శ్రావణ మాసానికి లక్ష్మీనరసింహ గీతాలతో ఆహ్వానం

0
6

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ గాయని, కవయిత్రి, డాక్టర్‌గా అటు హోమియోపతి ఇటు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇవ్వగల విశిష్ట వ్యక్తి, రేకి ద్వారాఎందరెందరికో వైద్యం చేసి ఆరోగ్యవంతులను చేసిన డాక్టర్ రాజేశ్వరి ఆశువుగా పద్యాలు చెప్పడం, చిట్కా వైద్యాలు చెప్పడం, యోగాసనాలు నేర్పడం, నాడివైద్యం చేయడం వగైరాల్లో దిట్ట అని చెప్పాలి.

భగవంతుడి మీద పాటలు రాసి పాడే ఆమె ‘భక్తి నీరాజనం’ అనే సంస్థను ప్రారంభించారు. వీరు తన సభ్యులతో కలిసి వివిధ ఆలయాల్లో భక్తి గీతాలు పాడడం జరిగింది.షిర్డీ సాయి మీద ఆమె చేసిన గీతాల క్యాసెట్ వంశీవారి షిర్డీ ఆలయంలో ఆవిష్కరించారు. అంతకుముందు పుస్తకాలు కూడా ఎన్నో ఆలయాల్లోనూ ఆడిటోరియంలలోనూ ఆవిష్కరించారు. భక్తి నీరాజనం సభ్యురాళ్లు అటు మేడ్చల్ రామాలయంలో రామకీర్తనలు పాడారు, ఇటు అశోక్‌నగర్ హనుమంతుడి గుడిలో హనుమంతుడి మీద భక్తి గీతాలు ఆలపించారు.

అన్ని తానే రాసి రాగాలు కూర్పించి అందరికీ నేర్పే రాజేశ్వరి ఇటీవల నాచారం, హైద్రాబాద్‌లోని స్వయంభు లక్ష్మినరసింహస్వామి ఆలయంలో చక్కటి భక్తి కార్యక్రమాన్ని నిర్వహించి శ్రావణ లక్ష్మికి ఆహ్వానం పలికారు. అక్కడ డా.రాజేశ్వరి సుభ్రమణ్యం రాసి ఆలపించిన శ్రీ నరసింహ భక్తి గీత మాలిక సీడీని టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కమీషనర్ శ్రీ ఆర్.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆలయంలో భక్తిగీతాల ఆలాపన అనంతరం అందరు గాయనీమణులకు జ్ఞాపికలు అందజేశారు.ప్రసాదాల వితరణ తర్వాత సీడీ గుడికి ఇవ్వడం జరిగింది. సీడీలు స్పాన్సర్ చేసారు సభ్యురాలు శ్రీమతి వీణ.

– సూర్యకిరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here