దేశ విభజన విషవృక్షం-36

0
9

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]సూ[/dropcap]ఫీ స్కూలు నుంచి వచ్చిన మేధావులే భారతదేశంలో షరియాను కఠినంగా అమలుచేసేందుకు కటిబద్ధంగా పనిచేశారనడంలో సందేహం లేదు. పైకి ఎంత సాధువుల్లా కనిపించినా.. వారు శాంతి సామరస్యానికి వ్యతిరేకంగానే పనిచేశారు. పొరపాటున ఎవరైనా నిజంగా సాధువుగా వ్యవహరిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేసేశారు. 11వ శతాబ్దంలో రుక్నుద్దీన్ అనే ఒక సూఫీ.. ఈ ఇన్‌టాలరెంట్ (అసహన వాదం) అనే ఇస్లాం ప్రధాన స్రవంతిలోని సంప్రదాయానికి భిన్నంగా ప్రజల మధ్యన సామరస్యం కోసం ప్రయత్నించినందుకు అతడిని దారుణంగా చంపించారు. ‘people killed Ruknuddin and some of his followers; they tore him into pieces and broke his bones into fragments’ ఇదొక్కటే చాలు సూఫీల వ్యవహారశైలి ఎలాంటిదో చెప్పేందుకు. కొందరు సూఫీ సిద్ధాంతకర్తలు, ఉలేమాల గురించి ఒక అవలోకనం చేద్దాం. భారతీయ ముస్లింలు తమ సిద్ధాంతకర్తగా భావించే ఇమామహ ఘజాలీ.. ముస్లింలందరికీ ఇచ్చిన సలహా ఏమిటో ఒక్కసారి చూడండి..

“.. one must go on jihad at least once a year.. one may use catapult them when they are in a fortress, even if among them are women and children. One may set fire them and/or drown them.. one must destroy their useful book.. jihadists may take booty whatever they decide.

ధిమ్మీల నుంచి జిజియా పన్ను వసూలు చేయడంపై ఘజాలీ ఏమన్నాడో ఒక్కసారి చదవండి..

‘the jews, Christians and the majians must pay jizyah.. on offering up the jizyah, the dhimmi must hang his head while the official takes hold of his beard and hits on the protuberant bone beneath his ear.. ..

They are not permitted to ostensibly display their wine or church bell.. their houses may not be higher than the muslims. No matter how low that is. The dhimmi may not ride an elegant horse or mule. He may ride donkey only if the saddle is of wood. He may not walk on the good part of the toad. They have to wear patches.. and even in the public bath. They must hold their tongues”

ఘజాలీ చెప్పిన ఈ ఆదేశ సూత్రాలనే ఆ తరువాత వచ్చిన నిజాముద్దీన్ ఆలియా, మొయినుద్దీన్ చిష్టీ వంటి వారు.. తుచ తప్పకుండా ఆచరిస్తూ వచ్చారు. 1238-1325 మధ్యన జీవించిన నిజాముద్దీన్ ఔల్యా హిందువుల అంతిమ గమ్యం నరకంలోని అగ్ని కీలలేనని గట్టిగా విశ్వసించాడు. ఇతను జిహాద్‌ను గట్టిగా సమర్థించినవాడు. ఆయన మాటల్లోనే వినండి.. “the unbelievers at the time of death will experience punishment. At that moment, they will profess belief (Islam) but it will not be reckoned to unseen.. the faith of (an) unbeliever at death remains unacceptable.. on the day of resurrection.. the will also go to hell.. he (Allah) has created paradise and hell for believers and the infidels (respectively) in order to repay the wicked for what they have done”

