దేశ విభజన విషవృక్షం-37

0
11

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]దే[/dropcap]శ విభజన అన్నది రెండు జాతుల సిద్ధాంతంపైనే జరిగిందన్నది విస్పష్టం. ఈ హిందూ ముస్లింలు అని రెండు జాతులుగా పరిగణించి రెండు దేశాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కూడా భారతదేశాన్ని మిగతా మతాలతో పాటు ముస్లిం మతంతో కూడిన భారతదేశంగా తయారుచేశారు. అందుకోసం రకరకాల ముసుగులు తొడిగారు. తాము టోపీలు పెట్టుకొన్నారు. హిందువులకు టోపీలు పెట్టారు. షేక్‌ అహ్మద్‌ సర్‌హిండీ దగ్గర నుంచి.. ఈ రోజు వరకు.. ఈ క్షణం వరకు కూడా ఈ రెండు జాతుల సిద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. రెండు మతాల మధ్యన అంతరాలను పనికిమాలిన కొన్ని మూకలు పనిగట్టుకొని.. మేధావులమని, కమ్యూనిజమని, లిబరలిజం అని, సామ్యవాదమని, స్రీ, దళిత, హేతు, నాస్తికవాదాల పేరుతో పెంచుకొంటూ వస్తున్నాయి. వీరందరూ కలిసి ఒకే ఒక్క విచిత్రమైన వాదన చేస్తుంటారు.. వాస్తవానికి దేశంలో సామాజిక మాధ్యమాల గోల మొదలు కానంతవరకు పత్రికల్లోనో.. సమావేశాల్లోనో.. మైకులు పట్టుకొని అరిచేవారు.. సామాజిక మాధ్యమాలు పెచ్చరిల్లిన తరువాత ఈ అరుపులు చాలా చాలా తీవ్రమైనాయి. ఏది పడితే అది.. ఏది తోస్తే అది నోటికొచ్చినట్టల్లా రాసేసుకొంటారు. ఈ అరుపుల్లో చాలా విచిత్రమైన వాదన ఒకటి అదే పనిగా చేస్తూ ఉంటారు. అదేమిటంటే.. ఈ దేశంలో హిందువులు ముస్లింలను అణచివేస్తున్నారని.. ఇది ఎంతవరకు నిజమో జస్టిఫికేషన్‌ చేసిన వాడే లేకుండా పోయాడు. ఈ కామన్‌ ప్రశ్నకు స్పష్టమైన జవాబు ఎవరైనా చెప్పగలరా? అణచివేత అన్నది ఎవరిపై.. ఏ రూపంలో.. ఏ విధంగా జరిగింది? ఇప్పటికీ జరుగుతున్నది..? 1947లో స్వాతంత్య్రం వస్తే.. పాకిస్తాన్‌‌లో నామరూపాలు లేకుండా అణచివేతకు గురైన మతం ఏమిటి? 1948లో భారతదేశంపై దాడి చేసింది ఎవరు? ఆ తరువాత దేశంలో జరిగిన మారణ హోమాలన్నింటికీ బాధ్యులు ఎవరు? కశ్మీర్‌లో పండిట్లను కత్తికో కండగా నరికి పారిపోయేలా చేసింది ఎవరు? ములాయంసింగ్‌ యాదవ్‌ సరయూ నదిలో తేల్చిన శవాలు ఎవరివి? హైదరాబాద్‌ పేలుళ్లు, ముంబై పేలుళ్లకు బాధ్యులెవరు? సాక్షాత్తూ పార్లమెంట్‌ పైనే దాడి చేసిన వాళ్లు ఎవరు? గోద్రా రైలును తగులబెట్టింది ఎవరు? ఈ దేశంలో ముస్లిం సామాజిక వర్గంపై పెద్ద ఎత్తున దాడులు జరిగి మహా మారణ కాండ జరిగింది 2002 సంవత్సరం గుజరాత్‌ లోనే. దీన్ని ఏ హిందువూ సమర్థించలేదు.. అయోధ్యకు వెళ్లి వస్తున్న రామ భక్తులు ప్రయాణిస్తున్న గోద్రా రైలు బోగీని తగులబెట్టి 56 మందిని సజీవంగా దహనం చేసిన అనంతరం జరిగిన అల్లర్లు ఇవి. ఈ అల్లర్లతో దేశమంతటా ముస్లింల పట్ల ఇదే రకమైన అల్లర్లు జరుగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. రెండు దశాబ్దాల తరువాత కూడా