ధనుష్

0
9

[dropcap]సూ[/dropcap]ర్యోదయం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి కవి హృదయంలో మరింత అలజడితో ఎన్నో భావాలు కలుగుతూ ఉంటాయి. అందులో కొంత మంది జీవిస్తూ ఉంటారు.

భావాల వెనుక ఎన్నో సాహితీ విప్లవాలు ఉంటాయి. కవి ఎల్లప్పుడూ సదా వినమ్రతతో మెలుగుతూ నిరంతరం సాహితీ శోధన సాధనలో ఉంటాడు. సూర్యోదయంలో సప్త వర్ణ సమ్మిళితం చేసి రాగాలు భావాలు వచ్చేవి.

అతనికి వచ్చే ఆలోచనలకి సృజన తోడు అయితే ఆ భావ వల్లరి అనంతము. కాదేది అనర్హం కవితకు అంటూ ఎన్నో భావాలు కురిపిస్తాడు.

సముద్ర కెరటాలు మాదిరి అతని హృదయం విజ్ఞత జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి ధనుష్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చాలా బాగా పనిచేసేవాడు. ఇంటర్వ్యూలు బాగా చేసే వాడు.

అందమైన జీవితం కోసం పరుగులు పెట్టే వయస్సు, కానీ కుటుంబ భాధ్యతలు బంధాలు ఉన్నాయి. జీవితంలో ఇంకా చదువుకోవాలి, ఎదగాలి. తన ఇంటి పేరు నిలబెట్టాలి, ఇది కోరిక. ఆ తపనలో ఎన్నో ఆలోచనలు. విద్యను ప్రైవేట్ గా చదవటం మొదలు పెట్టాడు.

“కానీ వచ్చిన అవకాశం వదులుకుంటే ఎలా? చదివింది చాలు, ఉద్యోగం వచ్చింది చేరు, అంతవరకే మిగితావి కుదరవు” అన్నాడు తండ్రి.

కొందరు ధనుష్ రచనలను నాటకాలుగా మార్చి వెయ్యడం మొదలు పెట్టారు. తండ్రి దీనికి ఒప్పుకోలేదు.

“పెద్ద ప్రెస్ అని ఉద్యోగంలో పెట్టాను కానీ నాటకాలు వేషాలు పనికి రావు” అని ఖచ్చితంగా చెప్పాడు.

ధనుష్ అద్భుతమైన మేధావి. ప్లస్ టూ లో గోల్డ్ మెడల్ సాధించాడు. కవితలు అద్భుతంగా రాసేవాడు. ఒక సాహితీ పత్రికకు పంపేవాడు. అతని కవితలు రెగ్యులర్‍గా పబ్లిష్ అయ్యేవి. ప్రకృతి ఆరాధనలో మరో వర్డ్స్‌వర్త్ మాదిరి ఉండేవి.

ఆ పత్రిక అధిపతి – యువత కాలం చూడటానికి ధనుష్‍కి ఉద్యోగం ఇస్తామన్నారు.

“అయ్యో డిగ్రీ కాలేదు. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యలేదు. అప్పుడే ఉద్యోగమా?” అన్నాడు

“ఎంత చదువు చదివిన ఉద్యోగ అవకాశాలు రావు ఉద్యోగం మానవ లక్షణం” అన్నారాయన.

ఇంట్లో కొన్నాళ్ళు తర్జన భర్జన అయ్యింది. ధనుష్ రాసే పదాలు ధనుస్సు ఎక్కు పెట్టినట్లు ఉండేవి. మాటల గారడీ చేసేవాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు

అతని స్క్రిప్ట్ చూసి అంతా ఆశ్చర్యం ఆనందం పొందారు. పత్రిక సర్కులేషన్ పెరిగింది

అది చూసి వేరే పత్రిక వారు రెగ్యులర్ కాలం వేరే పేరుతో నడపడానికి అవకాశం ఇచ్చారు.

“మీరు ఇచ్చే జీతం చాలదు, వేరే పత్రికకు వెళ్లి పోతాను” అంటే వాళ్ళు కాదు కూడదు అని, “మీరు తప్పకుండా మా దాంట్లోనే ఉండాలి” అని జీతం పెంచారు.

అది సీనియర్స్‌కి కొంత కన్నెర్ర చేసింది, కానీ పైకి తెలేవారు కాదు.

