దేశ విభజన విషవృక్షం-42

0
6

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశంలో విభజన విషవృక్షం వేళ్లు విచిత్రంగా చిట్టగాంగ్‌కు పాకాయి. సింధు ప్రాంతం వైపు అరబ్బులు దూసుకొని వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అరేబియా, పర్షియా ఇలా వరుసగా దాడులు చేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు సింధు ప్రాంతం దగ్గర అవుతుంది కాబట్టి దాని ద్వారా భారత్ లోకి ప్రవేశించడానికి అవకాశమున్నది. సింధు ప్రాంతం నుంచే అరబ్బులు.. ఇవాళ్టి ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్లగలిగారు. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇస్లామీకరణ చేయగలిగారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ మనం అనుకునే బంగ్లాదేశ్‌కు ఇస్లాం ఎలా వెళ్లిందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. భారతదేశంలోని వివిధ భాషలు మాట్లాడేవారిలో బెంగాలీలే అధికులు. ప్రపంచమంతటా దాదాపు 30 కోట్లకు పైగా బెంగాలీలు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఇస్లామీకరణ జరగడానికి ముందు బెంగాలీలకు ఇల దేవత కాళీమాత. అంతేకాదు చండి, మానస (పార్వతి), నాగ,  శాస్తి, శీతల, గంగ, దక్షిణ రే (దక్ష ప్రజాపతి).. ఇలాంటి దేవీ దేవతలను పూజించేవారు. కాయస్థులు, జాలర్లు, రైతులు, బ్రాహ్మణులు, వైద్యులు, కొవ్వొత్తులు తయారు చేసేవారు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, చేనేత, వడ్రంగి.. ఇలా అన్ని వృత్తుల వారు కూడా శైవ, శాక్త సంప్రదాయాలను అనుసరించిన వారు. ఇలాంటి ఒక ప్రాంతం సమూలంగా ముస్లిం దేశం కావడం ఒక రకంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే.. బెంగాల్‌కు దగ్గరగా ఉన్న ముస్లిం దేశాలు ఒకటి మలేసియా, మరొకటి పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ దాదాపు 2240 కిలోమీటర్ల దూరంలో ఉంటే, మలేసియా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా ఇటువైపు దాడి చేయాలన్నా అంత సులభమైన పనేమీ కాదు. కానీ.. వ్యాపారం అనేది ఇక్కడ చొరబడి మత కాలుష్యానికి కారణమైంది. వ్యాపారం పేరుతో వలస వచ్చి ఇక్కడ స్థిరపడటం, సామాజిక స్వేచ్ఛ పేరుతో ఒక మతం నుంచి మరో మతానికి బలవంతంగా మార్పించడం, కత్తికి పదును పెట్టడం.. ఈ మూడు పద్ధతుల ద్వారా బెంగాల్‌లో ఎనిమిదో శతాబ్దం నుంచే ఇస్లామీకరణ జరిగింది. సులేమాన్ తాజిర్ (851 ఏడీ) బీన్ ఖుర్దాబీ (850 ఏడీ), మసూదీ (956 ఏడీ) ఇద్రీసీ (1150) వంటి వారు సముద్రమార్గం ద్వారా అప్పటి చంద్ర వంశ (825-1035) రాజులతో వ్యాపారాలు చేశారు. ఈ సమయంలోనే క్రమంగా ఇక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసుకొని ఇస్లామీకరణ మొదలుపెట్టారు. భక్తియార్ ఖిల్జీ సమయంలో ఈ మతాంతరీకరణ వేగం పుంజుకొన్నది. ముఖ్యంగా సున్నీ సంప్రదాయానికి సంబంధించిన హనాఫీ, షఫీ ఈ, మాలికి, హన్ బాలీ న్యాయ పద్ధతులను పరిపాలనలో చొప్పించారు. సూఫీ సాదువులు బెంగాల్ లోని అనేక ప్రాంతాలను ఒక్కొక్కరు తమ తమ రాజధానులుగా చేసుకొని అక్కడినుంచి తమ తమ లక్ష్యాలను సాధించారు. 1204లో లఖనౌటీ, 1342లో పాండువా, 1432లో గౌర్ ఇలా పలు ప్రాంతాలను తమ కేంద్ర స్థానాలుగా మార్చుకొని ఇస్లామీకరణకు పూనుకున్నారు. ముఖ్యంగా ప్రఖ్యాత సూఫీ సోదరులైను సుహ్రావాడీ, ఫిరదౌసీతోపాటు, చిస్తీ సోదరులు బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించారు. బెంగాల్లో సూఫీలు పూర్తిగా రాజకీయ పాత్రలే పోషించారు. ప్రధానంగా పర్షియాలో తమ బాస్‌లు అనుసరించిన పాలనావిధానాలను బెంగాల్ లోనూ అమలు చేయించడంలో సూఫీలు సక్సెస్ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే సూఫీలు రాజు కంటే బలవంతులయ్యారు. దేవుడు తమ వంటి సాదువులను విశ్వానికి గవర్నర్లుగా పంపించారు అని అలీ హజ్వీరీ చేసిన ప్రముఖ ప్రకటనను సూఫీలంతా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ సూఫీ సాదువులంతా తమను తాము దేవుడి ప్రతినిధులుగా చెప్పుకొని మత ప్రచారం, మత మార్పిళ్లకు పాల్పడ్డారు. ‘భూమిని పరిపాలించే రాజులకు ఎలాంటి సహజమైన అధికారాలు లేవు. వారు ఎవరైనా ఒక ముస్లిం సాధువు అనుగ్రహం చేత అధికారాన్ని తాత్కాలికంగా లీజు (అద్దె) పొందుతారు. వారి అనుగ్రహం చేతనే వారు పరిపాలిస్తారు..’ అని చెప్పుకుంటారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ప్రముఖ ముస్లిం చరిత్రకారుడు షామ్స్ ఇ సిరాజ్ ఆఫిప్ రికార్డు చేసిన ఘటన. 1321 నుంచి 1398 వరకు ఢిల్లీ గద్దెను పరిపాలించిన ఘియాత్ అల్లావుద్దీన్ తుగ్లక్ (తుగ్లక్ వంశ స్థాపకుడు).. సూఫీ సాధువుల ఆధ్యాత్మిక శక్తులకు వశుడైపోయాడు. ముఖ్యంగా చిస్తీ సూఫీ షేక్ ఫరీద్ అల్ దిన్ గంజ్ ఏ షకార్ (1265 ఏడీ) చూపించిన మహిమలకు అత్యంత ఆకర్షితుడయ్యాడు. ఈ తుగ్లక్ అనేక సార్లు ఈ సూఫీ నివాసముంటున్న పంజాబ్‌కు వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాడు. ఒకసారి ఈయన తన కుమారుడు భావి రారాజు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్‌లను వెంట బెట్టుకొని షకార్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆయన ఈ ముగ్గురికీ మూడు టర్బన్‌లు తలకు చుట్టాడు. ఈ టర్బన్‌లు భారత దేశాన్ని ఏలడానికి మీకిచ్చిన అర్హత అని షకార్ వాళ్లకు చెప్పాడు. ఒక్కో టర్బన్ పొడవు.. ఒక్కొక్కరు ఢిల్లీని ఎన్ని సంవత్సరాలు ఏలుతారో చెప్తుందని కూడా వెల్లడించాడు.