ముల్తాన్‌లో నసీరుద్దీన్ ఖబాచా ప్రకటించిన జిహాద్‌లో నిజాముద్దీన్ పాల్గొన్నాడు కూడా. ఈయన సూఫీలతో కలిసి జిహాదీ నిర్వహించడానికి ఒక నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించాడు. ఈయన కంటే కాస్త ముందు వచ్చిన వాడు క్వాజా మొయినుద్దీన్ చిష్టీ. అజ్మీర్‌లో ఇవాళ భారతదేశంలోని సమస్త రాజకీయ నాయకులూ.. సినీ ప్రముఖులు.. అంతా వెళ్లి ప్రార్థనలు చేసే ప్రఖ్యాత దర్గా ఈయనదే. ఈయన సమాధిపైనే మనవాళ్లంతా వెళ్లి చాదర్లు కప్పి ప్రార్థనలు చేసి వస్తుంటారు. ఈ సూఫీకి హిందువులు అంటేనే పరమ అసహ్యమైన మాట. 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ వెంట జిహాద్‌లో పాల్గొంటానని చెప్పి భారత్‌కు వచ్చాడు. ఆయన ముందుగా వచ్చింది రాజస్థాన్ లోని అజ్మీర్‌కు. అక్కడ ఆయన ముందుగా చూసింది అనాసాగర్ సరస్సు చుట్టూ ఉన్న అనేక దేవాలయాలను. అల్లా, మహమ్మద్ ప్రవక్తల సహాయంతో ఈ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అజ్మీర్‌లో తాను పూర్తిగా సెటిల్ అయిన తర్వాత తన ఆలోచనను అమలు చేశాడు. ముందుగా ప్రతి రోజూ ఒక ఆవును ప్రతి దేవాలయం ముందు నరికేయాలని తన అనుచరులకు ఆదేశించాడు. ఆ ఆవుల మాంసంతో వండిన కబాబ్ లను తినాలని కూడా ఆదేశించాడు. ఇతను పృథ్వీరాజ్ చౌహాన్‌తో మహమ్మద్ ఘోరీ చేసిన యుద్ధంలో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. గమ్మత్తేమిటంటే.. తనకు దివ్య శక్తులు ఉన్నాయని.. ఆ దివ్య శక్తుల కారణంగానే మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్‌ను గెలిచాడని మొయినుద్దీన్ అనుకొన్నాడు. ‘నేను పిఠోరా (పృథ్వీరాజ్)ను పట్టుకొని ముస్లిం సైన్యానికి అప్పగించాను’ అని చెప్పుకున్నాడు కూడా. అక్బర్ ఉల్ అఖ్యార్ రాసిన అబ్దుల్ హక్ మొహద్దీస్ తన రచనలో ఈ యుద్ధాన్ని గురించి వివరిస్తూ బందీ అయిన ఒక హిందూ రాణిని మొయినుద్దీన్ అనుచరులు ఆయనకు అప్పగించారు. ఆమెతో లైంగికంగా సంభోగించిన మొయినుద్దీన్ ఆమె ద్వారా సంతానాన్ని కూడా కన్నాడు. ఇవాళ చాలా మంది హిందువులు అజ్మీర్ దర్గాకు వెళ్లి అక్కడ చాదర్లు కప్పి వస్తుంటారు. కానీ.. వారికి మొయినుద్దీన్ ఎవరో, ఏమిటో.. అతడి చరిత్ర ఏమిటో కూడా సరిగా తెలియదు. ఎవరూ చెప్పరు కూడా.

అమీర్ ఖుస్రూ గురించి వినని వారు ఉండరేమో.. ఈయన నిజాముద్దీన్ ఔల్యా శిష్యుడు. సూఫీయిజంలో లిబరలిస్టు. మార్క్సిస్టు చరిత్ర కారులైతే.. ఈయన్ను ఆకాశానికెత్తారు. భారతదేశానికి భగవంతుడు ప్రసాదించిన వరంలాగా ప్రచారం చేశారు. సంగీతానికి, కవిత్వానికి ఆయన చేసిన కృషి అద్వితీయమైనది. ఖవ్వాలీ సంప్రదాయాన్ని ఈయనే అభివృద్ధి చేశారని చెప్తారు. ఇంకాస్త ముందుకు వెళ్లి.. తబలాను కూడా ఈయనే కనుక్కున్నాడని.. అందుకు ఖవ్వాలీలో అది ప్రధానమైన వాద్యంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఇండియన్ క్లాసికల్ సంగీతంలో ఆయన భాగస్వామ్యాన్ని ఎవరూ కాదనలేకపోయినా.. ఆయన కవిత్వాన్ని చదివితే ఆయన వ్యక్తిత్వం ఏమిటో మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. చిత్తోడ్ కోటపై ఖిజ్ర్ ఖాన్ దాడి చేసి 30 వేల మంది హిందువులను హతమార్చిన తరువాత ఆయన ఏం రాశారో ఒక్కసారి చదువండి.

