దేశ విభజన విషవృక్షం-21

0
11

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]‘ఇ[/dropcap]లా కాదు.. ఇలా జరిగింది’ అని పందిని నంది చేయటం అన్నది బహుశా మన దేశ చరిత్ర విషయంలో మాత్రమే జరిగి ఉంటుంది. పుట్టి పదిహేను వందల ఏండ్లయినా కాని మతమని చెప్పుకొనే ఒకానొక సామాజిక వ్యవస్థ వేల ఏండ్లుగా సమస్త విశ్వానికి మార్గదర్శనం చేసిన మహోజ్జ్వలమైన, వైభవోపేతమైన ధార్మిక సాంస్కృతిక వ్యవస్థను కూలదోసే కుటిల యత్నం చేస్తుంటే.. గుడ్లప్పగించి చూస్తున్న శాసక వర్గం ప్రపంచంలో మనది మాత్రమేనేమో. ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకొన్న ప్రతి ముస్లిం రాజు.. ఒకరిని మించి ఒకరు హింసకు, పర్వర్షన్‌కు, లైంగిక పైశాచికత్వానికి, ఊచకోతలకు, అరాచకత్వానికి, నియంతృత్వానికి, విచ్చలవిడితనానికి, విధ్వంసానికి.. కుతుబ్‌ మినార్ల మాదిరి నిలబడితే.. మన పరీక్ష పత్రాలలో మాత్రం వారి వైభవాన్ని కీర్తిస్తూ.. విద్యార్థులు జవాబులు రాయాల్సిన పరిస్థితి. తరాలకొద్దీ చరిత్ర కాని విషయాలను చరిత్ర అని చెప్పుకొంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది నిజమని చెప్పుతుంటే.. విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. 8 వందల ఏండ్లుగా శాసకవర్గం ఈ దేశంలో ఈ సమాజాన్ని తన దుర్నీతితో తప్పుడు చర్యలతో ప్రభావితం చేస్తూనే ఉన్నది. శాసకవర్గం అంటే కేవలం పాలకులు కాదు. శాసకవర్గం అంటే.. పాలకులు, సమాచార ప్రసార మాధ్యమాలు, కళాకారులు, అధికారులు, యజమానులు.. ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే వర్గాలన్నీ కలిస్తేనే శాసకవర్గం అవుతుంది. ఈ శాసక వర్గం ఈ దేశంలో స్వధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి చేస్తున్న కుట్రలకు ఇస్లాం అన్నది ఒక టూల్‌గా బాగా పనికి వస్తున్నది. ఇవాళ ఏడున్నర దశాబ్దాల స్వతంత్రభారత జీవనంలో 25 శాతానికి చేరువైన తరువాత కూడా మైనార్టీలనే ట్యాగ్‌లైన్‌ వాళ్లకు కొనసాగుతూనే ఉంటుంది. అదే హిందూ దేవుళ్లను.. ధర్మాన్ని.. ఎవడు పడితే వాడు అడ్డగోలుగా తిట్టవచ్చు.. ఎవరైనా తిరగబడితే.. భౌతిక దాడులు చేయవద్దు.. అతడు తప్పు చేస్తే రాజ్యాంగం శిక్షిస్తుందని తెగ వాపోతుంటారు. అత్యంత నీచంగా విలువల వలువలు విసిరేసి తుగ్లక్‌ల మాదిరిగా నగ్న నృత్యాలు చేసేవాళ్లు వీరు. ఈ దేశంలో మొట్టమొదట చేయాల్సిన పని.. విద్యార్థుల మెదళ్లలో విషాన్ని నింపడాన్ని వెంటనే నిలువరించాలి. మన విద్యార్థులు ఇకపై ఎంతమాత్రం పున్నమి నాగుల్లా మారవద్దు. చరిత్రను చరిత్రగా చెప్పండి. మంచి చెడులు వాళ్లే తెలుసుకొంటారు. కానీ.. ఈ దేశంలో ఒక అభిప్రాయాన్ని సృష్టించి.. దాన్ని కల్పించి.. దాన్ని మెదళ్లలోకి చొప్పించే ప్రయత్నాలకు తక్షణం ముగింపు పలకకపోతే.. ఈ దేశం మరింత భయంకరంగా మారిపోతుంది.

