దౌష్ట్యానికి సమర్థన!!!!

0
14

[ఇజ్రాయిల్‍పై హమాస్ దాడుల గురించి Warren Bonham రాసిన కవిత.]

[dropcap]శాం[/dropcap]తియుతంగా సాగింది ఓ నిరసన ప్రదర్శన
దురదృష్టవంతులు  కొందరు  మరణించారు.

నిరంతరం  ప్రమాదం పొంచివుండే తమ పిల్లలు ఆడుకునేందుకు
హమాస్  కోరుకుంది  మరింత గగనతలం

గాల్లోకి ఎగిరిన ఆ పిల్లలు, ఓ గుంపుని చూశారు.
నిలువెల్లా వణికిపోయారు.
ఆ గుంపు పాడే సంగీతం ఎంత బిగ్గరగా వుందంటే
గత కాలపు భయంకరానుభూతులు జాగృతమయ్యేంత

ప్రమాదంలో ప్రాణాలున్నాయని భావించారు
ఆయుధాలు సిద్ధంగా నేలపై దిగారు

కంగారులో తుపాకీలు పేలేందుకు సిద్థం అని మరిచారు
భయంలో పొరపాటు జరిగింది
ట్రిగ్గర్ పై వేలు జారింది

బుల్లెట్లు బిరబిరా వెలువడ్డాయి,   రక్తం చిందింది,
అన్నారు కొందరు దీన్ని జాతి విధ్వంసం అని

జాతి వివక్షతో కల్పించిన ఆబద్ధం అది
తుపాకీ పేల్చిన ప్రతి బాలుడూ బాధపడ్దాడన్నది నిజం
మరణించకుండా  బ్రతికిన  ప్రతీ బాలికనూ
వారి సంక్షేమం కోసం  తీసుకెళ్ళారు తమ మురికివాడలకు..

***
దౌష్ట్యానికి శిక్ష బదులు లభిస్తే సమర్థన.
దారితీస్తుందది మరింత దౌష్ట్యానికి..
ఈ నిజం గ్రహించని వారితో
ఎప్పుడోకప్పుడు తప్పదు యుద్ధం..

అనువాదం: సంచిక టీమ్.

మూల కవిత చదవాలనుకునే వారి కోసం..

Excusing Evil

A peaceful protest just took place,
and some unlucky people died.
Hamas just wanted more air space
where at-risk kids could paraglide.

As their kids soared, they saw a crowd,
and they were frightened to their core.
The pulsing music was so loud,
it brought past trauma to the fore.

Their lives at stake, or so they thought,
they landed with their weapons drawn.
In all the panic, they forgot
that no one had their safety on.

Somehow, each trigger finger slipped,
because each kid was terrified.
So, bullets flew and then blood dripped,
in what some called a genocide.

But that’s a xenophobic lie,
since clearly each kid felt quite glum.
They helped each girl who didn’t die
by bringing them back to their slum.

***

Excusing evil just brings more
when evil has no consequence.
At some point there is always war
Against those lacking common sense.

– Warren Bonham

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here