రచయిత గా మరికొన్ని పత్రికలకు బాగా రాసేవాడు. డాక్టర్ సలహాలు, కథలు, కవితలు అన్ని కూడా చాలా కొత్తగా ఉండేవి.

మొత్తానికి అంతా ఉద్యోగానికి ఓటు వేశారు అందులో ఎదిగాడు కూడా. అయితే వేరేగా అతని ఉన్నతి ఆకాంక్ష ఫలించిన మేరకు బాగుంది.

కానీ ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి. అవి నాన్న ఒక్క రెక్క మీద కుదరదు. పైకి మాత్రం “డబ్బు బ్యాంక్ లో దాచుకో, ఇప్పటి నుంచి డబ్బు వెనుక వేస్తే కానీ పెళ్లి పిల్లలు జీవితం సజావుగా ఉండదు కాబట్టి నువ్వు నీ జీతాన్ని దాచు” అని చెప్పారు.

చెల్లెళ్ళు డిగ్రీలు చేసి వెంటనే స్కూల్ జాబ్స్ లో సెటిల్ అయ్యి ప్రైవేట్‍గా పిజిలు చేస్తున్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదిస్తున్నారు. నెల ఖర్చులకి నాన్న డబ్బు సరిపోతుంది. అమ్మని ప్రేమగా చూస్తారు. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ ఎక్కువ ఇవ్వరు. కానీ నాన్న గారు మంచి రచయిత, ఎల్.ఐ.సి. ఏజెంట్.  ఆ డబ్బు బాగానే వస్తుంది.

ఆడపిల్లల పెళ్లికి ముందే వేశారు, అమ్మకి పొలం ఉన్నది, ఆ డబ్బు కొంత వస్తుంది. అమ్మ నగలు బట్టలు నచ్చినవి కొనుక్కుంటూ ఉంటుంది.

ఇంట్లో ఎవరి సంపాదన వారిది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు.

పెద్ద చెల్లెలు సంగీతం బాగా నేర్చుకుంటుంది. చిన్నది డాన్స్ నేర్చుకున్నది. ఇద్దరు కలిపి రేడియో టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. పెద్దది అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా పాడుతుంది.

ముద్దు గాదె యశోద ముంగిట ముత్యము వీడు – అంటూ శ్రీ అన్నమయ్య కీర్తన పాడుతూ నృత్యం చేసున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు ధనుష్. మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ల కృషిని అభినందిస్తూ కొన్ని లోకల్ ఛానెల్స్ వారు కార్యక్రమాలకి పిలిచేవారు.

అన్నగారు కూడా ఉండి వీడియో తీసి యూ ట్యూబ్ ఛానల్  సొంతంగా పెట్టుకున్నాడు

రేడియోలో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ కండక్ట్ చెయ్యడంలో నంబర్ వన్ అయ్యాడు ధనుష్. అది చూసి పెర్మనెంట్ ఎంప్లాయిస్ ఈర్ష్య వ్యక్తపరచేవారు. అవేమీ పట్టించు కోకుండా డబ్బు అవసరాన్ని గుర్తించి తన అవకాశాలు వదులు కోలేదు.

అయితే పోస్ట్ పెర్మనెంట్ విషయం లో కొన్ని ఇబ్బందులు పెట్టారు

అదే సమయంలో చెల్లెళ్ళ డాన్స్ సంగీతంలో సహకారం అందించే ధనుష్ చూపిన కెమెరా ప్రతిభ వల్ల మొదటి బహుమతి కి సెలెక్ట్ అయ్యారు చెల్లెళ్ళు. వారిని ఛానల్ ప్రోగ్రామ్‌కు పిలిచారు.

అంతా ఓకే ఇంటి కుటుంబ సభ్యులు కావడం అదృష్టమన్నారు.

***

అలా ఎదుగుదలలో కొన్ని పోస్టులు పడ్డాయి. ఒక దానికి ధనుష్ అప్లై చేసాడు

సొంత ప్రతిభతో ఎదిగి ఒదిగిన మహా వ్యక్తి ఎవరు ఏమన్నా నవ్వుతాడు. ఏమి విమర్శ చెయ్యడు. ఆడవాళ్ళని మర్యాదగా అమ్మ అమ్మాని పిలుస్తాడు. స్త్రీలు అంటే మర్యాద, గౌరవము.