బెంగాల్‌లో కూడా సూఫీలు పూర్తిగా ఇదే తరహా విధానాన్ని పాటించారు. ముస్లిం రాజులకు వారు దేవదూతలుగా మారిపోయారు. వారు ఏది చెప్తే అది వేదమైంది. ఏది చేస్తే అది శాసనమైంది. క్రమంగా బెంగాల్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యస్థాపనకు సూఫీలు బీజం వేశారు. 1243-44లో చరిత్రకారుడు మిన్హాజ్ అల్ సిరాజ్ లఖ్నౌటీ ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన ఒక ఘటనను పేర్కొన్నాడు. ‘Before embarking for India, the future sultan of Bengal ghiyath al-din iwaz(1213-27) was once traveling with his laden donkey along a dusty road in Afghanistan. There he came upon two dervishes clothed in ragged cloaks. When the two asked the future ruler whether he had any food, the latter replied that he did and took the load down from the donkey’s back. Spreading his garments on the ground, he offered the dervishes whatever victuals he had. After they had eaten, the grateful dervishes remarked to each other that such kindness should not go unrewarded. Turning to their benefactor, the said, “go thou to Hindustan, for tha place, which is the extreme (point) of muhammadanism, we have given unto thee.” ఇంకేం వాళ్ల దీవెనలతో ఈ సుల్తాన్ హిందుస్తానానికి, అక్కడి నుంచి బెంగాల్‌కు వచ్చి పర్షియన్ ఇస్లామిక్ విశ్వ సంస్కృతిని స్థాపించాడు.. ఇదీ సదరు సిరాజ్ రాసిన మాటలు. సూఫీలు రాజులను సామదానభేదోపాయాలన్నింటితో రాజులను ఎంతగా ప్రభావితం చేశారో తెలియడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణలు ఏమీ అక్కరలేదు. భారతీయ సమాజంలో, సంస్కృతిలో మూఢ నమ్మకాలు, ఆచారాలు, మాయలు, మంత్రాలు ఉన్నాయనే మేధావులెవరూ ఈ సూఫీల గురించి పల్లెత్తు మాటైనా మాట్లాడరు. సూఫీలందరి లక్ష్యం ఒక్కటే. ప్రపంచమంతటా ఒకే మతాన్ని స్థాపించడం, అది ఇస్లాం కావటం. ఇందుకోసం వాళ్లు పెద్ద సంఖ్యలో అనుచరులను పోగేసుకొని.. మత మార్పిళ్లకు తెగబడ్డారు. మతం మార్చుకున్న వారికి కొన్ని నెలల పాటు బ్రెయిన్ వాష్ చేసి వారికి షరియా తప్ప మరో ప్రపంచం ఏదీ కనిపించకుండా తయారుచేశారు. ఇవాళ జిహాదీ అయినా.. టెర్రరిజమైనా, తాలిబానిజమైనా, ఇంకేదైనా కూడా దీని ఫలితమే. ఇవాళ మన దేశంలో లిబరలిస్టులమని చెప్పుకునే వారి లక్ష్యమూ ఇందుకు భిన్నమైనదేమీ కాదు.

