ధ్వని కాలుష్యం

0
7

[box type=’note’ fontsize=’16’] ‘ధ్వని కాలుష్యం‘ అనే ఈ కథలో సౌండ్ పొల్యూషన్ వల్ల, మనుషులకు, జంతువులకీ ఎదురవుతున్న ప్రమాదాన్ని వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]పం[/dropcap]డగ సీజన్ కావటంతో ఎప్పటిలా గల్లీ గల్లీ కి, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్స్, గణపతి మండపాలు, వాటిని అలంకరించిన విద్యుత్ దీపాలు, పెద్దపెద్ద స్పీకర్ బాక్స్‌లు, మైక్స్, పాటలు! పిల్లలకు కావలిసినంత సందడిగా ఉంది.

సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న 201 అపార్ట్‌మెంట్‌లో తాతగారికి ఆరోగ్యం బాలేదు. మితిమీరిన స్పీకర్ల శబ్దాలు, చుట్టుపక్క ఇళ్లల్లో జరుగుతున్న వుడ్ వర్క్ శబ్దాలు అన్ని కలిపి మరింత ఇబ్బంది పెడుతున్నాయి తాతగారిని.

మనవడు కీర్తన్‌ని పిలిచి స్పీకర్ శబ్దాలు తగ్గించమని, అంత శబ్దాలు చెవులకి మంచివి కావన్నారు.

“తాతా, నీకు ఫన్ అస్సలు తెలీదు. మ్యూజిక్ లౌడ్‌గా ఉంటేనే ఎంజాయిమెంట్. నా ఫ్రెండ్స్‌కి సౌండ్ తగ్గించమని చెప్పను” అన్నాడు కీర్తన్ నిర్లక్ష్యంగా.

పాపం తాత నవ్వి ఊరుకున్నారు. “కీర్తన్ ప్లీజ్ విండోస్ క్లోజ్ చెయ్యి” అన్నారు. వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.

అటుగా వచ్చిన కిరీటీ ఆగి తాత రూమ్ విండోస్ క్లోజ్ చేసి, ఫ్రూట్ జ్యూస్ తాగించి వెళ్ళాడు. ఇద్దరిలో ఎంత తేడా అనుకున్నారు.

మరుసటి రోజు కీర్తన్ స్కూల్ నుండి హై ఫీవర్‌తో ఇంటికి వచ్చాడు. డాక్టర్ ‘వానాకాలం కావటంతో వైరల్ ఫీవర్స్ సిటీలో ఉన్నాయ’ని చెప్పి మందులు ఇచ్చి రెస్టు తీసుకోమన్నారు. అమ్మ ఇచ్చిన వేడి సూప్ తాగి రిలాక్స్ అయిన కీర్తన్‌కు విపరీతమైన తలనొప్పిగా ఉంది. చిన్న శబ్దం కూడా పెద్దగా, చిరాగ్గా ఉంది.

సెల్లార్లో పెట్టిన గణపతి విగ్రహం, వీధిలోని పెద్ద గణపతి మండపం నుండి పోటీపడుతున్నట్టుగా, ఏదో సౌండ్ కాంపిటీషన్‌లా పెద్దగా సౌండ్‌తో పాటలు పెట్టారు. ఆ శబ్దం కీర్తన్‌ను మరింత ఇబ్బంది పెడుతున్నది.

“అమ్మా! అమ్మా! ప్లీజ్! విండోస్ క్లోజ్ చెయ్యి. సౌండ్ ఎక్కువగా ఉంది” అని పిలిచాడు.

అమ్మ వచ్చేలోగా కిరీటి వచ్చి విండోస్ క్లోజ్ చేసాడు. తమ్ముడు దగ్గరకి వచ్చి ఫీవర్ చూసాడు. “పాపం! 3 రోజుల కిందట తాత శబ్దం ఎక్కువుందంటే విసుక్కున్నావు. మరి ఇప్పుడు?” అన్నాడు.

“అది… అవును. సారీ! అన్నా” అన్నాడు కీర్తన్ సిగ్గుగా

ఇంతలో రూమ్ లోకి “హలో గైస్! వాట్స్ అప్?” అంటూ మామ మానవ్ వచ్చాడు.

“మామా! మామా!” అంటూ పిల్లలిద్దరూ ఆనందంగా అరిచారు.

“ఏంటి? అందరు ఫీవర్‌తో పడక వేసారుట. నాన్న చెప్పారు.”

జ్వరం తగ్గిన తాత మనవళ్ల రూమ్ లోకి వచ్చారు.

“రండి తాతా! కూర్చోండి” అని కిరీటి తన మంచం చూపించాడు.