వాళ్ళకి కూడా మర్యాద బాగా వచ్చును. అన్నీ అదే ఊళ్ళో ఉండటం వల్ల వారికి ఇబ్బంది లేదు. అక్కడే పెద్ద ఇల్లు చూసి అందులోకి మారారు

పెద్ద చెల్లికి సంబంధాలు చూసాడు. అయితే అమె ఉద్యోగం మానను అన్నది.

కానీ వచ్చిన సంబంధం పెద్ద ఇంజినీర్. “నా భార్య ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు” అన్నాడు. సంగీతం మాత్రం పాడవచ్చును అన్నాడు.

ఆడపిల్లలు ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించు కుంటారు. కానీ పెళ్లి వారు ఎలా అంటే ఆలా మారాలి. వాళ్ళు వద్దు అంటే ఉద్యోగం వదిలి పెళ్లికి ఇష్టపడాలి. అత్తవారు ఎలా అంటే అలా వినాలి. ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఆడపిల్ల జీవితం.

అల్లారు ముద్దుగా పెరిగి అన్ని నేర్చుకుని ప్రజ్ఞ ఉన్నా సరే ఇంటికి పరిమితం అవ్వాలి. అప్పుడే ఆడపిల్ల జీవితానికి విలువ అంటారు.

ధనుష్ “మంచి సంభదము చెల్లీ, నువ్వు ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకో” అని పట్టుబట్టాడు.

అప్పటికే తను కొంత జీతము జాబ్ కోసం ఇచ్చి ఉద్యోగం పెర్మనెంట్ చేసుకున్నది, కమిటీకి బిల్డింగ్ ఫండ్ అంటూ పుచ్చుకున్నారు

ఇప్పుడు పెళ్లి వారు వద్దంటున్నారు అన్నారు. పెళ్ళి కొడుకు అక్కలు ఉద్యోగాల్లో డబ్బుకి అలవాటు పడి పెళ్ళిళ్ళు చేసుకోలేదట. లేదా సరి అయిన జాబ్ ఉన్నవాళ్లు దొరకక ఆలా ఉండిపోయారు అన్నారు. అన్నదమ్ములు పెద్ద ఉద్యోగాలు. ఎవరికి తీరిక లేదు అంటారు. ఉద్యోగ బాధ్యతల్లో తీరిక ఉండదు కూడా. పెళ్లి గురించి ఆలోచించే సమయం ఎక్కడ అని నవ్వుతారు. మరదలకి ఉద్యోగం అవసరం లేదు, వంట వార్పు వస్తే చాలు. చక్కగా సంగీతం వచ్చు, పాటలు పాడుతూ పూజ చెయ్యవచ్చును అని పొగిడారు

ఏది ఏమైతేనేం పెద్ద పిల్ల సౌమ్య పెళ్లి ఘనంగా జరిగింది. అది ఆమె అదృష్టం అన్నారు. ఏదైనా సరే మన సమాజంలో ఆడపిల్ల పెళ్ళి అదృష్టమే అంటారు, మనం ఒప్పుకోవాలి. మరి అంతే కదండీ. సరే. ఇంటి కోడలు ఇంటికి నిండుగా ఉండి వంటింటి వారసులుగా ఉంటూ అన్న పూర్ణ దేవిలా వండి వార్చాలి. ఈ ఆధునిక యుగంలో కూడా నరం లేని నాలుక ఎముక అడ్డు లేని చేతుల మాదిరి అత్తగారి హాయం వెళ్లి పోవాలి. ఇది అవిడ ఉద్దేశం. ఖర్చులు పెరుగు తున్నాయి అంటే కోపం వస్తుంది, తినడం మనుతామా సంపాదించుకుని తినాలి. ఆడ మగ చదువులు అందుకే అంటుంది.

ఒక రోజు కూరల వ్యాన్ రైతుబజార్ పెద్ద వ్యాన్‌లో వస్తుంది. అంతా వెళ్లి కొనుక్కుంటారు. అక్కడ కొంచెం ధర తక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్లి కూరలు తెమ్మన్నారు.

అక్కడ సౌమ్య ఆడపడుచులు మరదలికి మా పద్దతిలో నేర్పాలి అనుకున్నారు.