అల్త్‌మష్‌ ఢిల్లీ పీఠాన్ని ఏలిన బానిస ముస్లిం రాజుల్లో ఒకడు. మహమ్మద్‌ ఘోరీ దగ్గర బానిసగా, హంతకుడిగా, గ్యాంగ్‌స్టర్‌గా పనిచేసిన కుతుబుద్దీన్‌కు అల్లుడు ఇతడు. నిరంకుశానికి మారుపేరు.. ముస్లిం పాలకుల్లో పరమ దుర్మార్గుడు. నీచుడు. పైశాచికత్వానికి పరాకాష్ట. భారతదేశ ధర్మాన్ని, సామాజిక జనజీవనాన్ని దారుణంగా ముంచేసిన వాడు. ఇతడిని ఇల్త్‌మష్‌ అని కూడా పిలుస్తారు. సుల్తాన్‌గా ఇతడు పెట్టుకొన్న పేరు షంషుద్‌ దున్యా వావుద్దీన్‌ అబ్దుల్‌ ముజఫర్‌ అల్త్‌మష్‌. ఇతడు తుర్కెస్తాన్‌కు చెందిన అల్బరీ తెగకు చెందినవాడు. ఇతడి నిరంకుశత్వానికి సొంత కుటుంబ సభ్యులే భయపడిపోయిన పరిస్థితి.

»how deeply hated these muslim tyrants were, not only by strangers but even their own kith and kin, may be judged from the fact that his own brothers being highly jealous of his physical allure ‘enticed him away from his father and mother with the pretence of going to see a drove of horses’ (tabakat-i-nasiri E&D, vol II p.320).

అల్త్‌మష్‌ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండేవాడు. ఇతడికి తన రూపలావణ్యాలు బాగా కలిసి వచ్చాయి. మరింత రెచ్చిపోయాడు. దారుణమైన లైంగిక చిత్రహింసలకు పాల్పడ్డాడు. ఇతడు హోమో సెక్సువల్‌ మనిషి. బానిసలను కొని.. అమ్మి.. వాళ్లతో అత్యంత నీచమైన లైంగిక చర్యలకు పాల్పడిన దుర్మార్గుడు. ముస్లిం రాజుల పాలనలో రాచరికపు వాతావరణమే ఇంత దారుణంగా ఉండేది. ప్రతి ఒక్క ముస్లిం రాజు కూడా ఒక విషనాగులాగానే ప్రవర్తించాడు. వాళ్ల రక్తంలోనే ఈ రకమైన జీన్‌ ఉన్నదేమో.

అల్త్‌మష్‌ చరిత్రను చూస్తే.. విచిత్రమనిపిస్తుంది. అల్త్‌మష్‌ను అతని సోదరులే ఇంటి నుంచి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి ఒక నరహంతకుడికి ఒక గాడిదను అమ్మినట్టు అమ్మేశారు. అతడు ఒక గుర్రాల వ్యాపారి. అతడు అల్త్‌మష్‌ను అడ్డగోలుగా వాడుకొని.. బుఖారాకు తీసుకొని వెళ్లి అక్కడ ఒక స్థానికుడైన హాజీ బుఖారీకి అమ్మేశాడు. అతడి నుంచి మరో వ్యాపారి జమాలుద్దీన్‌ చస్క్‌ కాబా అనే వ్యక్తి ఇతడిని కొనుక్కొన్నాడు. ఈ జమాలుద్దీన్‌ అనేవాడు ఎంత దారుణమైన వ్యక్తి అంటే.. మనిషి మాంసంతో కూడా వ్యాపారం చేసేవాడు. అందుకే అల్త్‌మష్‌ లాంటి హ్యాండ్‌సమ్‌ పర్సనాలిటీని మహమ్మద్‌ ఘోరీకి అమ్మితే.. మంచి ధర వస్తుందని నమ్మాడు. ముస్లింల రాజ్యాల్లో బానిసల అమ్మకాలు కొనుగోళ్లు అనేవి సర్వ సాధారణంగా జరిగేవి. వీటినెవరూ ప్రశ్నించలేదు. ఇవాళ స్వేచ్ఛా ప్రణయం పేరుతో సాగుతున్న విచ్చలవిడి బూతు వ్యవహారాలకు ఇదిగో ఈ ముస్లిం రాజుల పైశాచిక పోకడలే ఆజ్యం పోశాయేమో. బానిసల అమ్మకాల్లోనూ వ్యాపారులు రోజుకో కొత్త సూత్రాన్ని పాటించేవారు. జంట బానిసలను అమ్మడం అన్నది ఆరోజుల్లో తెగ డిమాండ్‌ ఉన్న వ్యాపారం. ఒక బానిసకు మరో బానిసను జతచేర్చి.. హిట్‌ పెయిర్‌ అని వేలం వేసేవారు. ఈ వేలం ఎంత భయంకరంగా ఉండేదంటే.. బానిసను నిలబెట్టి అతడి ఒక్కొక్క అంగాన్ని చూపిస్తూ.. ఒక్కో అంగానికి ఎంత విలువ కట్టవచ్చో తేల్చేవారు. వెకిలి చేష్టలు చేస్తూ.. ఒక్కో అంగంపై వెకిలి మాటలు మాట్లాడుతూ.. వ్యాపారం చేసేవారు. చివరకు అన్నింటికీ విలువ కట్టిన తరువాత.. వేలం పాట సాగేది. బహుశా ఇంత పైశాచికంగా ఒక మనిషిని అతడి అంగ సౌష్టవం ఆధారంగా.. సెక్స్‌ అప్పీల్‌ ఆధారంగా.. ఒక హోమో సెక్సువల్‌ సరుకుగా అమ్మిన సందర్భాలు ముస్లిం రాజుల కాలంలో తప్ప మరెక్కడా జరిగినట్టు కనిపించదు. వినిపించదు. కానీ.. ఈ విషయాలు మన చరిత్రకారులు ఎవరూ కూడా చర్చించరు. మాట్లాడరు.

