్‌ చేసుకున్నాడు. బ్లాక్‌ జీన్స్‌ పాంటు మీద, ఎల్లో అండ్‌ వైట్‌ చెక్స్‌ ఉన్న టీషర్టు వేసుకున్నాడు! సెంటు స్ప్రే చేసుకున్నాడు. షూ వేసుకుని డోర్‌ లాక్‌ చేసి, సెల్లార్‌లో ఉన్న బ్రెజ్జా కారులో కూర్చుని స్టార్ట్‌ చేశాడు. ఎదురుగ్గా ఉన్న చిన్న వేంకటేశుని విగ్రహానికి దండం పెట్టుకున్నాడు.

ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌, ఎల్‌.బి.నగర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా విజయవాడ హైవే ఎక్కాడు. వనస్థలిపురంలో ఒకచోట బొకేలు అమ్ముతున్నారు. పసుపుపచ్చని గులాబీలతో కట్టిన ఒక పుష్ప గుచ్ఛం కొని, పక్కసీటులో పెట్టుకున్నాడు. హయత్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ దాటి అర కిలోమీటరు వెళ్లాక కాలనీ బోర్డు కనబడింది. అన్నీ యిండివిడ్యుయల్‌ ఇళ్లే అక్కడక్కడా ఖాళీ ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయి ప్లాట్‌ నం 38 వద్ద కారాపి దిగాడు మన్మథరావు.

గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు. బజర్‌ మోగించిన వెంటనే ‘స్వీటీ’ బయటకు వచ్చింది తలుపుతీసి ఫోటోలో కంటె బాగుంది. ఆకుపచ్చ కాటన్‌ చూడీదార్‌లో వుంది. బాబ్డ్‌ హెయిర్‌. కొంచెం బొద్దుగా ఉంది. పైన దుపట్టా వేసుకోలేదు. పైన స్తనాల మీద చీలిక స్పష్టంగా కనిపిస్తూంది.

బోకే ఆమెకందించాడు. “థ్యాంక్యూ డియర్‌”! అన్నదామె నవ్వుతూ! లిప్‌స్టిక్‌ వేసిన పెదవులు దానిమ్మ పూరేకుల్లా మెరుస్తున్నాయి! మైమరుపుగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

“యు ఆర్‌ లుకింగ్‌ మ్యాన్లీ అండ్‌ స్మార్ట్‌!” అన్నది స్వీటీ. “ప్లీజ్‌ కమ్‌!” అంటూ హాల్లోకి దారి తీసింది. సోఫాలో కూర్చున్నారిద్దరూ. ఆమె ఏమాత్రం సంకోచించకుండా అతన్ని ఆనుకుని కూర్చుంది. ఆమె మెత్తని శరీరం అతనికి తగులుతూ అతనిలో శృంగార స్పందనలు కలిగిస్తూ ఉంది.

“మీరు బ్యాంక్‌ మేనేజరా?”

“అవును ఈ మధ్యే వి.ఆర్‌. తీసుకున్నా. మీ పేరు?”

“సవిత. సవితా అగర్వాల్‌. మీ మిసెస్‌..”

“లేరు ఐదేండ్ల క్రిందట పోయారు.”

“వెరీ శాడ్‌. మా హబ్బీ దుబాయ్‌లో బిజినెస్‌ చేస్తారు? ఆరు నెలలకొకసారి వస్తారు”

లోపలికి వెళ్ళి వేయించిన జీడిపప్పు ఒక ప్లేట్‌లో తెచ్చింది.

“డుయు టేక్‌ డ్రింక్స్‌”

“నో థాంక్స్‌ కాఫీ విల్‌ డు”

“ముందు డిన్నర్‌ చేద్దామా, లేక…” అంటూ కవ్వింపు నవ్విందామె.

అంటూనే అతని తోడమీద చేయివేసి, అభిముఖంగా తిరిగింది.

“డోంట్‌ ఫిల్‌ నర్వస్‌. మైడియర్‌” అంటూ తన అధరాలనతని అధరాలకందించింది. ముద్దు రుచి అతన్ని స్వర్గపు అంచులవరకు తీసుకొని వెళ్లింది.

“ఫీల్‌ ప్రీ డియర్‌” అంటూ అతని చేతిని తన వక్షస్థలం మీద వేసుకుందామె. ఆమె రొమ్ము మెత్తగా, వెచ్చగా తగిలింది. ఒత్తితే మత్తుగా మూల్గిందామె.

