దేశ విభజన విషవృక్షం-8

2
14

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశంలోకి ఇస్లాం చొరబడలేదని.. భారతీయులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారన్న వాదన పూర్తిగా అబద్ధమని భారతదేశ చరిత్రను తనదైన శైలిలో విరచించిన మహమ్మద్‌ హబీబ్‌ పేర్కొన్నాడు. భారతదేశంలో కింది కులాల ప్రజలు.. బ్రాహ్మణ వర్గ ప్రజల అణచివేత నుంచి బయటపడటానికి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఇస్లాంలోకి స్వచ్ఛందంగా మారిపోయారని రాసుకొంటూ వచ్చారు. భారతీయ రాజుల వైఫల్యం వల్లనే ముస్లింలు ఈ దేశానికి వచ్చారని కూడా అద్భుతంగా రాసుకొంటూ వచ్చారు (మరిన్ని వివరాలకోసం చదవండి.. కోవెల సంతోష్‌ కుమార్‌ రచించిన రామంభజే శ్యామలం). భారతదేశంలో నిజమైన సామాజిక సమానత్వాన్ని ఇస్లాం ప్రవేశపెట్టిందని.. అందువల్లనే లక్షలాది భారతీయులు ముస్లిం రాజుల కోసం రాజభవనాలు.. మసీదులు నిర్మించారని కూడా హబీబ్‌ పేర్కొన్నాడు. ఈ మహమ్మద్‌ హబీబ్‌ తరువాత ఆతని కొడుకు.. ఇర్ఫాన్‌ హబీబ్‌ (పద్మ అవార్డులన్నీ అందుకొన్నాడు) రోమిలా థాపర్‌.. ఇంకా చాలా మంది దీన్ని పదే పదే చెప్పుకొంటూ వచ్చి.. మేకను కుక్క అని నిరూపించారు. వీళ్లు చెప్పింది.. చెప్పుకొంటూ వస్తున్నది ఎంత వాస్తవమంటే.. మేడిపండు అంత! దేబాల్‌ పోర్టుతోపాటు, బ్రాహ్మణాబాద్‌ను స్వాధీనం చేసుకొని మొదటి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన మహమ్మద్‌ బిన్‌ ఖాసిం.. అక్కడ బ్రాహ్మణ రాజు దాహిర్‌ను క్రూరంగా తలనరికి.. ఆ తలతోపాటు దాహిర్‌ కూతుళ్లను వేశ్యలుగా మార్చి తన బాస్‌కు బహుమానంగా పంపించడం.. ఏ రకమైన విశ్వమానవ సౌభ్రాతృత్వమో.. ఇంతకాలం ఎవరూ ప్రశ్నించకపోవడం ఏమిటి?

మహమ్మద్‌ బిన్‌ ఖాసిం దాహిర్‌ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన్న తరువాత హింద్‌ సింధ్‌ రాజులకు ఒక ఫర్మానా పంపించాడు. దాని సారాంశం ఏమిటంటే.. ‘వెంటనే మీరంతా ఇస్లాంలోకి మారిపోవాలి. ఖలీఫాపై విశ్వాసం ప్రకటించాలి. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను తు.చ.తప్పకుండా పాటించాలి. లేకపోతే.. రాజ్యం విడిచి పారిపోవాలి. ఇవేవీ వినకుంటే నా చేత దారుణంగా చనిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అని. దీన్ని ఏమని నిర్వచించాలి? శాంతిని కోరే.. రాజులను, ప్రజలను సామూహికంగా ఊచకోత కోసి మారణ కాండకు పాల్పడ్డారని సంతోషించాలా?

భారతదేశంపై విదేశీయుల దండయాత్రలు.. యవనుల కాలం నుంచే జరిగాయి. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌ ఇదే సింధ్‌ ప్రాంతంపై దాడిచేసి ఓడిపోయి వెనక్కు మళ్లాడు. మళ్లీ క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో అరబ్బులు మీద పడ్డారు. దీనికంతటికీ కారణం వీళ్లు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి కాదన్నది ఖచ్చితంగా గమనించాలి. ఎవడో బయటివాడు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజలకు వ్యవసాయం నేర్పాడని.. చదువు చెప్పాడని.. సాహిత్యం నేర్పాడని.. థాపర్లు రాసినవన్నీ పచ్చి పచ్చి అబద్ధాలు. ఈ దేశాన్ని, చరిత్రను నాశనం పట్టించడానికి పన్నిన భయంకరమైన కుట్ర ఇది. అలెగ్జాండర్‌ వచ్చేనాటికే.. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం. అరబ్బులు వచ్చేసరికి ప్రపంచంలోనే అతి విస్తారమైన అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్న దేశం మనది. అందులో సింధు ప్రాంతం మరింత సంపన్నమైంది. అందుకే తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని అరబ్బు దేశాలనుంచి డబ్బుకోసం ఈ దేశం మీద పడ్డారనడానికి మహమ్మద్‌ బిన్‌ ఖాసిం దాడే ఉదాహరణ.