మంచం మీద కూర్చున్న తాత కీర్తన్‌ని “బంగారు! ఎలా ఉన్నావు? కొంచం తగ్గిందా?” అన్నారు

“తాతా! సారీ. ఆరోజు మీ పెయిన్ అర్థం చేసుకోలేక పోయాను. ఇప్పుడు నాకు తెలుస్తోంది హై సౌండ్స్ ఎంత ఇబ్బందో” అని అన్నాడు కీర్తన్

“ఇట్స్ ఓకే”

వీరి మాటలు వింటున్న మామ మానవ్‌కి విషయం అర్థం అయింది.

“ఓహ్! అదా సంగతి. సౌండ్ పొల్యూషన్. ధ్వని కాలుష్యం” అన్నాడు

పిల్లలు మామ చెప్పే స్టోరీ కోసం రెడీ అయ్యారు.

“శబ్దం, ధ్వని, సౌండ్… జీవన నాదం. సౌండ్ ఈజ్ రిధం అఫ్ లైఫ్. మనం నిశ్శబ్దంలో ఎక్కువ సేపు ఉండలేము. its so important” అన్నారు మామ మానవ్.

“అవును మామా. సైలెన్స్ ఈజ్ వెరీ బోరింగ్” అన్నాడు కీర్తన్

“అవునా? నీకు సౌండ్ గురించి ఏమి తెలుసు?” అన్నారు మానవ్.

కీర్తన్ సమాధానం చెప్పేలోపు ‘కీర్తన్ ఆగు! నీ టెక్స్ట్ బుక్, టీచర్ చెప్పింది కాదు” అన్నారు.

“మరి ఇంకేంటి మామా?”

“శబ్దం/sound మితిమీరితే ఏమి జరుగుతుంది?”

“తెలీదు.”

“అసలు సౌండ్ అంటే తెలుసా?”

“సౌండ్ అంటే if something vibrate అది waves గా అయ్యి మన ears లో వినిపిస్తుంది” అన్నాడు కిరీటి.

“గుడ్. కిరీటి ఆ something ని waves of energy అంటే తరంగ శక్తి అంటారు. కదలికల వల్ల వచ్చిన vibrations లేదా waves తరంగాలు గాలి air లో ట్రావెల్ చేసి మన చెవుల్లోకి వస్తుంది.”

“మామా! వేవ్స్ ఓన్లీ ఎయిర్‌లో ట్రావెల్ చేస్తాయా?” అడిగాడు కీర్తన్.

“లేదు. తరంగాలు/వేవ్స్ air, solid, liquids లేదా gas లో కూడా పయనిస్తాయి. ఐ మీన్ ట్రావెల్ చేస్తాయి. అందుకే మనకి గాలి శబ్దం sound of air, వాటర్, gas, wood, stone ఇలా రకరకాల sounds శబ్దాలు వినిపిస్తాయి. శబ్దాల కదలికలు అంటే stronger the vibration louder the sound.”

“మామా! సౌండ్ హై పిచ్‌లో పెట్టవద్దని తాత విసుక్కున్నారు. పిచ్ అంటే ఏమిటీ?” అన్నాడు కిరీటి

“పిచ్ అనేది sound /శబ్దం క్వాలిటీ. హై లేదా low. ధ్వని తరంగాల కదలికల స్పీడ్ దూరంని బట్టి pitch quality ఉంటుంది. ఉదాహరణకి కిరీటి బెడ్ రూంలో ఉన్నాడు. కీర్తన్ లిఫ్ట్ దగ్గర నుంచుని కిరీటిని పిలుస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది?” అన్నారు మామా.

కిరీటి “సరిగ్గా వినపడదు” అన్నాడు.

“ఎందుకు?”

“నేను దూరంగా ఉన్నాను.”

“కరెక్ట్. ఒకవేళ దగ్గరగా ఉంటే?”

“ఓకే, బిగ్గరగా వినిపిస్తుంది” అన్నాడు కిరీటి

“అదే నేను చెప్పేది. distance, speed of the vibration wave quality ని డిసైడ్ చేస్తాయి. కీర్తన్, silence is boring అన్నావు. నిజానికి టోటల్ సైలెన్స్ ఉండదు. నిశ్శబ్దంలో కూడా మధురమైన sweet మ్యూజిక్ ఉంది. దాని వల్ల హాని లేదు. బట్ హై పిచ్ సౌండ్స్ అదే నాయిస్ మూలంగా చాల ప్రమాదాలున్నాయి హెల్త్ కి” అన్నారు మామా.

