దేశ విభజన విషవృక్షం-52

0
9

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]హిం[/dropcap]దువుల మీద ముస్లిం నాయకుల రాజకీయ ద్వేషానికి 1892లోనే నాంది పడింది. దారుల్ ఇస్లాం దిశగా భారతదేశాన్ని మార్చలేకపోయినా.. అందులో తమ వాటా తీసుకొని తీరాలన్న రాజకీయ ఆకాంక్ష రోజు రోజుకూ ప్రబలుతూ వచ్చింది. అంతకుముందు 1885లో కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు అది స్వపరిపాలన కోసం ఏర్పడి ఉండలేదు. సమర్థమైన పరిపాలన ఉంటే చాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పురుడు పోసుకొన్నది. అందులో భాగంగానే 1892లో భారత శాసనసభా చట్టాన్ని కాంగ్రెస్ అంగీకరించింది. ఈ చట్టంలో ప్రతిపాదిత అంశాలు ఏమి ఉన్నాయి.. ఏమి లేవు అన్న విషయాలను కాంగ్రెస్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాసభలను ఏర్పాటుచేసి.. ప్రజా ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి అంగీకరించింది. ఈ ప్రజా ప్రాతినిధ్యం పొందడానికి మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంఘాలు ఇతరత్రా గుర్తించిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోవాలి. ఇదే చట్టంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ చట్టం చేశారు. విచిత్రమేమిటంటే.. ఎవ్వరికీ తెలియకుండా.. ఎలా జరిగిందో అర్థం కాకుండా మత ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టారు. 1892 చట్టంలో ఈ మాట ఎక్కడా కనిపించదు. కానీ.. ఈ చట్టానికి నియమావళిని తయారు చేసేవారికి ఇచ్చిన ఆదేశాల్లో మాత్రం ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారన్నది పరమ రహస్యంగా దాచిపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ తన రచనల్లో తెలిపారు.

‘The introduction of this principle is shrouded in mystery. It is a mystery because it was introduced so silently and so stealthily. The principle of separate representation does not find a place in the Act. The Act says nothing about it. It was in the directions – but not in the Act – issued to those charged with the duty of framing regulations as to the classes and interests to whom representation was to be given that the Muslims were named as a class to be provided for. It is a mystery as to who was responsible for its introduction. This scheme of separate representation was not the result of any demand put forth by any organized Muslim association. In whom did it then originate? It is suggested that it originated with the Viceroy, Lord Dufferin, who, as far back as the year 1888, when dealing with the question of representation in the Legislative Councils, emphasized the necessity that in India representation will have to be, not in the way representation is secured in England, but representation by interests. Curiosity leads to a further question, namely, what could have led Lord Dufferin to propose such a plan ? It is suggested that the idea was to wean‡ away the Musalmans from the Congress which had already been started three years before. Be that as it may, it is certain that it is by this Act that separate representation for Muslims became, for the first time, a feature of the Indian Constitution. It should, however, be noted that neither the Act nor the Regulations conferred any right of selection upon the Muslim community, nor did the Act give the Muslim community a right to claim a fixed number of seats. All that it did was to give the Muslims the right to separate representation.’ (DR. BABASAHEB AMBEDKAR WRITINGS AND SPEECHES VOL. 8 p.250-251)