ఉత్తర భారతదేశంలో మాదిరిగానే బెంగాల్‌లో కూడా సాహిత్య, సాంస్కృతిక ఇస్లామిక్ వ్యవస్థలు క్రమంగా పెరగటం ప్రారంభమయ్యాయి. ఇవి పేరుకు మాత్రమే కల్చరల్ సంస్థలు. ఇక్కడ నేర్పేదంతా హనాఫీ అంటే షరియా న్యాయ పద్ధతులే. ఈ వ్యవస్థలు ఢిల్లీ సుల్తానులు ముఖ్యంగా ఖిల్జీలు, తుగ్లక్‌లు తమ సామ్రాజ్యాలను సూదూర ప్రాంతాలకు విస్తరించడానికి చక్కటి అవకాశమిచ్చాయి. ఢిల్లీ నుంచి సూఫీలు బెంగాల్ దాకా విస్తరించారు. 1325లో నిజామ్ అల్ దిన్ ఔల్యా ఢిల్లీలో సూపర్ పవర్‌ను అనుభవించాడు. అతడి అనుచరుడు అఖి సిరాజ్ అల్ దిన్ 1357లో ఢిల్లీ నుంచి లఖ్నౌటీ (బెంగాల్) వచ్చాడు. 1398లో ఇతడి అనుచరుడు షేక్ అలా అల్ హక్ లఖ్నౌటీ నుంచి పాండువా చేరాడు. అతడి అనుచరులు నూర్ ఖుత్ బి అలమ్ 1459లో పాండువాలో, మరో అనుచరుడు అష్రఫ్ జహంగీర్ సిర్నానీ మధ్య ఆసియా అంతటా పర్యటించి అక్కడి నుంచి పాండువా చేరుకున్నాడు. నుర్ ఖుత్ బి ఆలమ్ తరువాత అతడి అనుచరుడు హుసేన్ అల్ దిన్ మానిక్ పురి 1449లో వారసత్వాన్ని కొనసాగించాడు. సూఫీలు, సుల్తానుల మధ్య సంబంధాలు అన్నీ కూడా మత రాజకీయ పరంగానే కొనసాగాయి. ఒక రకంగా చెప్పాలంటే సుల్తానులను సూఫీలే వెనుక ఉండి నడిపించారు. ఇస్లామీకరణ గురించి వారికి ట్యూషన్ చెప్పినట్టు బ్రెయిన్ వాష్ చేసి మరీ నడిపించారు. బెంగాల్ సూఫీలు, సుల్తానులు ఒకరి పట్ల ఒకరు విధేయంగా ఉంటూ కొత్త రాజ వంశాల స్థాపన.. పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. సుల్తానులు బెంగాల్ సూఫీలకు అన్ని అధికారాలు కల్పించారు. 1213లో సుల్తాన్ ఘియాత్ అల దిన్ ఇవాజ్ తొలి స్వతంత్ర ముస్లిం పరిపాలనను బెంగాల్‌లో ప్రారంభించాడు. ఆ తరువాత షమ్స్ అల్ దిన్ ఇలియాస్ షా సుదీర్ఘ కాలం బెంగాల్‌ను సుదీర్ఘ కాలం పరిపాలించాడు. ఇతని కాలంలో షేక్‌లు, ఉలేమాలు, సూఫీలు ప్రజలకు అనేక ఆధ్యాత్మిక అద్భుతాలు ప్రదర్శించి తమ మతంలోకి వారిని ఆకర్షించారని చెప్తారు. రాజులు వీరికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటంతో వీరి సమాధులు తీర్థయాత్రా స్థలాలుగా పవిత్రమయ్యాయి. ప్రజలు ఈ సమాధులపై చాదర్లు కప్పి పెద్ద ఎత్తున ముక్కులు మొక్కడం మొదలైంది. ఉదాహరణకు సుల్తాన్ సికిందర్ ఇలియాస్ షా 1363లో మౌలానా ఆటా అనే సూఫీ సాదువుకు ఒక సమాధి కట్టించాడు. దాని శాసనంపై ఆయన రాయించిన వాక్యాలు చూడండి..