దేబాల్‌, బ్రాహ్మణాబాద్‌తో పాటు.. ఖాసిం ఆక్రమించుకొన్న అత్యంత సంపన్నమైన నగరం ముల్తాన్‌. ముల్తాన్‌ నాగరికత ఇవాల్టిది కాదు. దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వమే ఉన్న నగరమిది. సింధు నాగరికతలో భాగమైన హరప్పా కంటే చాలా పురాతనమైన నగరమిది. ఈ నగరాన్ని కశ్యపుడు నిర్మించాడని భారతీయ గ్రంథాలు చెప్తున్నాయి. మహాభారతంలో కటోచ వంశస్థులు ఈ నగరాన్ని రాజధాని చేసుకొని పరిపాలించినట్టు.. ఈ రాజులు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ నగరంలో మనం చాలా దారుణంగా కోల్పోయిన దేవాలయం సూర్య దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత గొప్పది.. అత్యున్నతమైంది.. అతి సంపన్నమైనది.. అత్యంత అరుదైన నిర్మాణ శైలి కలిగిన అద్భుత దేవాలయం.. ఇస్లాం చొరబాట్ల వల్ల మనం కోల్పోయాం. భవిష్య పురాణంలో, సాంబ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు, జాంబవతి కుమారుడైన సాంబడు.. కుష్టురోగిగా మారితే.. తన యవ్వనాన్ని తనకు ప్రసాదించాలని శ్రీకృష్ణుడిని వేడుకొన్నాడట. ఆయన సూర్యదేవుడిని ప్రార్థించాలని సూచించడంతో సాంబడు.. చంద్రభాగా నదీతీరాన సూర్యుడి పవిత్ర ప్రదేశంగా ఉన్న మిత్రవనానికి వెళ్లి.. సూర్యుడిని ప్రసన్నం చేసుకొంటాడు. ఆ తరువాత అక్కడే అపూర్వమైన సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ఇదీ పురాణ గాథ.

పురాణాలను పోనీయండి.. వాటిని మనం ఎలాగూ పక్కన పెడతాం.. పుక్కిటివంటాం.. మిథ్య.. ఇంకా ఏవేవో అని పక్కకు తోసేస్తాం. క్రీస్తు పూర్వం 515 వ సంవత్సరంలో గ్రీకు అడ్మిరల్‌ స్కైలాక్స్‌ ముల్తాన్‌ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికి ఈ నగరాన్ని కశ్యపపురంగానే పిలుస్తున్నారు.  కశ్యప పురంగా ఉన్న ఈ నగరంలో అద్భుతమైన సూర్య దేవాలయాన్ని తాను సందర్శించినట్టు తన జ్ఞాపకాల్లో (పెరిప్లస్‌) రికార్డు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతనే భారతదేశానికి ఇండియా అన్న పేరు రావడానికి తొలి కారకుడు అయ్యాడు. గ్రీకు మాండలికంలో ఉచ్చారణ దోషం వల్ల సింధు కాస్తా హిందు అయింది.

The people of the Indus region were referred to as Hiduš or Hindush in Persian (due to sound change of *s > h from Proto-Iranian Sindhu). If Scylax wrote in the Ionic dialect of Greek, which did not pronounce initial h sounds, he would have transformed it to Indos (plural: Indoi). Their land was characterised as Indike (the adjectival form, meaning “Indian”).Herodotus uses these terms as equivalent to the Persian terms Hiduš and Hindush, even though he also generalised them to all the people living east of Persia, leading to considerable ambiguities.

(వికి పీడియా సౌజన్యంతో)

స్కైలాక్స్‌ ఈ సూర్య దేవాలయాన్ని చూసినట్టు ముందుగా చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మాడిసన్‌లోని విస్కిన్‌సన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన ఆండర్‌ వింక్‌.. అల్‌ హింద్‌.. ది మేకింగ్‌ ఆఫ్‌ ఇండో ఇస్లామిక్‌ వరల్డ్‌ అన్న రచనలో సింధు ప్రాంతంపై విస్తృతమైన చర్చ చేశాడు. అందులో కూడా ముల్తాన్‌లోని సూర్య దేవాలయం ప్రస్తావన మనకు ప్రముఖంగా ప్రస్తావన వస్తుంది. భారతీయ ఇస్లాం ప్రపంచం ఏర్పాటుపై మూడు వాల్యూమ్‌లలో వింక్‌ విస్తారమైన చర్చ చేశాడు.