“పదండి! బెడ్‌రూంకు వెళ్దాం” అంటూ లేచింది. ఈలోపే ఆగలేక ఆమెను గట్టిగా కౌలిగించుకొని మరోసారి మోవిసుధను గ్రోలాడు. అతనికి గాలిలో తేలినట్లుగా ఉంది.

బెడ్‌రూం చాలా బాగుంది. ఎ.సి నడుస్తూంది. ఆమె తన డ్రస్‌ విప్పేసింది. మనవాడూ డిటో. ఒక అరగంట పాటు రతిపారవశ్యంలో మునిగాడు. మన్మథుడు ఎ.సి.లో కూడ చెమటలు పట్టాయి. అతని మగసిరి సార్థకమయింది!

“గుడ్‌ పర్‌ఫార్మెన్స్‌ మైడియర్‌!” అన్నదామె అతని పెదవులను ముద్దాడి.

తర్వాత డిన్నర్‌. పుల్కాలు, కాబూలీచనా కుర్మా, వెజ్‌ బిర్యాని, రైతా, మిఠాయి కిళ్లీ. తొమ్మిదికి బయలుదేరాడు. “మళ్ళీ ఎప్పుడు?” అనడిగాడు ఆమెను.

“ఈ వారంలోనే త్రీడేస్‌ తర్వాత. విత్‌ బ్రేక్‌ఫాస్ట్‌!” అన్నదామె నవ్వుతూ.

ఆమెను దగ్గరకు తీసుకుని పెదవులు గాఢంగా చుంబించి వదిలాడు!

***

రెండో మీటింగ్‌ కూడా మధురంగా జరిగింది. ఈసారి చాలా ఫ్రీగా పాల్గొన్నాడు. వచ్చేముందు సవిత అన్నది గోముగా

“మరి నాకేమీ గిఫ్ట్‌ ఇవ్వరా?”

“తప్పకుండా. ఏం కావాలి?”

“ఒక యిరవై వేలు నా అకౌంట్‌కు ట్రాన్స్‌‌ఫర్‌ చేయండి. చాలు” అంటూ అతని బుగ్గలు నిమిరింది సుతారంగా అదే మైకంలో సెల్‌ తీసి, ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తియ్యని ముద్దిచ్చింది మళ్లీ!”

వచ్చేవారం పాయల్‌జీ ఫోన్‌ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్‌ చేయమంది. మళ్లీ అదే ఎపిసోడ్‌ నడిచింది. ఈసారి ఎ.ఎస్‌ రావు నగర్‌లో. స్వీటీ పేరు నీరజ. ఆతిథ్యం, శృంగారం అదే స్థాయిలో ఉన్నాయి. ఇరవై వేలు వదిలాయి. ఈ లెక్కన నెలకు ఎనభై వేలు కావాలి! కానీ, అంత సుఖం లభిస్తూంటే, డబ్బు కోసం చూసుకోకూడదనుకున్నాడు.

నెల తర్వాత మన్మథరావు సెల్‌కి నాలుగు వీడియోలు వచ్చాయి అవి చూసి కొయ్యబారి పోయాడు! పది నిమిషాలకే పాయల్‌ పాప ఫోన్‌! వెంటనే పదిలక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, లేకపోతే ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో, నెట్‌లో పెడతామనీ బెదిరించింది. అందులో అతగాడి కామ కలాపాలన్నీ ఉన్నాయి!

ఇరుక్కుపోయానని గ్రహించాడు మన్మథరావు. చచ్చినట్లు పది లక్షలూ సమర్పించుకున్నాడు. తర్వాత నాలుగు రోజులకు జననాంగం మీద చిన్న చిన్న పొక్కులు లేచాయి. మూత్రం పోసేటప్పుడు మంట! సుఖ వ్యాధుల స్పెషలిస్ట్‌ను సంప్రదించి, ఇంజక్షన్స్‌, మందులు వాడి నయం చేయించుకన్నాడు. ఎయిడ్స్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. రిజల్టు వచ్చేంతవరకు నరకయాతన! కానీ నెగెటివ్‌ వచ్చి స్థిమిత పడ్డాడు.  భార్య ఫోటో మందు నిల్చుని పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకుని కన్నీరు కార్చాడు.

ఇంతలో ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది.
వణుక్కుంటూ వెళ్ళి చూశాడు.
మీకు సుఖరోగం వచ్చిందా?? ఏమీ భయపడకండి. డాక్టర్ మన్మధ రావు ఎస్.డీ ట్రీట్మెంట్ ఆప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఆన్ లైన్ ట్రీట్ మెంట్ వుంది. గుప్తరోగాలకు గుప్తంగా  చికిత్స చేయబడును !!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here