‘Thanks be to Allah that he ordered the kaffir slaying swords of Islam to massacre the idolators in India. According to the orders of the khalifa of Allah polytheists have no right to live in India.’ ఇదీ ఆయన రాసిన విషయం. ఇందులో ఆయన ఖలీఫాను ప్రస్తావించాడు. ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలన్నీ మొఘలులతో సహా.. బాగ్దాద్‌లో ఉన్న ఖలీఫా పేరు మీదనే పరిపాలిస్తున్నారు. ముస్లిం రాజులు తమకు తాము స్వతంత్రులుగా భావించరాదు. భారతీయులుగా మారిపోరాదు అని స్పష్టంగానే పేర్కొన్నాడు. దక్షిణ భారత దేశంలో మాలిక్ కాఫర్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు ఆయన ఏం రాశాడో ఒక్కసారి చూడండి.. ‘… and the heads of brahmans and idol worshippers came dancing from their trunks at the flashes of the sword and blood flowed in rivulets’

‘our holy warriors have cleansed the whole country just as if only the thorns in a forest were destroyed by fire. Islam is victorious. Idol worship has been defeated. Had permission to pay jizya tax and live according to Islamic lay been denied. Even the trace and remembrance of hindus would have been uprooted’ (asatyameva jayate, Abhijit joag p.302, 303)