By the grace of (the builder of) the seven wonderful porticos “who hath created seven heavens, one above another” [Qur’an 67:3], may His names be glorified; the building of this lofty dome was completed. (Verily it) is the copy of a vault (lit., shell) of the roof of Glory, (referred in this verse) “And we have adorned the heaven of the world” (lit., lamps) [Qur’an 67:5]. (This lofty dome) in the sacred shrine of the chief of the saints, the unequaled among enquirers, the lamp of Truth, Law and Faith, Maulana ‘Ata, may the High Allah bless him with His favours in both worlds; (was built) by order of the lord of the age and the time, the causer of justice and benevolence, the defender of towns, the pastor of people, the just, learned and great monarch, the shadow of Allah on the world, distinguished by the grace of the Merciful, Abu’l Mujahid Sikandar Shah, son of Ilyas Shah, the Sultan, may Allah perpetuate his kingdom.

The king of the world Sikandar Shah, in whose name the pearls of prayer have been strung; regarding him they have said, “May Allah illuminate his rank,” and regarding him they have prayed “May Allah perpetuate his kingdom.”

దేవుడిని మించిన ప్రాధాన్యం మౌలానా పొందాడు. అక్కడ ప్రతి ఏటా పండుగ జరుపాలని కూడా సికిందర్ ఆదేశించాడు.

