దేశ విభజన విషవృక్షం-59

0
11

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మో[/dropcap]ప్లా జిహాద్‌ను లౌకికవాదులు, కమ్యూనిస్టులు హిందూ జమీందారులపై కౌలుదారులైన ముస్లింలు చేసిన దాడిగా అభివర్ణించారు. మరి కొందరు బ్రిటిష్ వారి పాలన.. వారికి సంబంధించిన హిందూ మద్దతుదారులకు.. వ్యతిరేకంగా ముస్లింలు నిర్వహించిన జాతీయోద్యమంగా కీర్తించారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు ఈఎంఎస్ నంబూద్రీపాద్ ఈ జిహాద్‌ను ముస్లిం రైతాంగ పోరాటంగా నిర్వచించారు. ‘జన్మి లపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా ఎర్నాడ్, వల్లువనాడ్ తాలూకాలలో మొట్టమొదట జరిగిన పోరాటంగా, వెనుకబడిన నిరక్షరాస్యులైన మోప్లాలకు ఈ ఖ్యాతి దక్కుతుంది’ అని నంబూద్రీపాద్ తాను రాసిన ‘ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ పీజంట్ మూవ్‌మెంట్ ఇన్ కేరళ’ అన్న గ్రంథంలో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటో.. జమోరిన్ మహారాజు కాలికట్ సమావేశాల వివరాలను ఇంతకు ముందే చదువుకున్నాం. మోప్లా జిహాద్ చివరకు ఏ దశకు చేరుకొన్నదంటే.. అత్యంత దారుణంగా తయారైంది. ఒకవైపు ఏ టర్కీ ఖలీఫా కోసం ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించారో.. అక్కడ ఖలీఫా రాజ్యం ఖతమైంది. ఇక్కడ మాత్రం ఖలీఫాలు పుట్టుకు రావడం మొదలుపెట్టారు. ఖిలాఫతిస్టులు తమను తాము గవర్నర్లుగా ప్రకటించుకొని.. హిందువుల ఊచకోతలు మొదలుపెట్టారు. వీరిలో అలీ ముసలియార్, పరియన్కున్నత్ అహ్మద్ హాజిరాజా, సీఐ కోయతంగల్ వంటివారు చాలా ముఖ్యంగా చెప్పుకోదగినవారు.

“The experiences I am about to relate will satisfy every Hindu endowed with ordinary common sense that the Moplas resorted to must repugnant fanaticism, which may be ascribed to nothing but selfishness, love of money and love of power, which are the prominent features of the present outbreak. Refugees narrate that, after forcibly removing young and fair Nair and other high caste girls from their parents and husbands, the Mopla rebels stripped them of their clothing and made them march in their presence naked, and finally they committed rape upon them. In certain instances, devoid of human feelings and blinded by animal passion, the Moplas are alleged to have utilised a single woman for the gratification of the carnal pleasures of a dozen or more men, The rebels also seem to have captured beautiful Hindu women, forcibly converted them, pierced holes in their ears in the typical Mopla fashion, dressed them as Mopla women and utilised them as their temporary partners in life. Hindu women were threatened, molested and compelled to run half-naked for shelter to forests abounding in wild animal. Respectable Hindu gentlemen were forcibly converted and the circumcision ceremony performed with the help of certain Misaliars and Thangals. Hindu houses were looted and set fire to, will not all these atrocities remain as a shameful image of the Hindu Muslim “unity ”, of which we have* heard much from the Non-Co-operation Party and Kbilafat- wallahs? The ghastly spectacle of a number of Hindu damsels being forced to march naked in the midst of a number of licentious Moplas cannot be forgotten by any self-respecting Hindu, nor can it be erased from their minds. On the other hand, I have never heard of the modesty of a Mopla’ woman being outrage! by a Mopla rebel. Times of India.” (Gandhi Anarchy, C Sankaran Nair, p.129)