అల్త్‌మష్‌ను కూడా మరో బానిసతో జత చేశాడు జమాలుద్దీన్‌. మొదట వాళ్లిద్దరినీ కలిపి రెండు వేల దీనార్లకు అమ్మకానికి పెట్టాడు. అంటే ఒక్కొక్కరికీ వెయ్యి దీనార్లన్నమాట. ఇందులోనూ అల్త్‌మష్‌ మరీ అందంగా ఉండటంతో అతడి రేటును పెంచేశాడు. కనీవినీ ఎరుగని రీతిలో భయంకరమైన రేటు పెట్టడంతో మహమ్మద్‌ ఘోరీకి కోపం వచ్చింది. అతడిని కొనేది లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు.. ఎవరూ కూడా అల్త్‌మష్‌ ను కొనరాదని ఆదేశాలు జారీచేశాడు. నిరాశచెందిన జమాలుద్దీన్‌ వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దాదాపు మూడేండ్ల పాటు అల్త్‌మష్‌.. బుఖారాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు అల్త్‌మష్‌ ఒక స్టాక్‌ లాగా మిగిలిపోవాల్సి వచ్చింది. మూడేండ్ల తరువాత అల్త్‌మష్‌ కాస్త ముదిరిపోవడంతో క్లియరెన్స్‌ సేల్‌కు పెట్టాల్సి వచ్చింది. ఘజ్‌నీలో క్లియరెన్స్‌ సేల్‌ పెట్టినప్పటికీ, ఘోరీ ఆదేశాలు అమల్లో ఉన్నందువల్ల అతడిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందరూ అతడి కండ్లలో హోమో సెక్సువల్‌ పోకడలను గమనించసాగారు. చివరకు అతడిని వదిలించుకోవడానికి జమాలుద్దీన్‌ ఒకరి తరువాత ఒకరి వద్దకన్నట్టుగా, ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా ముస్లిం ప్రముఖుల ఇండ్లకు వెళ్లి అడగసాగాడు. ఈ క్రమంలోనే కుతుబుద్దీన్‌ (ఘోరీ అనుచరుడు) జమాలుద్దీన్‌కు దొరికాడు. భారత్‌లో అతివాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కుతుబుద్దీన్‌ నాయకత్వం వహిస్తున్నాడు. అప్పటికే కుతుబుద్దీన్‌ అప్పటికే భారత్‌ నుంచి దోచుకొన్నంత దోచుకొన్నాడు. ఆడ, మగ తేడా లేకుండా వేలు, లక్షల మంది బానిసలను ఎత్తుకెళ్లి హారెమ్‌లలో పెట్టుకొన్నాడు. మగవాళ్ల గృహాలు, ఆడవాళ్ల గృహాలను ప్రత్యేకంగా నిర్వహించేవాడు. అల్త్‌మష్‌ను చూసిన తరువాత అతడిని కొనడానికి కుతుబుద్దీన్‌ ఘోరీ అనుమతి కోరాడు. కుతుబుద్దీన్‌ సరఫరా చేసే ఆయుధాలు, సైనిక బలగాలు, భారత్‌లో సంపన్నుల నుంచి దోచుకొచ్చిన సంపదపై ఎక్కువగా ఆధారపడిన ఘోరీ.. కుతుబుద్దీన్‌ మాటను మన్నించాడు. ఘోరీ తన ఆదేశాలను పూర్తిగా సవరించలేదు. జమాలుద్దీన్‌ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలందరీనీ తీసుకొని.. ఢిల్లీకి వెళ్లి అక్కడ అమ్మకానికి పెట్టమన్నాడు. అప్పటికి ట్రాన్సాక్షన్‌ పూర్తయింది. అల్త్‌మష్‌ను ఢిల్లీలో అమ్మారు. అప్పటికి అతడు మరో బానిసతో జత కలిసే ఉన్నాడు. వాస్తవానికి కుతుబుద్దీన్‌ కూడా ఒక బానిసే. ఈ అల్త్‌ మష్‌ పెయిర్‌ ను కొనడానికి లక్ష చితల్‌ (కరెన్సీ) లను అందించాడు.