“డెంజర్ టు హెల్త్? హౌ? ఎలా?” అన్నారు కిరీటి, కీర్తన్ ఒక్కసారే కోరస్‌గా.

“ఎలా అంటే చెబుతాను వినండి. నాయిస్ అనే పదాన్ని సాధారణంగా పెద్ద పెద్ద సౌండ్స్ లేదా అవసరానికి మించి వాడే స్పీకర్ సౌండ్స్, మనకి, చెవులకి హర్టింగ్ గ ఉండే వాటికీ వాడతారు. మీ బిల్డింగ్ లో పెట్టిన పండగ పెండాల్ లో ని సౌండ్స్ ని నాయిస్ అంటారు. ఇట్స్ ఇర్రిటేటింగ్ టు ఇయర్స్ అండ్ పీపుల్. మీ పెండాల్ స్పీకర్ సౌండ్ ఒక్కటే కాదు నాయిస్ అంటే.”

“మరి?”

“ఇంట్లో లౌడ్‌గా ప్లే అయ్యే మ్యూజిక్, టీవీ; construction, carpentry, ఇండస్ట్రియల్, వెహికల్ సౌండ్స్ లాంటివి ఎన్నో. మామా ఇంకా ఇంట్లో వాడే గాడ్జెట్స్, మిక్సీ, బైట బస్సులు, లారీలు, విమానాలు” అన్నాడు ఉత్సాహంగా కిరీటి.

“రైట్. సౌండ్/శబ్దాన్ని ఎలా కొలుస్తారు? ఎలా measure చేస్తారు?”

“తెలీదు. ఎలా?”

“సౌండ్ ని డెసిబుల్ యూనిట్స్‌లో కొలిచి, measure చేసి db అంటారు.”

“మామా! ఎంత డెసిబుల్స్ ఓకే మనకి” అన్నాడు కీర్తన్.

“కీర్తన్! కిరీటి! నాయిస్ పొల్యూషన్ మనుషులకే కాదు అనిమల్స్, బర్డ్స్‌కి కూడా చాలా హాని చేస్తుంది. సాధారణ సంభాషణ ఐ మీన్ నార్మల్ కాన్వర్జేషన్ నాయిస్ లెవెల్ సుమారుగా 60 db, కొన్ని machines 90db, loud మ్యూజిక్ concert 120 db ఉంటాయి. 85 db కంటే ఎక్కువ ఉంటే harmful. నాయిస్‌ని పర్యావరణ కాలుష్యం/పొల్యూషన్‌గా చెబుతారు. ఇతర కాలుష్యాలు పొల్యూషన్స్ కంటే తక్కువ ఇబ్బంది అనుకుంటాము. నిజానికి కాదు. మనకి తెలీకుండానే శబ్ద కాలుష్యానికి మన శారీరిక మానసిక ఆరోగ్యం (మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్) ఎఫెక్ట్ అవుతున్నది.”

“మామా! నాయిస్ మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? అదెలా?” అన్నాడు కిరీటి.

“నాయిస్ పొల్యూషన్‌ని – డొమెస్టిక్, సోషల్. ఇండస్ట్రియల్, ట్రాన్స్‌పోర్ట్‌గా డివైడ్ చెయ్యవచ్చు. కిరీటి సోషల్ నాయిస్ అంటే…?”

ఒక్క నిముషం ఆలోచించిన కిరీటి “మామా! టెంపుల్స్ ఇతర ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, ఫెస్టివల్ పెండాల్స్‌లో లౌడ్ స్పీకర్స్ పాటలు. పార్టీ మ్యూజిక్ అనుకుంట. కరెక్ట్?”

“అవును. సరిగ్గా ఊహించవు.”

“కీర్తన్! కమర్షియల్, ఇండ్రస్ట్రియల్ నాయిస్ పొల్యూషన్ అంటే?”

“మామా! ఫ్యాక్టరీస్, బిల్డింగ్ సైట్స్, మైనింగ్, మాల్స్‌లో లౌడ్ మ్యూజిక్ అనుకుంట.”

“అవును. హెల్త్ ఎఫెక్ట్స్ ఏమిటంటే మితిమీరిన శబ్ద కాలుష్యంకి expose అయితే తలనొప్పి, చిరాకు, ఆందోళన, నిద్ర పట్టకపోవడం, వినికిడి శక్తి తగ్గటం, కోపం, నెర్వేస్ నెస్, ఫెటిక్ తెలీని నీరసం, సరిగ్గా పనిచెయ్యలేకపోవటం. అంటే నాయిస్ ఏకాగ్రతని / కాన్సంట్రేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. అంతేకాదు నిరంతరం పెద్ద శబ్దాలకు ఎక్సపోజ్ అవుట్ బీపీ గుండె జబ్బులు రావచ్చుట. కాలక్రమేణా tinnitus అనే వ్యాధి రావచ్చు. మనకే కాదు జంతువులకు, పక్షులు, ఫిష్ లాంటి వాటికీ కూడా ప్రమాదమే.