ఇదీ పరిస్థితి. వీరిలో తంగల్.. కొండగుట్టల్లో చుట్టు పక్కల గ్రామాల్లో అనుచరులతో సమావేశాలు పెట్టేవాడు.. హిందువుల దాడులకు ప్రేరేపించేవాడు. ఒకసారి బ్రిటిష్  సైన్యానికి సహాయపడుతున్నారనే పేరుతో 40 మందిని తంగల్ అనుచరులు పట్టుకొచ్చారు. వారిలో 38 మందికి తానే విచారణ జరిపి మరణ దండన విధించడమే కాకుండా దగ్గరుండి అమలు చేయించాడు. ఆ హిందువుల తలలు తెగ్గోసి మొండేలను వ్యవసాయ బావిలో పడేశారు. మోప్లా రెబెలియన్‌గా మనకు చరిత్ర పాఠాలు బోధిస్తూ వచ్చారు. మోప్లా జిహాద్, బలాత్కారాలు, హత్యలు.. అకృత్యాలకు మనవాళ్లు లేని ఉద్దేశాలను ఆపాదించి చక్కగా లౌకిక కథలను అల్లుకొంటూ వచ్చారు. నంబూద్రీపాద్ అన్నట్టే కౌలుదారులకు, హిందూ భూస్వాములకు మధ్య జరిగిన భూపోరాటంగా అభివర్ణించారు. కానీ.. ఇది చాలా చాలా చాలా స్పష్టంగా కేరళలో  హిందువుల ఊచకోత మాత్రమే.  దాదాపు ఆరు నెలలకు పైగా కేరళలో హిందువుల ఊచకోత నిరాటంకంగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా జరిగింది. దాదాపు 5,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దారుల్ ఇస్లాం స్థాపించడమే లక్ష్యంగా ఈ మహా మారణ కాండ సాగింది. ముందుగానే చెప్పుకొన్నట్టు ఖిలాఫతిస్టులు కేరళ లోని రెండు ప్రాంతాల్లో ఖిలాఫత్ రాజ్యాన్ని ప్రకటించుకొన్నారు. అలీ ముసలియార్ తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. ఖిలాఫత్ జండా మలబార్ తీరంలో ఎగిరింది. అహ్మద్ హాజీ రాజా అనే ఖిలాఫతిస్టు.. కేరళలోని మలయనాడు ప్రాంతాన్ని షరియా నియంత్రణలోని రాజ్యంగా ప్రకటించాడు. మలయనాడులో హిందూ మహిళలను కిడ్నాప్ చేసి అరబ్బులకు అమ్మడం మొదలుపెట్టాడు.. ఇప్పుడు హనీట్రాప్‌లో పడేసి సిరియాకు తరలించి ఐసిస్‌లో చేర్చినట్టే.. తేడా ఏమీ లేదు.. సేమ్ సీన్ రిపీట్.. రిపీట్..

..ఈ అల్లర్లపై వైస్రాయ్ చెమ్స్‌ఫర్డ్ ఏమన్నాడో చదవండి..

A few Europeans and many Hindus, have been murdered, communications have been obstructed, Government offices burnt and looted and records have been destroyed, Hindu temples sacred houses of Europeans and Hindus burnt, according to reports Hindus were forcibly converted to Islam and one of the most fertile tracts of South India is faced with certain famine. The result has been the temporary collapse of the Civil Government, the offices and Courts have ceased to function and ordinary business has been brought to a standstill. European and Hindu refugees of all classes are concentrated at Calicut and it is satisfactory to note that they are safe there. One trembles to think of the consequences if the forces of order had not prevailed for the protection of Calicut. The non-Muslim in these parts was fortunate indeed that either he or his family or his house or property came under the protection of the soldiers and the police. Those who are responsible for causing this grave outbreak of violence and crime must be brought to justice and made to suffer the punishment of the guilty. (Gandhi Anarchy, C Sankaran Nair, p.128).