అప్పటికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ, ఇతర మేధావులు కానీ.. ఈ ప్రత్యేక హక్కుల గురించి పూర్తిగా అవగాహనకు రాలేదు. కానీ. సిపాయిల తిరుగుబాటు అనంతరం 1888లోనే వైస్రాయ్ డఫరిన్ ‘భారతదేశంలో ప్రాతినిధ్యం అనేది మన ప్రయోజనాలను అనుసరించి జరుగాల’ని డఫరిన్ అన్నాడు. ఆయనే ఈ ప్రాతినిధ్య సూత్రాన్ని 1892లో చేర్చారా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలను దూరం చేయడానికి ఈ చట్టం బాగా ఉపయోగపడిందనటంలో సందేహం లేదు. 1888 మార్చి 11న మీరట్‌లో జరిగిన సమావేశంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇదే వైఖరిని విస్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఆయన ప్రసంగాలు బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ముస్లింలు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని ఆయన పిలుపునిచ్చాడు. అలా చేయడం చాలా తప్పు, పొరపాటు అని కూడా హెచ్చరించాడు. ‘This was the cause of my giving a speech at Lucknow [in 1887], contrary to my wont, on the evils of the National Congress; and this is the cause also of today’s speech. And I want to show this: that except Badruddin Tyabji, who is a gentleman of very high position and for whom I have great respect, no leading Mahomedan took part in it. He did take part, but I think he made a mistake. He has written me two letters, one of which was after the publication of my Lucknow speech. I think that he wants me to point out those things in the Congress which are opposed to the interests of Mahomedans, in order that he may exclude them from the discussion. But in reality the whole affair is bad for Mahomedans. However, let us grant that Badruddin Tyabji’s opinion is different from ours; yet it cannot be said that his opinion is the opinion of the whole nation, or that his sympathy with the Congress implies the sympathy of the whole community. My friend there, Mirza Ismail Khan, who has just come from Madras, told me that no Mahomedan Raïs of Madras took part in the Congress. It is said that Prince Humayun Jah joined it. Let us suppose that Humayun Jah, whom I do not know, took part in it; yet our position as a nation will not suffer simply because two men stand aside. No one can say that because these two Raïses took part in it, that therefore the whole nation has joined it. To say that the Mahomedans have joined it is quite wrong, and is a false accusation against our nation. If my Bengali friends had not adopted this wrong course of action, I should have had nothing to do with the National Congress, nor with its members, nor with the wrong aspirations for which they have raised such an uproar. Let the delegates of the National Congress become the stars of heaven, or the sun itself — I am delighted. But it was necessary and incumbent on me to show the falsity of the impression which, by taking a few Mahomedans with them by pressure or by temptation, they wished to spread, that the whole Mahomedan nation had joined them.’ (1888 మార్చి 11 మీరట్ లో సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రసంగంలోని భాగమిది.)

బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్రాతినిధ్య చట్టం ముస్లింలకు చాలా చక్కగా అక్కరకు వచ్చింది. ప్రత్యేక రాజకీయ హక్కుల సామాజిక ప్రయోజనం ఏమిటన్నది వారికి చాలా స్పష్టంగా తెలుసు. అందువల్లనే.. 1909లో శాసనసభల సంస్కరణలు జరుగబోతున్నదని ముందుగానే తెలుసుకున్న ముస్లింలు తమకు తామే వైస్రాయ్ మింటోను కలుసుకొని తమ కోరికలను అంటే.. స్థానిక సంస్థల్లో, విద్యాసంస్థల్లో, కోర్టుల్లో, ప్రాంతీయ మండళ్లలో, శాసనసభలో తమ ప్రాతినిధ్యం ఉండేలా సంస్కరణలు రచింపజేసుకొన్నారు. ప్రత్యేక ప్రతినిధిత్వం వారి జనాభా దామాషా కంటే కూడా చాలా చాలా ఎక్కువగా లభించేలా చూసుకున్నారు. 1909 చట్టం ప్రకారం ముస్లింలకు ప్రాతినిధ్యపు నిష్పత్తి ఎలా లభించిందో.. కింది పట్టికలో చూడవచ్చు.

 

1916 అక్టోబర్‌లో 19 మంది ఇంపీరియల్ శాసనసభ్యులు అప్పటి వైస్రాయ్ చేమ్స్‌ఫర్డ్‌కు రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఒక నోటు పంపించారు. పంజాబు, సెంట్రల్ ప్రావిన్సులకు ప్రత్యేక ప్రాతినిధ్య సూత్రాన్ని విస్తరించాలని కోరారు. అన్నింటికంటే మించి ముస్లింలకు వర్తించే మతాచార వ్యవహారాల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకొనే అవకాశం లేకుండా చూడటం. ఈ విషయంలో కాంగ్రెస్ లోని హిందూ ప్రతినిధులు, ముస్లిం లీగ్ ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని పేరు లక్నో ఒప్పందం. దురదృష్టమేమిటంటే ఈ ఒప్పందాన్ని రచించింది లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఈ ఒప్పందం కారణంగా వివిధ ప్రావిన్సుల్లో ముస్లిం ప్రాతినిధ్యం వారి జనాభా దామాషా కంటే ఎంత అధికంగా లభించిందో ఈ పట్టిక గమనిస్తే మనకు అర్థమవుతుంది.