అక్కడ వదిన గారు పెత్తనం కూడా ఉండి కూరల వ్యాన్ దగ్గరకి ప్రక్క వీధిలోకి తీసుకు వెళ్ళారు. అక్కడ చిక్కుడు కాయలు నూట యాభై చెప్పాడు. “అమ్మో అంతా ధర పెట్టుకోవాలా అవసరం ఏమిటి, కిలో వంద దాటి కూర అవసరం లేదు” అన్నది. దానికి వదిన గారు మాత్రం “ధర ఎక్కువ అని తినడం మానుతామా? ఎప్పుడు ఒక్క ధర ఉండదు. మారుతూ ఉంటాయి. నువ్వు చిక్కుడు కాయలు కొనవలసిందే. ఎంత ఎక్కువ చిక్కుడు కాయలు తింటే అంత మంచిది చిక్కులు పోతాయి” అంది. “అలాగే చింత కాయలు, చింత పండు ఎక్కువ తింటే చింతలు ఉండవు” అన్నది హిస్టరీ లెక్చరర్ చేసిన వదిన గారు.

సరే అని సౌమ్య ఊరుకున్నది.

అక్కడే ఓ వెయ్యి రూపాయలు ఖర్చు చేసి వచ్చారు. ప్రక్క వీధే అయినా సరే ఆటో పీల్చి ఎక్కారు. బేరం లేదు వాడు వంద అంటే వంద ఇచ్చారు.

“అయ్యో అంత ఎందుకు?” అంటే “వాడి కష్టం మనకెందుకు?” అంటు సాగదీసింది. ఇంక సౌమ్య మాట చెల్లనివ్వరు.

“కానీ వదిన గారు, మా అమ్మ చింత పండు కాయలు తింటే మోకాళ్ళ నెప్పులు తగ్గుతాయని చెప్పింది. చిక్కుడు గౌరీ నోము నోచితే చింతలు ఉండవు అని తెలుసు కానీ ఇలా తెలియదు” అంది సౌమ్య.

“నీకు అన్ని తెలియాలని లేదు. మేము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాము మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. నువ్వు టీచర్‌గా చేసావు, మీ నాలెడ్జ్ వేరు ఉంటుంది. మేము కాలేజ్‌లో పెద్ద పిల్లలతో పడి ఉన్నాము మీరు చిన్న పిల్లలతో పడటం కనుక మీకు ఏమి అసలు తెలియదు” అంటూ హిత బోధ చేశారు.

ఒప్పుకొక తప్పలేదు. వారితో వాదించే ఓపిక లేదు. వాదించినా, నెగ్గలేదు. వాళ్ల అందరిది ఒకే మాట బాట.  వేట తోట టాటా అనాలి కానీ వాదన పనికిరాదు. ఏ విషయం గురించి చెప్పినా నీకు తెలియదు, పిడి వాదన చెయ్యకు అంటారు.

పండుగలు వస్తే మా పద్ధతి ప్రకారం కలగాయ పులుసు అంటారు. మళ్ళీ అందులో వేసే ముక్కలు సహితము స్కేలు పెట్టీ కొలిచినట్లు ఓకే సైజ్ లో ఉండాలి అంటారు. అన్ని మా పద్ధతిలో ఉండాలి అంటారు.

పెళ్లి అయిన ఏడాది శ్రావణ పూజలు నోము చెయ్యాలి అన్నారు. ఆషాడం వానలు శ్రావణంలో మబ్బులు చిరు జల్లులు మేఘాలు ముచ్చటగా వర్ణాలు మారుస్తూ మెరుస్తూ పెరంటాళ్ళ కోసం ఎదురు చూపులు చూస్తూ చిన్న చిన్న చిరు జల్లులు కురిపిస్తూ ఆనందాన్ని వ్యక్తీకరిస్తు ‘సౌభాగ్యవతీ భవ’ అని దీవిస్తాయి. ప్రకృతి సహజ దీవెన ఆనందం, ఆహ్లాదము.

శ్రవణ నక్షత్రంలో వచ్చే మాసం శ్రావణ మాసం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్ర మాసం. శ్రీ మహా లక్ష్మికి ప్రతి అందుకే మంగళ గురు వారాలు పూజలు నోములు ఉంటారు. సౌమ్య అన్నగారు ధనుష్ అతని తల్లి తండ్రి కూడా శ్రావణ మాస మంగళ గౌరీ వ్రతము సౌభాగ్య శుక్ర వారం వ్రతము మీ ఇంటి కోడలు మా అమ్మాయి సౌమ్య చేత చేయిస్తాము అన్ని అందరిను పేరు పేరున పిలిచారు.

శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు శుక్రవారం నోముకి అంతా వచ్చారు. నెక్లెస్ సెట్ తెచ్చారు. కంచి సొసైటీ నుంచి పెద్ద పట్టు చీర తెచ్చారు. అందరి ముందు వాళ్ళ గురించి అతి గొప్పలు చెప్పుకున్నారు.

మొదటి ఏడాది ఐదుగురు కనుక తేలికగా అవుతుంది. గోదావరి జిల్లాల వారికి సంఖ్య పెరుగుతుంది. రెండవ ఏడాది పది మూడవ ఏడాది పదిహేను నాల్గవ ఏడాది ఇరవై ఐదవ ఏడాది పాతిక మంది పెరంటాళ్ళు కావాలి. పాతిక జ్యోతులు పెట్టీ వెలిగించి కథ చెప్పుకోవాలి. ఆ కాటుక అందరికీ ఇవ్వాలి. “ఆ జ్యోతులు నువ్వు నీ భర్త మాత్రమే తినాలి” అని చెప్పారు. పూజ తరువాత మరదలు మంగళ హరతి పాడాలి అన్నారు. సౌమ్య క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహా లక్ష్మికి నీరజా లయకును నీరాజనం అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన పాడింది హారతి ఇచ్చింది. అందరూ తృప్తి పడ్డారు.

భర్త ఉన్నతి సౌభాగ్యం స్త్రీకి ముఖ్యం అంటూ చెప్పారు. వాళ్ళకి పెళ్లి చెయ్యలేదు కనుక ఎన్నైనా చెపుతారు అన్నది తల్లి, సౌమ్య కూడా అలాగే అనుకున్నది. కానీ సౌమ్య పేరుకి తగ్గట్టు గానే ఉంటుంది

అందులో ఈ ఏడాది బాగా ఐదు శుక్ర వారాలు వచ్చాయి. మొదటి వారం పాడ్యమి శుక్రవారం నెల మొదలు. అది కూడా మంచి పర్వపు రోజులు రెండవ వారం వరలక్ష్మి  శుక్రవారము. మూడవ వారం రాఖీ పూర్ణిమా, సౌభాగ్య శుక్రవారము. నాలుగవ వారము శ్రీ కృష్ణ అష్టమి. ఐదవ వారం చతుర్దశి అమావాస్య మధ్యానం అయ్యేసరికి వచ్చింది. అమావాస్య పూజ శ్రీ మహా లక్ష్మికి ఎంతో ప్రీతి కూడా. మొత్తనికి అన్ని శుక్రవారాలు ఘనమైన రోజులు.

మర్నాడు పొలాల అమావాస్య. పిల్లల కోసం చేసే నోము ఆ కథలో చాలా గొప్పతనం ఉన్నది. కంద మొక్కకి పసుపు కుంకుమ పెట్టి ఆవుపాలతో అలికిన నేలపై ఉంచి పూజ చేసి బూర్లు మగ పిల్లల కోసం, గారెలు ఆడపిల్లల కోసం నివేదన పెడతారు. కొందరు దండగా గుచ్చి ఐదు లేక తొమ్మిది లేక పన్నెండు పిండి వంటల దండతో పూజిస్తారు

ఇంకా మంగళ వారం అయితే సెనగలు పండు తాంబూలం చలిమిడి కాటుక ముఖ్యము. ఈ నోముకి చలిమిడి కాటుక ముఖ్యము. సెనగలు గురు గ్రహానికి తామలపాకులు, బుధుడుకి వక్క, రాహువుకు మంగళ వారం కుజుడికి అరటి పళ్ళు, శుక్రుడికి అవు నేతి దీపం. సూర్యుడికి బియ్యం పిండి చలిమిడి. చంద్రుడికి గౌరీ దేవికి ప్రీతి దూది వత్తులు భక్తితో వెలిగించడం. కేతువుకు నల్లని కాటుక, శనికి ప్రీతి కాటుక. సౌభాగ్యప్రదం కనుక స్త్రీలు తప్పక కాటుక పెట్టుకుంటారు.