అన్నీ రికార్డుల్లో చాలా భద్రంగా ఉన్నాయి. కానీ.. మనకు మాత్రం ఆ చరిత్రకు రంగు మార్చి చెప్తూ వచ్చారు.. చూపిస్తూ వచ్చారు. చివరకు హిందువులు అనేవాళ్లే ఈ దేశంలో పరమ ద్రోహులుగా.. ముస్లింలు మాత్రం చాలా మంచివారుగా చిత్రించడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని తరాలు ఈ చరిత్ర వింటూనే మగ్గిపోయాయి. జాగ్రత్తగా పాత చరిత్రను గమనిస్తే.. 627వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త నాయక్తవం వహించిన ఇస్లామియా సైన్యం.. బాను, కురజ్జ అనే రెండు యూదు తెగలను ఇదే విధంగా మట్టుబెట్టింది. (the life of Muhammad, a translation of Ishaq’s sirat rasul allah with introduction and notes by A. Guillaume, Oxford University Press, 1965)

అదే తీరు.. అదే పోకడ.. ఎక్కడ కూడా తేడా లేదు. వాళ్లు చాలా క్లియర్‌గా ఉన్నారు.. మొదట్నుంచీ.. క్రిస్టల్ క్లియర్‌గా.. ఇంచు కూడా లక్ష్యం నుంచి పక్కకు జరిగేది లేదు. ఎలాగైనా ఇస్లామీకరణ చేయాల్సిందే.. 627 నుంచి ఇప్పటి వరకు కూడా.. అప్పుడు గజ్వా ఏ హింద్ అని ధైర్యంగా మహమ్మద్ ఖాసిం అన్నాడు. ముస్లిం నేతలు ఎన్నడూ కూడా కలిసింది లేదు. కన్సాలిడేట్ ఓటు బ్యాంకు పేరుతో ప్రత్యేక ప్రతిపత్తిని ఇవాళ్టికీ అనుభవిస్తున్నారు. చివరకు హిందుత్వాన్ని నెత్తినెత్తుకొన్న హిందూ సంస్థలు కూడా సెక్యులర్ రాగాన్ని పాడుతూ.. సంజాయిషీలు ఇచ్చుకొనే పరిస్థితి నెలకొన్నది. హిందూ ముస్లిం సమైక్యతారాగాన్ని తీస్తున్నాయి. నాడు గాంధీగారు ఏదైతే భావించి ఖిలాఫత్ కోసం మద్దతుగా సహాయ నిరాకరణను చేపట్టారో.. ఇప్పుడు ఈ హిందూ సంస్థలు చేస్తున్నది కూడా అదే. కమ్యూనిస్టులకు.. ఈ సంస్థలకు తేడా ఏమీ లేదని అవి నడుస్తున్న మార్గం చెప్పకనే చెప్తున్నది.  సెక్యులరిజం.. అలియాస్ లౌకికవాదం అన్న కొత్త పేరు పెట్టి.. ఒకరు దొంగదెబ్బ తీస్తుంటే.. మరొకరు నేరుగా దెబ్బతీస్తున్నారు. ఇక ఈ అరాచక దాడుల నుంచి ఈ దేశాన్ని, ధర్మాన్ని, ప్రజలను రక్షించేదెవరు?