ఇక్కడి నుంచి అల్త్‌మష్‌ దశ తిరిగింది. బాడీగార్డులకు చీఫ్‌గా నియమితుడయ్యాడు. కానీ అతడి అందం అతడికి శత్రువుగా మారింది. అతడి బాస్‌ కుతుబుద్దీన్‌ అతడిని కామాతురుడై చూసేవాడు. తబాకత్‌ ఇ నసిరి గ్రంథం ప్రకారం.. కుతుబుద్దీన్‌ ప్రపంచం ముందు అల్త్‌మష్‌ను తన కొడుకు అని చెప్పేవాడు. తన సన్నిహితుడిగా దగ్గరే ఉంచుకొనేవాడు. కానీ అతడి దృష్టి మాత్రం హోమో సెక్సువల్‌ గానే ఉండేది. అల్త్‌మష్‌పై కుతుబుద్దీన్‌ లైంగిక దృష్టే.. లైంగిక వినియోగం.. అతడిని తొందరగా ఎదిగేట్టు చేసింది. ఒక పదవి తరువాత ఒక పదవి వరించుకొంటూ పోయింది. కుతుబుద్దీన్‌ సైన్యంలో ప్రత్యేకంగా ఉన్న హంట్స్‌మన్‌ (వేటగాళ్లు) దళానికి అధిపతి అయ్యాడు. తన దళాన్ని తీసుకొని గ్వాలియర్‌ ప్రాంతానికి వెళ్లి.. అక్కడ అరాచకం సృష్టించి వచ్చాడు అల్త్‌మష్‌. అత్యంత క్రూరంగా విధ్వంసం చేసి వచ్చాడు. బరాన్‌ జిల్లాను నాశనం చేశాడు. అక్కడి ప్రజలపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. దీంతో బరాన్‌ జిల్లా దాంతోపాటు బదౌన్‌ను అల్త్‌మష్‌ ఫ్యూడల్‌ ఎస్టేట్‌గా మార్చేశాడు కుతుబుద్దీన్‌.

ఇదే సమయంలో మహమ్మద్‌ ఘోరీ వైభవం మసకబారింది. అంద్‌ఖుద్‌ యుద్ధంలో హిందూ రాజుల చేతిలో పరాజయం పాలయ్యాడు. ముఖ్యంగా కోఖర్‌ (గక్కర్‌) తెగ ప్రజల తిరుగుబాటుతో ఘోరీ దారుణంగా దెబ్బ తిన్నాడు. దీంతో ఘోరీకి సహాయంగా కుతుబుద్దీన్‌, అల్త్‌మష్‌ సైన్యాన్ని వెంటేసుకొని వెళ్లారు. అందరి సైన్యం కలిసి తెగబడ్డా.. హిందువులు వెంటబడి వెంటబడి ఒక కుక్కను వేటాడినట్టు వేటాడారు. ఘోరీ ‘ప్రైవేట్‌’ సందర్భాలను అల్త్‌మష్‌ అవకాశంగా మలచుకొన్నాడు. అల్త్‌మష్‌ను చక్కగా చూసుకోవాలని ఘోరీ ఆదేశించినట్టుగా కుతుబుద్దీన్‌కు సమాచారం అందింది. అల్త్‌మష్‌ను బానిస నుంచి విముక్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో.. అల్త్‌మష్‌ పూర్తిగా బానిసత్వం నుంచి విముక్తుడయ్యాడు.