ఇలా అమీర్ ఖుస్రూ గురించి అనేకానేక అంశాలు రాతపూర్వకంగానే ఉన్నాయి. మనం మాత్రం ఖుస్రూను చాలా గొప్పవాడిగా, మహాత్ముడిగా కొలుస్తున్నాం. ఖుస్రూలో సహనశీలత, లిబరలిజం ఎక్కడ కనిపించాయో.. ఎలా కనిపించాయో మార్క్సిస్టు చరిత్రకారులే చెప్పాలి మరి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సూఫీ సాదువులుగా మార్క్సిస్టు చరిత్రకారులు మహానుభావులుగా తీర్చిదిద్దిన వారంతా ఇస్లాం మత ఛాందసవాదులే. సుహ్రావాడీ స్కూల్‌కు చెందిన నూరుద్దీన్ ముబారక్ ఘజ్నవీ కానీ, చిస్టీ అనుచరుడు షేక్ అబ్దుల్ గంగోహీ కానీ, 18వ శతాబ్దంలో వలీవుల్లా కానీ.. ప్రతి ఒక్కరూ కరడు కట్టిన హిందూ వ్యతిరేకులు. ఇక్కడ షా వలీఉల్లా కాలంలో ఏం జరిగిందో.. ఆయన ఎలాంటి వాడో చాలా క్లియర్‌గా సయ్యద్ అథర్ అబ్బాస్ రిజ్వీ తన పుస్తకం ‘షా వలీవుల్లా అండ్ హిస్ టైమ్స్’ లో వివరంగా రాశాడు. ఈ షా వలీవుల్లా 18వ శతాబ్దంలో ఢిల్లీకి చెందిన సూఫీ ప్రవక్త. ఇతను అహ్మద్ షా అబ్దాలీకి రాసిన ఒక లేఖను ఈ గ్రంథంలో రిజ్వీ కోట్ చేశారు. ఈ లేఖ రాసిన సమయం భారతదేశంలో మరాఠాలు విజృంభిస్తున్న కాలం. మరాఠాలను గెలువలేక ఔరంగజేబ్ ముప్పుతిప్పలు పడుతున్న సందర్భం. ఆ సమయంలో వలీవుల్లా లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే.. ‘భారతదేశంలో ఇస్లాం క్షీణిస్తున్నది. దేశంలోని ముస్లిం రాజ్యాలన్నీ కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయం నన్ను బాగా కలచివేస్తున్నది. దుఃఖం కలిగిస్తున్నది. మీరు భారతదేశంలో జోక్యం చేసుకొని ముస్లిం ప్రాభవాన్ని తిరిగి ప్రతిష్ఠించాలి. భారతదేశం అంతటా ఇస్లాం పతాకం పూర్తి వైభవంతో తిరిగి ఎగరాలి. భారత్‌లో ఇస్లాం వ్యతిరేక శక్తులు పెచ్చరిల్లుతున్నాయి. ఈ దేశంలో అల్లా దయ వలన ఎంతో మంది సుల్తానులు అనేక ప్రాంతాల్లో తమ తమ అద్భుతమైన రాజ్యాలను స్థాపించి ఉన్నారు. ఢిల్లీ ప్రధాన అధికార కేంద్రంగా.. గుజరాత్, బెంగాల్, అవధ్, మాల్వా, దక్కన్ లోని బీదర్, ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్ లలో అరేబియా, ఇరాన్, మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లింలు ఇస్లాం రాజ్యాలను స్థాపించారు. అద్భుతమైన మసీదులను నిర్మించారు. మదరసాలను ఏర్పాటు చేశారు. వీరి వల్ల ఈ దేశంలో ఇస్లాం సుప్రతిష్ఠితమైంది. ఇలాంటి గొప్ప రాజ్యాలను మరాఠాలు తుత్తునియలు చేస్తున్నారు. దక్కన్, మాల్వా, గుజరాత్ ప్రాంతాల్లో మరాఠాలు విజృంభిస్తున్నారు. ఇక్కడి సుల్తాన్‌ల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతున్నది. వాళ్లు చౌత్ (వస్తున్న ఆదాయంలో నాలుగో వంతు) పేరుతో మన సుల్తాన్‌ల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. మొఘల్ వారసులతో వీరు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ తప్ప మిగతా అంతటా మరాఠా తిరుగుబాటు తీవ్రమైంది. బుర్హాన్‌పూర్, ఔరంగాబాద్, బీజాపూర్ వంటి ప్రాంతాల్లో మరాఠాలు తిరుగులేని పట్టు సాధించారు. ఇస్లాంకు చెందిన ఘాజీ సైన్యం ధైర్యం చేసి సాహసంతో దూసుకెళ్తే.. అతి శక్తి కలిగిన ఆయుధాలతో వీరిని అణచివేయడం పెద్ద కష్టం కాదు. అంతేకాదు.. షాజహాన్ కాలంలో గుర్రం ఎక్కడానికి సైతం నిషేధానికి గురైన జాట్లు.. ఇప్పుడు సూరజ్‌మల్ జాట్ అండతో రెచ్చిపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతదేశంలో కాఫిర్లు బలోపేతమవుతారు. ముస్లిం అధికారం పోతుంది’ అని రాశారు. ఈ లేఖ ఇక్కడితో అయిపోలేదు. ఈ లేఖ చదువుతుంటేనే ఆనాటి పరిస్థితులు ఏమిటన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో మరాఠాలు ఏ విధంగా ఇస్లామీకరణను తిప్పికొట్టారో స్పష్టంగా తెలిసివస్తుంది. అదే సమయంలో సోకాల్డ్ సూఫీ సాధు పుంగవుడు కాఫిర్లను అణచివేసి తిరిగి ఇస్లామీకరణను స్థాపించడం కోసం ఎంతగా ఆరాటపడ్డాడో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ లేఖను ఎందుకు ఇంతగా వివరించాల్సి వస్తున్నదంటే.. ఇది సామాన్యమైన లేఖ కాదు. ఇందులో మన చరిత్రకారులు మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్ర అసలు రూపం స్పష్టంగా తెలిసి వస్తుంది. మనవాళ్లు ఎంత మాయ చేశారో ఈ ఒక్క లేఖ చదివితే చాలు.. వేరే వివరణలు ఏవీ చెప్పక్కర్లేదు. ఈ లేఖ ఇక్కడితో అయిపోలేదు. ఇందులోని మరి కొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించాలి.. ముఖ్యంగా పరిపాలన, ఆర్థిక వ్యవస్థల గురించి ఈ లేఖ వివరంగా చర్చించింది. ‘ప్రభుత్వంలోని అన్ని విభాగాలు హిందువుల చేతుల్లోకి వెళ్తున్నాయి. హిందువులు మళ్లీ సంపన్నులవుతున్నారు. ముస్లింలు వెనుకబడిపోతున్నారు. ఇక్కట్లు పడుతున్నారు..’ అని వలీవుల్లా పేర్కొన్నాడు. ఈ లేఖలోని ఈ అంశాన్ని మనం కచ్చితంగా పాయింటవుట్ చేయాలి. మరాఠాలు ఎంత ప్రభావశీలంగా ఎదిగివచ్చారో ఈ అంశం స్పష్టపరుస్తున్నది. కానీ మనకు చెప్పిన చరిత్ర వేరు. మరాఠాల ప్రభావాన్ని కొంచెం చేసి చూపించి, మొఘలులను అద్భుత రాజులుగా కీర్తించిన చరిత్రకారులను ఏమనాలో కూడా అర్థం కాదు. అంతే కాదు.. వలీవుల్లా మరో విషయాన్ని కూడా స్పష్టంగానే రాశాడు. కాఫిర్లను ఎదుర్కోవడానికి, అణచివేయడానికి అబ్దాలీని మించిన అనుభవశాలి, రాజు మరొకరు లేరని పేర్కొన్నాడు. కాఫిర్లు క్రమంగా శక్తిమంతులైతే ముస్లింలు క్రమంగా ఇస్లాంకు దూరమవుతారని తీవ్ర మైన ఆందోళన వ్యక్తం చేశాడు. భారతదేశంలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని తొలగించాల్సిన బాధ్యత అబ్దాలీపైనే ఉన్నదన్నాడు. అల్లా ఆదేశానుసారం ఈ దేశంలో కాఫిర్లపై ముస్లింల ఆధిపత్యాన్ని తిరిగి సాధించాలని కోరాడు. త్వరలో జరుగబోయే యుద్ధంలో సామాన్య ముస్లింలకు మాత్రం ఎలాంటి చేటు జరుగరాదని తెలియజేశాడు. భారతదేశంలో అబ్దాలీ ప్రవేశిస్తే అతడి సైన్యం ఎక్కడి నుంచి ఎలా రావాలి.. ఏ డైరెక్షన్‌లో ముందుకు పోవాలో కూడా వలీవుల్లా మార్గదర్శనం చేశాడు. అబ్దాలీకి ప్రేరణ కల్పించడం కోసం మహమ్మద్ ప్రవక్త మక్కాపై చేసిన యుద్ధాన్ని గుర్తు చేశాడు. దారుల్ హర్బ్ (ముస్లిమేతర రాజ్యం) ను దారుల్ ఇస్లాం (ముస్లిం రాజ్యం)గా ఎలా మార్చాడో వివరించాడు.