బీబీసీ వాడు ఆ అల్లర్లపై డాక్యుమెంటరీ తీస్తాడు.. దాని కోసం సోకాల్డ్‌ లెఫ్ట్‌ ఎలీట్‌ సంస్థల్లోని మహా మేధావులు.. అదో అద్భుతమైన డాక్యుమెంటరీ అని దాని కోసం తెగ చూసేస్తారు. విచిత్రమేమిటంటే.. అంతకుముందు ఇందిరాగాంధీని హత్య చేసిన అనంతరం దేశ రాజధానిలో వేల మంది సిక్కులను ఊచకోత కోస్తే వాళ్ల పక్షాన నిలబడినవాడే లేడు. పట్టించుకొన్నవాడు లేడు. దిక్కులేని సమాజంలా వాళ్లను వదిలేశారు. గుజరాత్‌ అల్లర్లపై రెండు దశాబ్దాల తరువాత కూడా డాక్యుమెంటరీ తీసినవాడికి సిక్కుల అల్లర్లు జరిగాయన్న విషయాన్నే మరిచిపోయాడు. ఎందుకంటే సిక్కులు మైనార్టీలు కారన్నమాట. హిందూ సమాజాన్ని తిట్టాలంటే, హిందూ ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలివేయాలంటే.. ముస్లింలను అణచివేస్తున్నారని.. అదే పనిగా ఆడిపోసుకోవాల్సిందే. వీళ్లు హిందూ అనే పదాన్ని వాడరు. మెజార్టీ, మైనార్టీ అనే పదాలను వాడుతారు. హిందుత్వ వాదులంటారు. బ్రాహ్మణీయ భావజాలం అంటారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ అంటారు.. అన్నింటికంటే మించి మోడీ అంటారు. యోగీ అంటారు. చివరకు ఈ దేశంలో పరిస్థితి ఏమైందంటే.. హిందుత్వం లేదా భారతీయత, లేదా సనాతన ధర్మం లేదా మరో పేరు.. ఏదైనా కానీ ఈ దేశ ప్రాచీన జనజీవన విధానాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడతామని చెప్పేవాళ్లంతా డిఫెన్సులో పడిపోయారు. ఎంతసేపూ మేము మంచివాళ్లం.. మాది సర్వ మానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబం అన్న సూత్రాలను పాటిస్తాం. ఎవడి పాపాన వాడే పోతాడు.. పైన దేవుడున్నాడు.. చూసుకొంటాడు.. అన్న మాటలతో సరిపెడుతుంటారు. ఇంకాస్త ముందుకు వెళ్తే.. ఎవడో ఒకడు.. అడ్డగోలుగా మాట్లాడే మాటలకు జవాబులివ్వడానికి తంటాలు పడుతుంటారు. అంతే కానీ.. మీరెవ్వరు మాట్లాడటానికి? ఈ ఇంటర్‌ప్రెటేషన్‌ చేయడానికి నీకున్న నాలెడ్జి ఏ పాటిది? అని ప్రశ్నించే దమ్ము లేకుండా పోయింది. ఎవరో ఒక రాజకీయ నేత ఒక టీవీ చర్చలో ఒక మత ప్రచారకుడి గురించి మాట్లాడితే హోహో అని గగ్గోలు పెట్టడమే కాదు.. అంతర్జాతీయంగా కూడా అల్లల్లాడిపోయేలా చేశారు. చివరకు మా గొప్ప నాయకులని చెప్పుకొనే వారి నాయకత్వంలోని పార్టీ ఆ నేతను సస్పెండ్‌ చేసింది. అదే పద్ధతిలో తెలంగాణలో మరో మేధావి అని చెప్పుకొనే నాయకుడు ఒక దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే.. మాత్రం అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వచ్చింది. అందరూ నెత్తీనోరూ పెట్టుకొని అతడిని గొప్పవాడిని చేయడానికి తెగ ప్రయత్నించారు. ఎదురు ప్రశ్నలు వేసేసరికి ఏ ఒక్కరి దగ్గరా జవాబు లేదు. చట్టం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ సమర్థించుకోవడానికి ఆరాటపడ్డారు. వీళ్లంతా కూడా