దేశభక్తి – దైవభక్తి

    0
    5

    [box type=’note’ fontsize=’16’] “ధర్మము సత్యము మానవులకు అందరకు సమానమయినవని తిన్నగా మనస్స్ఫూర్తిగా గ్రహించుకొన్న నాడు గాని విభిన్న మతముల వారి భేదాభిప్రాయములు, కలహములును శాంతింపవు” అని వివరిస్తున్నారు డా. వి. ఎ. కుమారస్వామిదేశభక్తి – దైవభక్తి” వ్యాసంలో. [/box]

    [dropcap]దే[/dropcap]శభక్తి పరులు ప్రజలకు ఉపయోగకరములయిన కార్యములను చేసికొనుచు దైవభక్తిని మరచుచున్నారు. దైవభక్తి పరులు దేశ ప్రజాక్షేమము కొరకు ఆలోచనమే చేయుటలేదు. దేశ ప్రజలలో తమ తమ మత ధర్మములను పేర, మార్గమధ్యములలో దర్గాలను, మందిరాలను నిర్మించుకొనుచు సర్వ ప్రజల సౌకర్యము లేకుండా అడ్డుకొనుచున్నారు. వాస్తవానికి ఇతరుల సుఖ సౌకర్యములను విచారించు సౌహార్దము దైవభక్తి పరులకు ఉండవలె. దీనిని కోల్పోయిన మతధర్మము దేశ ప్రజలలో ఏకత్వానికి బదులు కలహానికి త్రోవ చేయుచున్నది.

    ఇస్లాము ధర్మము, హిందూ ధర్మము, క్రీస్టియను ధర్మము అను మూడు లేవు. పరద్రవ్యాభిలాషతో చౌర్యము చేయడం, కామోద్రేకముతో స్త్రీలకు అపకారము, అవమానము చేయడం అధర్మం కాదా? ‘సత్యమేవ జయతే’ అను సూక్తి అందరకు సమానం గనుక తప్పుడు సాక్ష్యం చెప్పువాళ్ళు చౌర్యము, వ్యభిచారము చేయువారును దండనీయులే. ఏ మతము వాళ్ళు అయినను శిక్షార్హులు అగుచున్నారు కదా! అర్థ కామాల పరిమితిని పాటించుటయే ధర్మము, అసత్యము = అధర్మము – ఈ మానవ ధర్మము సర్వసమానమని అందరును ముందు గ్రహించుకోవాలి! అటుపై పరస్పర హితైషులుగా మెలగుటయే దేశభక్తికి దోహదము చేయును. సమాజ హితము కోసము వ్యక్తి స్వార్థము (మితి మీరినపుడు) అదుపులో పెట్టబడవలయును. అటులనే దేశభక్తికి ఏకతాభావానికి అడ్డంకులు అయిన ఆచారాలను మతధర్మాల పేరుతో రక్షించుకోరాదు. సతీప్రథ (పతితో సహగమనము) ఈ పద్ధతిలో నిరోధింపబడినది. అస్పృశ్యత నిరాకరించబడినది. అట్లే విశృంఖములయిన విడాకులు ఏ వర్గములో అయినను తప్పక అరికట్టవలెను. ధర్మము సత్యము మానవులకు అందరకు సమానమయినవని తిన్నగా మనస్స్ఫూర్తిగా గ్రహించుకొన్న నాడు గాని విభిన్న మతముల వారి భేదాభిప్రాయములు, కలహములును శాంతింపవు.

    జాతీయ సమైక్య భావము దేశభక్తి ప్రజలలో ప్రబలము కావలయును. ఈ దిశలో ప్రజలు చింతనము చేయగలరు. దేశభక్తి పరులు దైవభక్తి పరులు కావాలి. దైవభక్తి వల్ల పాపభీతి ఏర్పడవలె. పాపము – పుణ్యము – రెంటి స్పృహను వదలుకొన్న దైవభక్తి అర్థరహితమైనది. అట్లే తప్పు ఒప్పు తెలియక దేశప్రజల హితము కోరుకొనుట దేశభక్తి పరులము అనుకొనుట సార్థకము కాదు.

    మానవధర్మము అనగా మనుష్య జన్మ మహత్తును గ్రహించుకొని ప్రవర్తించునది. మానవ జన్మ మహత్యము ఏమి అనగా దైవమును తెలియగలిగిన మేధ, మనుష్య జన్మలోనే సంభవమగును. దీనిని మనసార అంగీకరించి ఆస్తికతను సాధించుకొనుటయే దైవభక్తి. దైవభక్తి పూరితులై మానవజాతి సేవ చేయుటయే దేశభక్తికి దోహదము చేయును. దేశభక్తికి దైవభక్తికి మార్గములు వేరయి ప్రజలలో అలజడి పెచ్చు పెరుగుచున్నది. ఇది క్షేమంకరం కాదు.

    దయాగుణం కలిగియుండుట ధర్మము. ధార్మిక బుద్ధి గలవాడు దయాపరుడగును. దయాధర్మమును పాటించువారు మానవ ధర్మమును గుర్తింపగల్గుదురు  – ఈ తీరున సత్సంగము, సత్ప్రవర్తన, దైవభక్తితో బాటు దేశ ప్రజాప్రీతిని సంపాదించగలవు.

    మానవ జన్మ మహత్త్వము ఏమి అనగా దైవమును తెలియజాలిన మేధ, మనుష్య జన్మలోనే సంభవమవుగును. ఆ మేధ యొక్క చింతన ప్రకారము ఏమి అనగా –

    తల్లి గర్భాన తనకు ఈ శరీరము ఇచ్చినది పోషించినది దైవము. నిద్రలో సాక్షిగా ఉన్నానని జాగ్రత్తులో చెప్పునది దైవము. స్వప్నావస్థలో జగత్తును సృజించునది చూచునది దైవము. మూర్ఛావస్థలో ధ్యానములో జన్మకు పూర్వము మరణము, తరువాతను సర్వదా సర్వత్ర ఉన్నది సత్యము ఆ నిత్య సత్యమే దైవము. అట్టి దైవమును గుర్తించుట మానవ ధర్మము. ఆ ధర్మమును పాటించినచో దైవభక్తిని దానికి విరోధము లేని దేశభక్తిని మనమందరమును సాధింపగలము.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here