ప్రతి నోముకి నవగ్రహ ప్రీతి గౌరీదేవి వినాయకుడు శక్తినీ యుక్తిని మాంగల్య బంధాన్ని మెరుగు పరుస్తాయి. ఒక మంగళ వారం కూడా నోముకి ఉన్నారు

“ఏమైనా మీలా మా ఇంట్లో శ్రద్ధగా చేయిస్తే, మేము ఎంతో బాగా కుటుంబాలు చూసుకుందుము. కానీ మేము చదువు ఉద్యోగాల్లో బిజీ అయ్యాము” అంటూ వదిన గారు అన్నది.

పెద్ద వదిన గారు అత్తగారు స్థానంలో ఉండి అన్ని నడుపుతూ ఉంటుంది.

మంగళ వారం పూజ అయ్యక తల్లికి బుట్ట వాయనం ఇచ్చింది. మిగిలినవి ప్యాకెట్ లు కట్టింది.

“సహజంగా ఐదు చాలు కానీ ఇంట్లో ఇంకా ముత్తైదువులు ఉంటే వారికి ఇవ్వాలి” అంటూ ఇంకో పది ప్యాకెట్లు అదనంగా కట్టించి కూతురుకు ఇచ్చింది

మరదలు ఎలా ఉన్నది ఎలా ప్రవర్తిస్తోంది అని అన్ని పరిశీలిస్తోంది వదినగారు. మరదలు వంగ పండుకి మెరున్ అంచు కంచి పట్టు చీర కట్టుకున్నది. కాళ్ళకి పసుపు రాసి పారాణి తల్లి పెట్టింది. పట్టీలు పెట్టుకున్నది చేతులకి గాజు గాజులు మధ్యలో వేసుకున్నది. జడలో జాజులు సంపెంగల సువాసన మత్తుగా వస్తోంది. వంక పెట్టడానికి ఏమీలేదు. వాళ్ళు తెచ్చిన కొత్త నగలు ధగ ధగ మెరుస్తూ ఉన్నాయి. “అదృష్టవంతురాలు మా ఇంటి కోడలు అయ్యింది” అన్నది. మరదలకి కూడా తల్లి అడబడుచు వెళ్లి వాయినాలు ఇప్పించారు.

“ఇంక మీ అబ్బాయి పెళ్లి చెయ్యండి, మీకు కోడలు వస్తుంది నోములు చేస్తుంది.”

“అలాగే అండి” అన్నది ధనుష్ తల్లి.

ధనుష్ చెల్లెళ్ళకి లోటు లేకుండా అన్ని బాగా చేశాడు. తల్లి తండ్రి సంతోషించాడు

“మీ అబ్బాయి ఎక్కువ మాటలు చెప్పడు. వృత్తిలో బిజీ అనుకుంటాను” అంది సౌమ్య వదినగారు

“అవునండీ, వాడికి మంత్రుల ఇంటర్వ్యూలు ఉన్నాయి” అంది తల్లి.

***

బయట అంతా వర్షం మయం. పంటలు అంతా మునిగిపోయాయి. పోలాల అమావాస్యకి గోదారి పొంగుతూ వస్తుంది. చేలు అన్ని గత ఏడాదిగా వరద వల్ల నీటిలో మునిగాయి. ఇందులో పొలాలు ఉన్న వాళ్ళు ఎక్కువ భాగం అరవై దాటిన వాళ్ళే. పిల్లలు ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు. కొందరికి ఆడపిల్లలు.

ధనుష్ చేస్తున్న ఒక ఇంటర్వ్యూలో ఒకామె చెబుతోంది:

అయితే పంట నష్టం విషయంలో వేలి ముద్రలు పడక డబ్బులు ఆగిపోయాయి. ఇటు రైతు శిస్తులు ఇవ్వలేదు. ప్రభుత్వ పించేను వేలి ముద్ర పడక ఇవ్వడం లేదు. రేషన్ ఇవ్వరు ఇంకా మేము బ్రతికేది ఎలా ఏవిధంగా బ్రతకాలి.. ఉట్టి మీద పెడితే ఉడుత ఎత్తు కెళ్ళిందీ, పెట్టెలో పెడితే పెళ్లి కొడుకు ఎత్తు కెళ్ళాడు. అటక మీద పడితే అత్తగారు ఎత్తుకెళ్ళింది – ఈ సామెత మాదిరి మాకు ఏ విధంగానూ ఏది అందలేదు. మా పొలం శిస్తులు కూడా రావడం లేదు” అంటూ ఎంతో వాపోయింది.