ఖాసిం వారసులు, ఘజ్‌నీ వారసులు, ఘోరీ వారసులు, మొఘలుల వారసులు.. నాడు తలలు తెగ్గోసి గిఫ్టులు పంపుకొన్నారు. కనపడ్డవాడిని కనపడ్డట్టు చంపేశారు. అత్యాచారాలు చేశారు. మతమార్పిళ్లు చేశారు. పూర్తిగా ఇస్లామీకరణ జరుగకుండానే బ్రిటిషర్లు వచ్చారు. ఔరంగజేబ్‌తోనే మొఘలులు పతనమైపోయారు. బ్రిటిషర్లు దేశంలో ఈ జాతి భేదాల్ని మరింత ఎడం చేశారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి వారు అనుకొన్న దాంట్లో కొంత సాధించుకోగలిగారు. ఆ తరువాత నెహ్రూ నుంచి నేటి పాలకుల దాకా.. పోటీ పెట్టుకొని.. వాళ్లను పోషిస్తూ వస్తున్నారు. హిందూ కోడ్‌ బిల్లుతో హిందువుల కోసం కుటుంబ నియంత్రణ బిల్లు తెచ్చారు. విడాకుల చట్టమూ తెచ్చారు. ముస్లింలకు ఇలాంటి చట్టాలేవీ లేవు. ఇవాళ జనాభా గమనిస్తే అర్థమవుతుంది. అప్పుడు ఊచకోతలతో కోట్ల మందిని తగ్గించారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో మాదిరిగా ఊచకోతలు సాధ్యం కాదు కాబట్టి.. నిరంతరం అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సెక్యులర్‌ దేశం అని రాసుకోవడానికి, రాయడానికి తెగ ఆరాటపడ్డ వాళ్లు ఈ దేశంలో వాళ్లు చెప్పిన నిర్వచనాన్నే పాటించలేదు. ఇంతకాలం విభజించిన సమాజాన్ని ఇంటిగ్రేట్‌ చేయడం కోసం ఎన్నడూ ప్రయత్నించనైనా లేదు. అంతరాలను పెంచుతూనే ఉన్నారు. ఇందుకోసమే వాళ్లను అణచివేస్తున్నారు అని పదే పదే ప్రచారం చేయడం.. వీళ్ల మతాన్ని, సంస్కృతిని అదే పనిగా అవహేళన చేయడం. తద్వారా కొత్త తరంపై ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతిని ఇంపోజ్‌ చేశారు. ఇప్పుడు వివాహ, కుటుంబ వ్యవస్థలను భష్టు పట్టించడానికి గే కల్చర్‌ కూడా ఇంపోజ్‌ అయింది.

ఈ లోపు ఎర్ర ముసుగు మనుషులు తయారయ్యారు. విచిత్రమేమిటంటే.. వీళ్లకు రష్యా, చైనాలు మాతృదేశాలు. అక్కడి పాలకులే వీరికి బాస్‌లు. వారు చెప్పిన సిద్ధాంతాలను మాత్రమే వీరు వల్లె వేస్తుంటారు. వారు చెప్పిందే ప్రపంచం అంతా పాటించాలని చెప్తుంటారు. ఈ దేశానికి, ఇక్కడి ప్రజలకు కావలసింది ఏమిటో వారికి అక్కర్లేదు. గమ్మత్తేమిటంటే.. వారి బాస్‌లు తమ దేశాల్లో విప్లవాలు తీసుకొని వచ్చారు కానీ.. అక్కడి ప్రజల మతాలను, ధర్మాలను, సంస్కృతిని ధ్వంసం చేయలేదు. తమ దేశాలకు అసలు సంస్కృతే లేదని.. ఎవడో బయటి దేశం వాడు వచ్చి నాగరికత నేర్పాడని వాళ్ల ప్రజలను, దేశాన్ని కించపరచుకోలేదు. ఎవడో రాసిన చరిత్రను తీసుకొచ్చి నెత్తిన పెట్టేందుకు ప్రయత్నించలేదు. వాళ్లు విప్లవం తీసుకొచ్చింది అక్కడి కార్మికులకు హక్కులు తీసుకొని రావడం కోసం.. వారి జీవన విధానాలను మెరుగుపరచడం కోసం. అంతే కానీ.. వారెవ్వరూ కూడా అక్కడి ప్రజల విశ్వాసాలతో ఆడుకోలేదు. వాళ్ల ధర్మంపై దాడి చేయలేదు. ప్రపంచంలో ధర్మంపై జరిగిన దాడి అంటూ ఏదైనా ఉన్నదంటే