“అదెలా మామా? అవి స్పీకర్స్ వాడవుగా?”

“కీర్తన్! మనం వాడే పవర్ బోట్స్, షిప్స్, ఆయిల్ డ్రిల్లింగ్ మెషిన్, కటింగ్ మెషిన్, మైనింగ్ మెషిన్, వెహికల్స్, విమానాలు మొదలైనవి.”

“మామా! మనం ఈ పొల్యూషన్ ని తగ్గించలేమా?”

“గుడ్ క్వశ్చన్. తక్కువ పిచ్‌లో శబ్దాలు ఉండేలా చూసుకోవాలి. మెషిన్స్, వెహికల్స్‌ని సరిగ్గా మైంటైన్ చెయ్యాలి. ఎక్కువ సౌండ్ రాకుండా పార్టీ మ్యూజిక్ సౌండ్ పొల్యూషన్ లెవెల్‌కి వెళ్లకుండా చూడాలి. హై పిచ్ సౌండ్స్ ఉంటే కిటికీలు క్లోజ్ చెయ్యాలి. సౌండ్ ప్రూఫ్ రూమ్స్. 60-80 db లోపలే సౌండ్ ఉండేలా చూడాలి. మితిమీరిన సౌండ్ పెట్టటం/కారణం అవటం చట్టరీత్య నేరం. its offense. సంబంధిత అధికారులకు కంప్లైంట్ చెయ్యవచ్చు. ఇప్పుడు అర్థం అయ్యిందా? తాతకి నీకు ఫీవర్‌లో హై పిచ్ సౌండ్ ఎందుకు ఇరిటేట్ చేసిందో. మీ కాలనీలో ఫెస్టివల్ సౌండ్స్ ఎంతమందికి ఇబ్బంది కలిగించాయో. కిరీటి,కీర్తన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పండగలు,పార్టీలు అనేవి అందరు కలిసి సంతోషంగా చేసుకునేవి. అందుకు అనవసరపు, మితిమీరిన నాయిస్‌తో స్పీకర్స్ అవసరం లేదు. లోకానికి మేము ఫెస్టివల్, పార్టీ చేసుకుంటున్నామహో అని లౌడ్‌గా చెప్పక్కర్లేదు. లౌడ్ స్పీకర్స్ లేకుండా కూడా పండగ చేసుకోవచ్చు. మీరు పాడండి పాటలు పద్యాలూ. మీ టాలెంట్ అందరికి తెలుస్తుంది. అంతేకాని మైక్‌లో స్పీకర్‌లో పాటలు ఆటో ప్లే లో పెడితే ఇలాగే చిరాకు వస్తుంది. మీకు తెలుసా మన చెవులు చిన్న శబ్దాలను విని ప్రాసెస్ చేసే శక్తి పవర్‌ని కోల్పోతున్నాయి. పూర్వం చీమ చిటుక్కుమన్నా వినపడేది అనేవాళ్ళు. మరి ఇప్పుడు నో ఛాన్స్. పెద్దగా పిలవాలి, చెప్పాలి. లెక్కకు మించిన శబ్దాలు గందరగోళాన్ని కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యూచర్ మీది. సో సేవ్ ది హెల్త్ అఫ్ ఎర్త్,నేచర్ అండ్ యూవర్స్.

ఐ ఫర్గాట్ టు టెల్, రేపు బిర్లా ప్లానిటోరియంలో నాయిస్ పొల్యూషన్ మీద ప్రెజెంటేషన్ అండ్ ఇంటరెస్టింగ్ టాక్ ఉంది, గెట్ రెడీ వెళ్దాము.”

“ఓకే మామా!” అన్నారు పిల్లలు ఉత్సాహంగా.

ఆలోచించండి! మన పండగలు, పార్టీల ఆనందానికి పర్యావరణం, మన ఆరోగ్యం పాడు కావటం అవసరమా? నిశ్శబ్దంలోని అందాన్ని చూడలేమా? వినలేమా? ఓల్డెన్ డేస్‌లోలా నాయిస్లెస్స్ ఫెస్టివల్స్ వీలు కాదా? అవుతుంది. మనసుంటే మార్గం దొరుకుతుంది పర్యావరణ రక్షణకి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here