బెంగాల్ లోని బీర్‌భూమ్ జిల్లాలో 1221 జూలై 29 నాటి ఒక శాసనం కనిపించింది. దీనిపై రాసి ఉన్నదేమిటంటే.. మహమ్మద్ భక్తియార్ ఖిల్జీ బెంగాల్ పై దాడి చేసి వెళ్లిన 17 సంవత్సరాలలోపే ఒక ఫకీర్ సూఫీ లాడ్జ్ (ఖాంగా)ను నిర్మించాడని. ‘‘who all the while abide in the presence of the Exalted Allah and occupy themselves in the remembrance of the Exalted Allah.” అని రాసి ఉన్నది. విచిత్రమేమిటంటే.. ఇదే శాసనం మరోవైపు ఈ ప్రాంతంపై జరిగిన అనేక దాడులను రాజా న్యాయపాలుడు సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించాడని, ఇతడు 1035 నుంచి 1050 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని రాసి ఉన్నది. పాల వంశ రాజులు బౌద్ధాన్ని అనుసరించినా.. న్యాయ పాలుడు హిందూ దేవతలను పూజించినట్టుగా దీనిపై రాసి ఉన్నది. హిందూ శాసనాన్ని తిరగవేసి.. వెనుకవైపు తమ గొప్పతనాన్ని ముస్లింలు రాసుకున్న వైనానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. చరిత్రకారులు ఈ శాసనాన్ని విశ్లేషిస్తూ భీర్‌భూమ్ ప్రాంతంలో సంక్లిష్ట సంస్కృతికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కానీ.. రెండింటి కాలానికి దాదాపు రెండు వందల సంవత్సరాల తేడా శాసనంలోనే కనిపిస్తున్నది. ఇందులో సంక్లిష్టతకు చోటే లేదు. న్యాయపాలుడి సమయంలో ఉన్న ఆలయాలన్నీ ఆ తరువాత రాజులు ధ్వంసం చేసుకుంటూ పోయారని జర్మన్ ఓరియంటలిస్ట్ పాల్ విట్టెక్ పేర్కొన్నాడు.

1244-45 ప్రాంతంలో షేక్ జలాలుద్దీన్ తబ్రీజీ అనే బెంగాలీ సూఫీ (ఈయన బయోగ్రఫీ సియార్ అల్ ఆర్ఫిన్ అనే గ్రంథంలో మనకు లభిస్తుంది. ఇది ఈయన జీవితకాలం అయిపోయిన తరువాత 300 సంవత్సరాలకు అంటే 1530-36 మధ్య కాలంలో ఈ గ్రంథ రచన జరిగింది) ప్రాథమికంగా సూఫీయిజం చదువుకొన్న తరువాత 1228లో బాగ్దాద్‌కు వెళ్లి అక్కడ ఏడేండ్ల పాటు సూఫీయిజాన్ని షిహాబ్ అల్ దిన్ సుహ్రావాదీ దగ్గర సూఫీయిజం నేర్చుకున్నాడు. అక్కడి నుంచి 1235లో ప్రయాణమై.. బెంగాల్ లోని లఖ్నౌటీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన మత కార్యకలాపాలను కొనసాగించాడు. అక్కడ ఉన్న జనాభా అంతా తన భక్తులు కావాలని ఆదేశించాడు. ఆలయాలను పడగొట్టి సూఫీ రెస్ట్ హౌస్ లను నిర్మించాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక మంది సూఫీలు మనకు చరిత్రలో తగులుతారు. వీరి వల్ల తూర్పు బెంగాల్ 90 శాతం ఇస్లామీకరణ జరిగింది. పదిశాతం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో భాగంగా ఉన్న బెంగాల్ లోనూ 27 శాతం ముస్లిం జనాభా ఉన్నది. తూర్పు బెంగాల్ దేశం నుంచి 1947 లోనే విడిపోయింది. ఇప్పుడున్న బెంగాల్‌లో వేర్పాటువాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here