అదే సమయంలో బృహస్పతి విజ్.. లేదా మున్షీరామ్ విజ్ పేరుతో జన్మించి సన్యాసదీక్ష స్వీకరించిన స్వామి శ్రద్ధానంద సరస్వతి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఈయన పంజాబ్ లోని జలంధర్‌లో జన్మించిన వాడు.. స్వామి దయానంద సరస్వతిని కలిసిన తరువాత ఆయన ఆర్య సమాజ్ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యారు. హిందూ సంస్కరణోద్యమంలో అంతకు ముందు కానీ, ఆ  తరువాత కానీ ఇంత చురుకైన, గొప్పనైన పాత్ర పోషించిన వారు మరొకరు లేరనే చెప్పాలి. అటు భారత స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. హిందూ మహా సభను 1920లో ప్రారంభించింది ఈయనే. (దీనికీ, నేటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సంబంధం లేదు. ఆర్.ఎస్.ఎస్ 1925లో హెడ్గేవార్ ప్రారంభించారు.). ఢిల్లీలోని ప్రసిద్ధ జామామసీదులోకి ఒక హిందూ సన్యాసిగా వెళ్లి.. అక్కడ వేదమంత్రాలను ఉదహరిస్తూ వైదిక ధర్మాన్ని, జాతీయ సమైక్యత ఆవశ్యకతను ప్రబోధించిన ఏకైక మహానుభావుడు స్వామి శ్రద్ధానంద.  1922లో స్వామీజీని డాక్టర్ అంబేద్కర్.. అంటరాని వారి యొక్క నిజాయితీ గల చాంపియన్ అని ప్రశంసించారు. ఇవాళ అంబేద్కర్ అనుయాయులెవరికీ ఈ శ్రద్ధానంద పేరు కనీసం కూడా తెలియదు. గాంధీగారి హిందూ ముస్లిం సమైక్య నినాదం సరైంది కాదని ఆయన వ్యతిరేకించారు. శివాజీ ఘనతను కీర్తించే శివ భవానీని ఎక్కడా వినియోగించరాదని గాంధీజీ ఆదేశించడం, రఘుపతి రాఘవ రాజారాం పాటలో ఈశ్వర్ అల్లా తేరోనామ్ అన్న పదాలను చేర్చడం, అన్నింటికి మించి ఖిలాఫత్ ఉద్యమం తరువాత పెద్ద ఎత్తున అలజడి సృష్టించి హిందువులను ముస్లింలుగా మతాంతరీకరణ చేయించడం వంటి పరిణామాలను స్వామి శ్రద్ధానంద ఎంతమాత్రం సహించలేకపోయారు. దీంతో ఆయన అసాధారణ రీతిలో శుద్ధి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. దేశంలోకి ముస్లింల దండయాత్ర ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ రకంగా ఈ స్థాయిలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన వారు మరెవరూ లేరేమో కూడా.. 1923లో ఏకంగా లక్షల మంది ఇస్లాం స్వీకరించిన వారిని తిరిగి హిందూ మతంలోకి, హిందూ ధర్మంలోకి పునరాగమనం చేయించారు. ఈ పరిణామం ముస్లిం నేతలు కలలో కూడా ఊహించినది. పశ్చిమ సమైక్య ప్రావిన్సులో 1,63,000 మంది మల్కానా రాజ్‌పుత్‌లు తాము బలవంతంగా స్వీకరించిన ఇస్లాం మతాన్ని విడిచి పెట్టి తిరిగి హిందూమతంలోకి మారిపోయారు. ఇక్కడ మరో విషయం మర్చిపోయాను.. చెప్పాల్సి ఉన్నది. మహమ్మద్ బిన్ ఖాసిం 8వ శతాబ్దంలో సింధ్ ప్రావిన్సుపై దాడి చేసి ఆక్రమించుకున్న సుమారు వందేండ్లకు అంటే 9, 10 శతాబ్దాల మధ్యన మహర్షి దేవాల్.. ఈ రకమైన శుద్ధి కార్యక్రమానికి ఆద్యుడు. ఈయన ఆ సమయంలోనే తన జాతిని రక్షించుకోవడానికి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాడు. చాలామందిని