ఆనాడు హిందీ బీఏ చదివిన కుటుంబ సభ్యుల సేవలో ఉండి వంట వార్పుతో అత్తింటి భాధ్యతలు ఉండి సతమతం అయ్యాననీ, ఈనాడు పట్టించుకునే వారు లేరని చెప్పింది.

“ఉమ్మడి కుటుంబంలో అందరు సేవ కోరే వారే కానీ వృద్దాప్యంలో చూసే వారు లేరు. ఏదో కొంత సొమ్ము పని వాళ్ళకి ఇచ్చి పని పురమాయించి చేయించుకుని  జీవిస్తున్న ముసలి వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ వేలిముద్ర పడటం లేదు. డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేక పర్మిషన్ కార్డు ఇవ్వాలి. పొలంలో పంట నష్టం ఇవ్వక పోతే ఎలా బ్రతుకుతారు? ఒక్క సారి పెద్ద మనసుతో మాన్యులు అలోచించి పాత నష్టం కూడా ఇప్పిస్తే కడుపుకు

ఆహారం అప్పులు తీరుస్తాము” అని ఆమె మంత్రికి విన్నవించుకుంది. ఆమె మాట్లాడే తీరు అద్భుతంగా ఉన్నది.

“ఏమి తింటా బాబు? నా కొడుకుగా భావించి  నీకు అన్ని చెపుతున్నాను. ఈ విధంగా ఈ కష్టం నా ఒక్కర్తిదే కాదు, సమాజంలో ఎందరిదో” అన్నది ధనుష్‌తో.

ఆ ఇంటర్వ్యు చేశాక, ఆమెను చూశాక ధనుష్ చాలా అలోచించాడు. ఆ తరం స్త్రీలు గొప్పవారు అనుకున్నాడు. ‘ఉద్యోగాలు చెయ్యకపోయినా ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడింది’ అనుకున్నాడు

ఆమె అడిగిన అంశం అందరికీ అనుభవమే, కానీ మగవాళ్ళు ఆ రీతిలో మాట్లాడలేరు. స్త్రీ కనుక తన కష్టాన్ని అద్భుతంగా, ఆత్మీయంగా – ఆ మంత్రిని ఒక కొడుకులా బుజ్జగిస్తూ ప్రేమగా అడిగింది ఆమె.

ఆ రోజు రాత్రే అది ప్రసారం చేశారు. చాలా మంది ఆమె మాటలకి ప్రశంసలు ఇచ్చారు. తాము చెప్పలేనిది అవిడ ధైర్యంగా చెప్పింది అనుకున్నారు.

“అవును ధనుష్ ఆవిడ బాగా చెప్పారు” అని సౌమ్య వదిన గారు కూడా మెచ్చుకున్నది.

పొలాల అమావాస్య కంద మొక్క పూజతో ఆ ఏడు ఆఖరు అయ్యింది.

అయితే సిటీలో ఉన్న వాళ్ళు కంద మొక్క దొరకక కంద ముక్కకి, కంద దుంపలకి కూడా చేస్తారు. దుంపతో పాటు చిన్న చిన్న దుంపలు ఉన్నది ఎంచుకుని పూజించాలి

భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో పూజలు నోములు కుటుంబ వృద్ది కోసం, సౌభాగ్యం కోసం స్త్రీలకు చెప్పబడ్డాయి. దీనివల్ల ఓర్పు, నేర్పు, సహనం, శాంతం కూడా అలవడతాయి అని నమ్మకము కూడా అని మనకు

పురాణాలు, పెద్దలు చెపుతారు

ఈ శ్రావణ మాసం అంతా వానలతో ముగిసింది.

“మరి మన ధనుష్‌కి మంచి అమ్మాయిని వెతకండి” అన్నారు.

అయితే గడుసరి అత్త సొగసరి ఆడ పడుచులు అంతా వారి పెత్తనమే. మంచి ఓర్పు ఉన్న పిల్ల కావాలి, చెప్పండి. వంట వార్పు చాలుట. మంచి మానవత్వంతో పాటు రూపసి కావాలి. మరి ప్రయత్నం చేసి చూద్దామా? శుభమస్తు.

ఆడపిల్ల ఇంటికి అలంకారం. వంటింటికి సహకారం ఉండాలి. ఎన్ని తరాలు మారినా ఈ మార్పు ఉండదు. మళ్ళీ అందరం ధనుష్ పెళ్లిలో కలుద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here