క్రీస్తు శకం 641లో.. అంటే ముస్లింలు దండయాత్ర చేయడానికి కొద్ది సంవత్సరాలకు ముందు.. చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌.. ముల్తాన్‌ పర్యటించాడు. ఇక్కడి సూర్యదేవాలయాన్ని సందర్శించాడు. సూర్య దేవాలయం గురించి మరింత వివరంగా వర్ణించాడు. ఈ ఆలయంలో మూల విరాట్టు అయిన సూర్యుడి విగ్రహం పూర్తిగా బంగారంతో రూపొందించారని, కండ్లలో కెంపులు పొదిగారని హ్యుయాన్‌ త్సాంగ్‌ పేర్కొన్నాడు. ఆలయ ద్వారాలలో, స్తంభాలలో, ద్వార బంధాల్లో.. శిఖరంపైన.. బంగారం, వెండి, రత్నాలు విరివిగా పొదిగారని రాశాడు. ‘వివిధ దేశాలనుంచి వేల మంది యాత్రికులు ఈ ఆలయానికి వచ్చి సూర్య భగవానుడిని సేవించుకొంటున్నారు. మహిళలు సంగీతం పాడుతున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు. దేవుడికి పూవులు సమర్పించుకొంటున్నారు. సుగంధ ద్రవ్యాలను అర్పిస్తున్నారు. రాజులు అభరణాలు.. విలువైన రత్నాలను అర్పిస్తారు. వేలమంది దేవదాసీలు ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నారు’ అని హ్యుయాన్‌ త్సాంగ్‌ పేర్కొన్నాడు. ఆ దేవాలయంలో పేద ప్రజలకు ఆహారాన్ని, నీటిని అందించడానికి, వైద్య సహాయం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉన్నదట.

‘Very magnificent and profusely decorated. The image of the Surya-deva is cast in yellow gold and ornamented with rare gems. Women play their music, light their torches, offer their flowers and perfumes to it… The kings and high families of the five Indies never fail to make their offerings of gems and precious stones. They have founded a house of mercy, in which they provide food and drink, and medicines for the poor and sick, affording succor and sustenance. Men from all countries come here to offer up their prayers; there are always some thousands doing so. On the four sides of the temple are tanks with flowering groves where one can wander about without restraint.’

అంతే కాదు.. ఈ నగరంలో మొత్తం 299 శైవ సంప్రదాయానికి చెందిన దేవాలయాలు ఉన్నాయని హ్యుయాన్‌ త్సాంగ్‌ రాశాడు. ఈ దేవాలయంలోని మూల విరాట్టు అయిన సూర్య భగవానుడి విగ్రహాన్ని పూర్తి బంగారంతో తయారుచేశారు. ముల్తాన్‌లోని దాదాపు 300 దేవాలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్‌ బిన్‌ ఖాసిం.. ఈ ఆలయంలో సూర్యుడి మూలవిరాట్టుని మినహా మిగతా ఆలయాన్నంతా ధ్వంసం చేశాడు. ఆలయాన్ని పరిరక్షిస్తున్న దాదాపు ఆరువేల మందిని బంధించి హతమార్చాడు. ఈ ఆలయం నుంచి దాదాపు

13,200 మౌండ్స్‌ బంగారాన్ని దోచుకొని పోయాడు. మౌండ్‌ అనేది ఒక కొలమానం. దీన్ని మన్‌, మాన్‌ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్‌ ఇండియా, ఆఫ్గనిస్తాన్‌, పర్షియాల్లో ఈ కొలమానాన్ని వినియోగించారు. ఒక మౌండ్‌ అంటే 37.3242 కిలోగ్రాములు. ఈ లెక్కన 13,200 మౌండ్లు అంటే.. 4,92,679.44 కిలోలు అన్నమాట. చాచ్‌నామాలో కూడా ఈ విషయం ప్రస్తావన ఉన్నది. సూర్యుడి భక్తుడైన జిబావిన్‌ అనే బ్రాహ్మణ పాలకుడు ఇక్కడ అపారమైన ధనరాశిని దాచి ఉంచి.. దానిపై ఆలయాన్ని నిర్మించాడని చాచ్‌నామా పేర్కొన్నది. ఖాసిం ఆలయాన్ని తవ్వి తీసుకొన్న బంగారం విలువ దాదాపు 5 లక్షల కిలోలు. ఇప్పుడు చెప్పండి.. ఈ ఆలయ సంపద ఎంతో.. ముల్తాన్‌ ఎంత సుసంపన్నమైన నగరమో..!