  1. సెంట్రల్ ప్రావిన్సులో 340 శాతం
  2. మద్రాసు ప్రావిన్సులో 231 శాతం
  3. యునైటెడ్ ప్రావిన్సులో 214 శాతం
  4. బొంబాయి ప్రావిన్సులో 16.3 శాతం
  5. బీహార్, ఒరిస్సాలలో 268 శాతం
  6. బెంగాలు ప్రావిన్సులో 76శాతం
  7. పంజాబు ప్రావిన్సులో 91శాతం

కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి 1919 వరకు కూడా ఆ పార్టీలోని హిందూ నాయకత్వం ముస్లిం వర్గాల మద్దతు కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నది. వాళ్లను బుజ్జగించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. హిందూ ముస్లిం భాయీ, భాయీ అన్న నినాదాన్ని కూడా ప్రమోట్ చేసింది బహుశా ఈ మధ్య కాలంలోనేనేమో..  ప్రతి కాంగ్రెస్ సమావేశంలోనూ అధ్యక్షుల వారి ప్రసంగం ముస్లింల సంతుష్టీకరణ అంశం లేకుండా సాగిన దాఖలా కనిపించదు. స్వాతంత్ర్య పోరాటం విషయంలో ముస్లింల ఐక్యత ముఖ్యమన్నట్టుగా మొదట్లో కనిపించిన కాంగ్రెస్ విధానం తరువాతి కాలంలో ముస్లింల సంతుష్టీకరణ అన్నది అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. 1919 తరువాత ఈ సంతుష్టీకరణ పరాకాష్టకు చేరుకొన్నది. స్వాతంత్ర్యం కంటే కూడా ముఖ్యంగా ముస్లిం మత వ్యాప్తి అన్నది వారి ముఖ్యమైన ప్రణాళికలో భాగమై కూచుంది.

1915 జనవరి 9 న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. అక్కడ ఆయన చేసిన ఉద్యమానికి బొంబాయిలో అపూర్వమైన కీర్తి లభించింది. సన్మానాలు సత్కారాలు జరిగాయి. గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు గాంధీజీ భారత్‌కు వచ్చారు. అప్పటికే కాంగ్రెస్ లోని అతివాదులు క్రమంగా పార్టీకి దూరమయ్యారు. గాంధీ రావడంతోనే భారత రాజకీయాలపై వెంటనే ఆసక్తి చూపించలేదు. గోఖలేను ఆయన తన రాజకీయ గురువుగా భావించారు. దురదృష్టమేమిటంటే.. గాంధీ భారత్‌కు వచ్చిన తరువాత నెల రోజులకే అంటే 1915 ఫిబ్రవరి 19న గోఖలే కన్నుమూశారు. ఆ తరువాత గాంధీ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. ముందుగా ఆయన దేశమంతటా పర్యటించారు. అప్పటిదాకా ఆయన ఎలాంటి రాజకీయ ఉద్యమాన్ని చేపట్టలేదు. దేశమంతా పరిశీలించిన తరువాత కానీ ఆయన ఒక కార్యాచరణ రూపొందించుకోలేదు. కానీ.. ఆయన భారత్‌కు వచ్చేనాటికే ముస్లిం సంతుష్టీకరణ పరాకాష్టకు చేరుకొన్నది. దీంతో ఆయన కూడా అదే మార్గంలో తన కార్యాచరణకు రూపమిచ్చుకొంటూ వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన చేసిన మొదటి పని.. తులసీదాస్ 17వ శతాబ్దంలో రాసిన రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అన్న పాటలో ఈశ్వర్ అల్లా తేరోనామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ అన్న రెండు పాదాలను చేర్చడం. ఈ పాటను ఆయన బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. గాంధీ వచ్చిన తరువాత మొదట చేపట్టిన ఉద్యమం సహాయ నిరాకరణ.. అలియాస్ ఖిలాఫత్..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here