ఈ సూఫీ లేఖ సారాంశం ఏమిటంటే..

సూఫీలు ఆధ్యాత్మికత, భక్తిలోనే ఉండిపోతారు.. వారి బోధనలన్నీ శాంతి సామరస్యాలను కోరుకొంటాయన్న ప్రచారం పూర్తి అబద్ధం.

హిందూ ముస్లిం ఐక్యత కానీ, సామరస్యం కానీ.. ఈ లేఖలోని ఒక్క అక్షరంలో కూడా ధ్వనించదు.

అడుగడుగునా ముస్లిం ఆధిపత్యం, అధికారం గురించి మాత్రమే కనిపిస్తుంది.

కవిత్వం, సంగీతమనే మాధ్యమాన్ని వీళ్లు తమ లక్ష్యాల సాధనకు ఎంచుకున్నారు. వాళ్లు భారతదేశంతో ఎప్పుడూ మమేకం కాలేదు. వాళ్లు తమను తాము విదేశీయులుగానే భావించారు.

భారత్‌లో చొరబడాలని ఒక ముస్లిం రాజును ఆహ్వానించడానికి వాళ్లు ఎంతమాత్రం వెనుకాడలేదు.

వాళ్ల మనసుల్లో భారతదేశం ప్రవచించిన వసుధకై కుటుంబకం అన్న సూత్రం లేనే లేదు. మానవత్వం అనే భావనకు ఆస్కారమే లేదు. వాళ్ల మనసుల్లో ఉన్నది ముస్లింలు, ముస్లిం రాజ్యాధికారం, కాఫిర్లు అని వాళ్లు పేరు పెట్టుకొన్న నిజమైన భారతీయులను తమ పద ఘట్టనల కింద అణచివేయడం..

ఇటువంటి వీళ్లను మనం సూఫీలు అన్నాం. సాదువులు అన్నాం.. శాంతి కాముకులు అని కీర్తించాం. వారి సమాధుల దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నాం. వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తే.. వారిని ‘ఇన్‌టాలరెంట్’ అని నిందిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే విభజన విషంలో కాలకూటమే ఈ సాధు ముఖం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here