అది భారతదేశంపైనే.. తరాల కొద్దీ ఇది జరుగుతూనే ఉన్నది. మొట్టమొదట ఈ దేశంలో జరగాల్సింది సోకాల్డ్‌ భావ ప్రకటనా స్వేచ్ఛకు కచ్చితమైన పరిమితులు విధించడం. ప్రభుత్వాలు ఈ రకమైన చర్య తీసుకోగలిగితే, రెండు జాతుల పోకడలను కూకటి వేళ్లతో పెకిలించి వేయడం. ఇందుకోసం జరగాల్సింది సోకాల్డ్‌ షరియాకు ఉన్న చట్టబద్ధతను తొలగించడం. ఇది కాకుండా ఈ దేశంలో రెండు జాతులు అనే మూర్ఖపు ఆలోచన పోనే పోదు. వీటిని సాధించాలంటే వీటి మూలాలను తెలుసుకోకుండా, వాటిని తొలగించాల్సిన అవసరం మనకు కనిపించదు. షరియా మూలంగానే ఈ దేశంలో సమస్త హిందూ మారణకాండ కొనసాగింది. ఆ షరియా ద్వారా రెండు దేశాల సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చింది గతంలో చెప్పుకొన్నట్టుగా షేక్‌ అహ్మద్‌ సర్‌ హిండీ.. ఒకే దేశంలో రెండు దేశాల సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్నే జహంగీర్‌ పాటించాడు. షాజహాన్‌ పాటించాడు. దీని ద్వారానే ఔరంగజేబూ అధికారంలోకి వచ్చాడు. ఇస్లామీయులు వేరు.. ఇస్లామేతరులు వేరు అనే సిద్ధాంతం అప్పటి నుంచే అమలులోకి వచ్చింది. ఈ సరహిండీ కూడా నక్షాబందీ సెక్ట్‌ నుంచి వచ్చిన సూఫీయే. ఆ తరువాత షావలీవుల్లా భారతదేశంపై దండెత్తడానికి అబ్దాలీని ఆహ్వానిస్తుంటే.. అతని తండ్రి ఢిల్లీలో రహమియత్‌ మదరసాను స్థాపించాడు. ఈ మదరసా దేశ రాజధానిలో ఇవాళ్టికీ కూడా కొనసాగుతున్నది. అబ్దాలీ అంతకుముందే ఒకసారి భారత్‌పై దాడి చేశాడు. షా వలీవుల్లా ఆహ్వానంపై మరోసారి దాడికి పూనుకొన్నాడు. భారతదేశంలోని నవాబులను అబ్దాలీకి సహకరించాలని కోరాడు. నజీబుద్దౌలా, సాజుద్దౌలా అబ్దాలీతో చేతులు కలిపారు. తత్ఫలితంగా పానిపట్‌ యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలకు ఓటమి తప్పలేదు. ఇది బ్రిటిష్‌ వాడు దేశంలోకి ఈజీగా చొచ్చుకురావడానికి అవకాశమిచ్చింది. ఆ తరువాత బ్రిటిష్‌ వాడు ఇదే రెండు దేశాల సిద్ధాంతాన్ని దిగ్విజయంగా అమలుచేశాడు. ఆ తరువాత మన దేశంలో పాలకులు సైతం ప్రజాస్వామ్యం ముసుగులో కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని ఏడున్నర దశాబ్దాలుగా విజయవంతంగా అమలు చేస్తూనే వస్తున్నారు. నాడు సూఫీలు చేసిన పనిని.. నేడు రాజకీయ నేతలు, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాలు, హేతువాదులు, కవులు, కళాకారులు, ముఖ్యంగా హిందీ సినిమా వాళ్లు ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రజలను ప్రభావితం చేసే అన్ని రంగాల్లోనూ ఈ రెండు దేశాల సిద్ధాంతం.. ఇంకా ముందుకు పోతే.. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసే భావజాలం పెచ్చుమీరి ప్రవర్తిస్తున్నది.

పానిపట్‌ యుద్ధం.. గురించి వచ్చేవారం చర్చించుకొందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here