తిరిగి స్వధర్మంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించారు. ఎందుకంటే.. అప్పుడు మరింత అమానవీయంగా.. ఒక రకంగా పైశాచికంగా ఉండేది. హిందువులతో మాట్లాడటం కానీ, కలిసి మెలిసి ఉండటం కానీ చేయడానికి వీల్లేదు. ఈ పరిణామాలన్నింటిని ఎదుర్కోవడానికి దేవాల్ మహర్షి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి హిందువులను తిరిగి హిందువులుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముస్లింలు హిందువులను అంటరానివారుగా చూసే దుస్థితి. దీన్నించి జాతి తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇవాల్టి లాగానే (నిజానికి ఆ రోజు లాగానే ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి). మనల్ని మనం చెప్పుకోలేని పరిస్థితి. మనం మన గొప్ప ధర్మాన్ని గురించి చెప్పుకోలేని పరిస్థితి. కనీసం మనల్ని మనం డిఫెండ్ చేసుకోలేని దుస్థితి. సింపుల్‌గా మన నోరు మూసుకొని.. ఈ కమ్యూనిస్టులో.. లిబరలిస్టులో.. లేక శాలువాలు కప్పుకున్న మేధావులో.. కులాల మాస్కులు తొడుక్కొని రాజకీయాలు చేసే లౌకికవాదులో ఏది చెప్తే అది.. ఏది మాట్లాడితే అది విని ఊరుకోవాలి. ఇంతకంటే తీవ్రంగా ఉన్న పరిస్థితులు దేవాల్ రుషి ఉన్న కాలం నాటివి. ఈ క్రమంలో ఆయన ఒక స్మృతిని రచించారు. స్మృతి అంటే.. ఇవాళ.. అందరూ తిట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడుతున్న మనుస్మృతి ఉన్నదే.. అలాంటిదే ఈ దేవాల్ స్మృతి కూడా. ఇప్పుడు మనుస్మృతి గురించి ఇలాంటి ఒక స్మృతి ఉన్నదన్న విషయమే తెలియదు. ఇదే కాదు.. ఇలాంటి చాలా చాలా స్మృతులు ఈ దేశంలో అమలయ్యాయి. వీటిలో సాత్త్విక, రాజస, తామస స్మృతులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చెప్తాను.. అంగీరస, అత్రి, దక్ష, దేవల, ప్రజాపతి, యమ, లిఖిత, వ్యాస, శంఖ, శంఖ లిఖిత, వృద్ధ శతతప, యాజ్ఞవల్క్య, తిత్తిరి, కాత్యాయన, విష్ణు, బృహస్పతి, సంవ్రత, సాంఖ్య, గౌతమ, వశిష్ట, పరాశర, భరద్వాజ, కశ్యప, హరిత, నారద ఇలా అనేక స్మృతులు వచ్చాయి. ఈ స్మృతికారులంతా కూడా వేదకాలం నాటి మహర్షులే. వీటిలో మనుస్మృతికి ఉన్న ప్రాధాన్యం చాలా చాలా తక్కువ. పైగా ఒక సెక్షన్ ప్రజలకు ఒక పరిమిత కాలంలో అమలై మృతమై పోయిందే. ఇదేమీ సంజాయిషీ ఇచ్చుకోవడమేం కాదు. అందులో ఉన్న అంశాల గురించి ఏమీ తెలియని వాళ్లు మాట్లాడే మాటలు అనేకం ఉన్నాయనుకొండి.. తెలియనివన్ని తప్పులని సభాంగణమందున పలుకగరాదు రోరి పిశాచపు పాడెగట్ట.. నీ పలికిన నోట దుమ్మపడ.. అని తెనాలి రామకృష్ణుడి చాటువు ఒకటి బాగా ప్రచారంలో ఉన్నది. ఈ నిందించే వాళ్లకు కనీసం సంస్కృతం ఓనమాలు కూడా తెలియవు. అది వేరే సంగతి లెండి. ఇక దేవాల్ విషయానికి వద్దాం. ఈ దేవాల్ స్మృతి ఆపత్కాలంలో అనుసరించదగిన స్మృతిగా దేవాల్ మహర్షి సూచించారు. ఈ స్మృతిలో ఆయన పేర్కొన్నదేమిటంటే.. జాతిని కాపాడుకోవడానికి