ప్రఖ్యాత ఇరానియన్‌ స్కాలర్‌ అల్‌ బిరూనీ సింధ్‌ ప్రాంతంపై ఇస్లాం ఆధిపత్యంపై పరిశోధన చేశాడు. అల్‌ బిరూనీ రాసిన ప్రకారం..  ఖాసిం.. ఈ సూర్యుడి విగ్రహాన్ని కూడా ఎందుకు వదిలేశాడంటే.. ఆ నగరానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది ఈ దేవాలయమే కాబట్టి. కాకపోతే ముల్తాన్‌పై తన విజయానికి గుర్తుగా సూర్యుడి విగ్రహం మెడలో గోమాంసం ముక్కల మాలను వేసి పైశాచికానందాన్ని పొందాడు. అంతేకాదు. ఈ దేవాలయానికి సమీపంలోనే ఒక సున్నీ మసీదును నిర్మించాడు. సింధి వ్యాపారులు, ప్రజలు వేల సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించి సూర్యుడికి తలనీలాలు సమర్పించుకొనేవారు. పెద్ద ఎత్తున దక్షిణలు అర్పించుకొనేవారు. ఖాసిం ఈ ఆలయాన్ని ఆ ప్రాంత ఆదాయ వనరుగా వినియోగించుకొన్నాడని 13 వ శతాబ్దానికి చెందిన వివాదాస్పద రచయిత బిన్‌ అల్‌ జవాజీ పేర్కొన్నాడు. సూర్యుడి దేవాలయానికి వచ్చే యాత్రికులు, భక్తులు ఆలయంలో వంద దిర్హామ్‌ల నుంచి పది వేల దిర్హామ్‌ల వరకు దక్షిణగా సమర్పించుకొనేవారు. ఈ ఆదాయాన్ని ఖాసిం మూడు భాగాలు చేశాడు. ఇందులో ఒక భాగం ముస్లింల సంక్షేమానికి వినియోగించేవాడు. మరో భాగం నగర నిర్వహణ, సదుపాయాల ఏర్పాటుకోసం.. మిగిలిన భాగం అర్చకులకు ఇచ్చేవాడు.

ఖాసిం తరువాత వచ్చిన ఇస్లాం రాజులు.. సూర్య దేవాలయాన్ని సాకుగా చూపించి భారతీయ రాజులను బెదిరించారు. హింసించారు. తమపై దాడికి ఏ మాత్రం ప్రయత్నించినా.. సూర్యుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తీరుతామని హెచ్చరించారు. క్రీస్తు శకం పదో శతాబ్దంలో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నేలమట్టం చేసి దానిపై మసీదును నిర్మించారు. అప్పటివరకూ ఇది పవిత్ర యాత్రాస్థలంగా కొనసాగింది. ఈ ఆలయానికి సంపద వచ్చి చేరుతూనే ఉన్నది. ఆ సంపదను ముస్లిం రాజులు దోచుకొని ఖలీఫాకు పంపుతూనే ఉన్నారు.  తరువాతి కాలంలో మహమ్మద్‌ ఘజనీ కూడా సోమ్‌నాథ్‌ కు వెళ్లడానికి ముందు ఇక్కడికి వచ్చి వెళ్లాడు.

కొస మెరుపు ఏమిటంటే.. అరబ్బులైన ఇస్లాం చరిత్రకారులు ముల్తాన్‌ను ‘బంగారు గనులకు సరిహద్దులు’గా అభివర్ణించారు. అంటే వాళ్ల లక్ష్యం భారతదేశం ఒక బంగారు గని.. దానికి సరిహద్దు ముల్తాన్‌. దాన్ని దోచుకోవడం ద్వారా.. గనిలోకి ప్రవేశించడం సులువవుతుంది. ఇక్కడ శాంతి లేదు.. సౌభ్రాతృత్వమూ లేదు. వాళ్లకు మతం లేదు.. మతం మీద విశ్వాసం లేదు. ప్రవక్త ప్రవచించిన పవిత్ర గ్రంథాన్ని తమ దోపిడీకి చిత్తం వచ్చినట్టు వాడుకొన్నారు. దాన్ని బూచీగా చూపించారు. ఈ దేశంలో దాడులు మొదలుపెట్టిన్నాటి నుంచి కూడా వాళ్ల లక్ష్యం ఈ దేశంలోని అపారమైన సంపదను దోచుకొని పోవడం.. మొదట గ్రీకులైనా.. తరువాత ముస్లింలు అయినా.. ఆ తరువాత క్రైస్తవులైనా.. అందరి టార్గెట్‌ ఒక్కటే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ దేశాన్ని నాశనం చేసైనా సరే.. ఇక్కడి సంపత్తిని తరలించుకొని పోవడం.. మత మార్పిళ్ల లక్ష్యం కూడా సామాజిక సామరస్యాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేసి తాము చెప్పినట్టల్లా వినేలా చేసుకోవడమే.. ఇప్పటికీ.. ఈ దేశము.. అంబేద్కర్‌, నెహ్రూ.. తదితరులు రచించిన రాజ్యాంగం వారికి వర్తించదు. వారికి పవిత్ర గ్రంథంలో చెప్పిన శాసనాలే వర్తిస్తాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here