కుతుబుద్దీన్‌ చనిపోయిన తరువాత అల్త్‌మష్‌ పూర్తిగా ఢిల్లీ పీఠంపై పట్టు సాధించాడు. అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు. దాదాపు పాతికేండ్లపాటు ఢిల్లీ రాజ్యాన్ని ఏలాడు. అతడి అధికారాన్ని ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న హిందూ రాజులు అంగీకరించలేదు. వాళ్లు ఢిల్లీ అవతల ఒక్కటిగా ఏర్పడి తిరుగుబాటు చేశారని తబాకత్‌ గ్రంథం రికార్డు చేసింది. అల్త్‌మష్‌ రాజ్యంలో ఏ ఒక్క రోజు కూడా ప్రశాంతత లేదు. ప్రతి రోజూ అనిశ్చితి, అశాంతి, హింస కానీ వీటిని సరిచేయడానికి, ప్రశాంతత నెలకొల్పడానికి సుల్తాన్‌ ఏ ఒక్క క్షణమైనా ప్రయత్నించలేదు. యమునా నదీ తీరంలో హిందూ సైన్యాలకు, అల్త్‌మష్‌ సైన్యాలకు మధ్యన తీవ్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చచ్చీచెడీ విజయం సాధించాల్సి వచ్చింది. పంజాబ్‌ ప్రాంతాన్ని పాలించిన నసీరుద్దీన్‌ కబాచా, అల్త్‌మష్‌ మధ్య కూడా చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. లాెర్‌, తబర్‌ హింద్‌, కహరమ్‌ ప్రాంతాలు ఇతడి ఆధీనంలో ఉండేవి. చాలా సంవత్సరాలు నిర్విరామ పోరాటాన్ని తట్టుకోలేక కబాచా ఓడిపోయాడు. ఇతని సమయంలో వివిధ ప్రాంతాల్లో అధిపతులుగా, పాలకులుగా ఉన్నవాళ్లకు, తురకలకు మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఉదాహరణకు ఘజ్‌నీ వారసుడిగా ఎదిగిన సుల్తాన్‌ తాజుద్దీన్‌ ఖ్వారిజ్మ్‌ సైన్యం చేతిలో ఘోరమైన ఓటమి పాలై.. బానిసలకే బానిస అయిన అల్త్‌మష్‌ తనకు ఆశ్రయమిస్తాడన్న ఆశతో లాహోర్‌కు పరుగులు పెట్టాడు. అతడి సహాయంతో తిరిగి తన పూర్వ వైభవం తెచ్చుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ, పంజాబ్‌ గడ్డపై తాజుద్దీన్‌ను చూసిన అల్త్‌మష్‌.. అప్పుడప్పుడే నెత్తిన పెట్టుకొన్న తన కిరీటానికి ఎక్కడ ప్రమాదకారిగా మారతాడో అని భయపడ్డాడు. అతడిని పంజాబ్‌ భూభాగంలో లేకుండా చేయాలని నిశ్చయించుకొన్నాడు. 1215లో తాజుద్దీన్‌తో యుద్ధం జరిగింది. ఈ తాజుద్దీన్‌కు భారత భూభాగంలో సహకరించేవారే లేకపోయారు. ఎందుకంటే.. అతడు ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియదు. చిత్రహింసల ద్వారా మతం మార్చుకొన్న హిందువులకు కూడా అతడి గురించి తెలియదు. దీంతో తాజుద్దీన్‌ ఓడిపోవటం సహజమే అయింది. అతడిని బంధించి ఖైదుచేసి ఢిల్లీకి తరలించాడు అల్త్‌మష్‌. అక్కడి నుంచి దూరంగా ఉన్న దౌన్‌ జిల్లాకు తీసుకొని వెళ్లి.. అక్కడ తాజుద్దీన్‌ను హతమార్చాడు. ఇతడి హయాంలో హిందువులు మాత్రమే కాదు.. సుల్తాన్‌ సొంత కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా అణచివేతకు గురయ్యారు. ఏ ముస్లిం రాజు హయాంలో కూడా లేనంత అణచివేతలు ఈతడి హయాంలో దారుణాతి దారుణంగా కొనసాగాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here