తక్షణం.. అంటే యుద్ధ వ్యూహంతో మతం మారిన వారిని వెంటనే తిరిగి తమ స్వంత మతంలోకి తీసుకొని రావాలి. హిందూ మహిళలు.. వారు ఒక వేళ గర్భవతులైనా సరే.. వారి సొంత మతంలోనికి తీసుకొని రావాల్సిందే. హిందువులందరినీ వెనక్కి తీసుకొని రావాలని అందులో పేర్కొన్నారు. ఇవాళ దానికి ఘర్ వాపసీ అనో.. మరో పేరు పెట్టినా కానీ తప్పు కానే కాదు. ఎందుకంటే ఈ బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకోవాలన్నా.. తద్వారా దారుల్ ఇస్లాంగా దేశాన్ని మూలచ్ఛేదం చేయాలన్న ఆలోచనను తుంచాలన్నా.. డెమొక్రాటిక్ మార్గంలో ఇవాళ బలవంతంగా మారిన వారిని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిందేనని స్వామి శ్రద్ధానంద ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూ మతంలోకి ఈ ‘రివర్స్ మైగ్రేషన్’ అనేది వారికి మింగుడుపడలేదు. 1926లో అబ్దుల్ రషీద్ అనేవాడు.. స్వామి శ్రద్ధానందను దారుణంగా కాల్చి చంపాడు. స్వామి హత్య జరిగిన సమయంలో గౌహతిలో కాంగ్రెస్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. వాటిలో గాంధీజీ.. స్వామి శ్రద్ధానందకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అదృష్టమేమిటంటే.. అబ్దుల్ రషీద్‌ను ప్రాసిక్యూట్ చేసి 1927లో ఉరి తీశారు. అయితే.. రషీద్ కేసును వాదించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ లాయర్ ముందుకొచ్చారు. అతడి చర్యను సమర్థిస్తూ కేసు వాదించారు. అతడిని ఉరి తీశాక అంత్యక్రియలకు 50 వేల మంది ముస్లింలు హాజరయ్యారు. ప్రార్థనలు చేశారు. ఇదంతా చదువుతుంటే మీకు ప్రస్తుత పరిస్థితులు తప్పక గుర్తుకు రావాలి. 1993 బొంబాయి పేలుళ్ల కేసులో నేరగాడు టైగర్ మెమన్‌ను ఉరి తీసిన తరువాత అతడి అంత్యక్రియలకు అతి పెద్ద ర్యాలీలే నిర్వహించారు. ప్రార్థనలు నిర్వహించారు. అదే బొంబయిలో.. (ఏ పేలుళ్లలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయో.. అదే నగరం) భవ్యమైన సమాధిని, స్మారకాన్ని నిర్మించారు. ఇవాళ్టికీ అక్కడికి వెళ్లి చాదర్లు కప్పుతున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో నేరగాడు అఫ్జల్ గురును ఉరితీస్తే.. ‘అఫ్జల్ తేరా కాతిల్ జిందాహై.. ఘర్ ఘర్ మే పైదా కరేంగే అఫ్జల్.. ఛీన్ కే లేంగే ఆజాదీ’ అంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నినాదాలు చేస్తారు. ఆ నినాదాలు చేసిన వాళ్లు ఇప్పుడు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల్లో చేరి రాజకీయాలు చేస్తుంటారు. రేపు పార్లమెంటుకు వెళ్లి చట్టాలు చేస్తారు కూడా. వీళ్ల కేసులు విచారించింది.. అర్ధరాత్రి వేళ.. తెల్లవారు జామున కోర్టులను తెరిపించి విచారణ జరిపేలా చేసింది ఎవరో తెలుసా? రాం జెత్మలానీ, ప్రశాంత్ భూషణ్ వంటి మహామహా న్యాయ కోవిదులు.. ఇంక ఏం చెప్పాలి మరి..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here