దీపావళీ అమావస్య

0
9

[box type=’note’ fontsize=’16’] ఏవి వెలిగించి ఆనంద కాంతులు ప్రసరించాలో, ఏది అసలైన దీపావళో చెబుతున్నారు శంకర ప్రసాద్ ఈ కవితలో. [/box]

[dropcap]అ[/dropcap]మావస్య చీకటిని
దీపావళి కాంతులు
తొలగిస్తాయి

ఓ నేస్తమా..‌.
మన అజ్ఞానపు చీకటి
ఎలా పోతుంది…

మమతల మతాబులు
నవ్వుల కాకరపువ్వొత్తులు
ఆత్మీయ తారాజువ్వలు
ప్రేమ చిచ్చుబుడ్లు
జోకుల టపాకాయలు

వెలిగించి, ఆనంద కాంతులు
ప్రసరించి, మానవత్వాన్ని
బతికించు, అజ్ఞానాన్ని అంతం చెయ్

అదే అసలైన దీపావళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here