డాక్టర్ అన్నా బి.యస్.యస్.-18

0
10

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[అన్నా, శ్యామ్ తమ హాస్పటల్లో కాఫీ స్టాల్‌కి వెళ్ళి మాట్లాడుకుంటుంటారు. శ్యామ్‍ని తన శిష్యుడిగా భావించి అభిమానిస్తాడు అన్నా. పార్వతి వాళ్ళు వెళ్ళిపోయారా అని శ్యామ అడిగితే, అవునంటాడు. ఆ టైమ్‍లో తాను ఆపరేషన్ థియేటర్‍లో ఉన్నానని అంటాడు. పోనీ తరువాత అయినా ఫోన్ చేసి మాట్లాడవచ్చుగా అని శ్యామ అంటే, వద్దంటాడు అన్నా. అందుకు కారణం కూడా చెబుతాడు. కాలచక్రం తిరుగుతూంటుంది. ఒక రోజు అన్నా – తాను భారతదేశం వెళ్ళిపోయి అక్కడ పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రి కట్టాలని అనుకుంటున్నానని చెబుతూ, తన వచ్చి ఉండగలవా అని శ్యామ్‍ని అడుగుతాడు. శ్యామ్ సంతోషంగా ఒప్పుకుంటాడు. తన కుటుంబ వివరాలు అన్నాకి చెప్తాడు. తన మేనమామని సంప్రదించి గుంటూరు సమీపంలో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ నిర్మాణనికి స్థలం కొనిపిస్తాడు. శ్యామ్, అన్నా ఇండియా వచ్చి స్థలం చూసుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోతారు. తాము త్వరలో ఇండియా వచ్చేయబోతున్నట్లు ధర్మతేజ, మాధవిలు నారాయణమూర్తికి ఫోన్‍లో చెప్తారు. వీలైనంత త్వరగా అన్నా, పార్వతిల వివాహం జరిపించాలని అంటారు. నారాయణమూర్తి దంపతులు అంగీకరిస్తారు. ఒకరోజు కారు ప్రమాదానికి గురై మాధవి మరణిస్తుంది. ధర్మతేజ, అన్నా క్రుంగిపోయి తాగుతూ ఇంటికే పరిమితమయిపోతారు. శ్యామ్ వచ్చి ఇరువురికీ నచ్చచెప్తాడు. తాను చేసిన తప్పు అన్నాకు శ్యామ్ మాటల వల్ల అర్థం అవుతుంది. కానీ ధర్మతేజ మాత్రం మామూలు మనిషి కాలేకపోతాడు. ఒకరోజు ధర్మతేజ సెల్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి.]

[dropcap]“నా[/dropcap]రాయణా!.. మాధవి చనిపోయిందిరా!..” బోరున ఏడ్చాడు.

“ఆ..” ఆశ్చర్యపోయాడు.. నారాయణమూర్తి. సెల్ కట్ చేశాడు.

నాల్గవరోజు నారాయణ అమెరికాకు వచ్చి ధర్మతేజ.. అన్నాలను కలిశాడు. జరిగిన విషయాన్ని విని ఎంతగానో బాధపడ్డాడు.. సంబాళించుకొని.. ధర్మతేజా.. అన్నాలకు.. మంచిమాటలు చెప్పి వారి మనస్సుకు వూరట కలిగించాడు. బయలుదేరి.. వెళ్లబోయేముందు.. ఇరువురికి జాగ్రత్తలు చెప్పి.. త్వరలో భారత్‌కు రావలసిందని కోరి నారాయణమూర్తి వెళ్లిపోయాడు.

ఎవరు ఎన్ని చెప్పినా.. అన్నా ఎంతో ప్రీతిగా చూచుకొంటున్నా.. మాధవిగారి జ్ఞాపకాలనుండి దూరంగా వుండేటందుకు ధర్మతేజ.. త్రాగుడుకు బానిసైపోయాడు.

అతని ఆరోగ్యం దినదినానికి సన్నగిల్లింది.. అన్నా.. శ్యామ్.. లక్ష్మీ.. ఎంతో అభిమానంగా చూచుకొంటున్నా.. మనోవేదనకు మందు లేదన్న సామెత ధర్మతేజ విషయంలో నిజం అయింది. సమయం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం.. అంతవరకూ ధర్మతేజ గదిలో వుండిన శ్యామ్ తన ఇంటికి వెళ్లిపోయాడు.

ధర్మతేజ మెల్లగా కళ్లు తెరిచాడు.

“అన్నా!..

“ఏం.. నాన్నా!..”

“నన్ను మీ అమ్మ పిలుస్తూ వుంది.. నేను వెళ్లిపోవాలి!.. నీవు శ్యామ్.. లక్ష్మి.. మన భారతదేశానికి వెళ్లిపొండి.. నీవు నిర్మించదలచిన హాస్పిటల్.. మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని చేయించు.. ఇన్ని సంవత్సరాల మన స్వాతంత్ర్య దేశంలో.. ఐక్యత లేదు.. కక్షలు.. కార్పణ్యాలు.. పగలు.. ప్రతీకారాలు.. చంపుకోవడం.. నరుక్కోవడం.. కాల్చుకోవడం.. స్త్రీ అంటే అలుసు.. కట్నాల వేధింపు.. ఆడవారంటే చిన్నచూపు.. ఒంటరిగా కనిపించిన వనితలను చెరచడం.. చంపడం.. పేరుకు నవ విజ్ఞాన సమసమాజం.. చర్యలు అడవి జంతువుల చర్యలకన్నా హీనం.. కానీ ఈ తీరును మార్చాలి మీ తరంలో.. అసలు సిసలైన జాతి సమైక్యతావాదులతో.. ‘భారత్ సేవక్ సమాజ్’ను తయారు చెయ్యి.. నేరానికి.. శిక్ష కఠినంగా వుండాలి.. సమాజం పట్ల అభిమానం.. నేరం.. తప్పు.. అంటే భయం.. జనం మనస్తత్వాల్లో కలగాలి. అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగారిని.. దేశ ప్రధానిగారిని కలువు.. భారతదేశ సౌభాగ్యం కోసం బి.యస్.యస్. ఆశయాలను వ్రాశాను. అందరం దేశానికి వెళ్లి స్థిరపడి.. మన నేతలను కలిసి నా బి.యస్.యస్. రూపకల్పనను వారికి చూపించి వారి భావాలలో మార్పును తేవాలనుకొన్నాను. కాని నాకు ఆ మహత్తర కార్యాన్ని చేసే యోగం లేదు. అది నీ వంతు..” దిండు క్రిందవున్న డైరీని తీసి అన్నా చేతికి ఇచ్చాడు.. చిరునవ్వుతో అన్నా ముఖంలోకి చూచాడు.

అన్నా ఆశ్యర్యంతో తండ్రి ముఖంలోకి కన్నీటితో విచారంగా చూచాడు.

ధర్మతేజ.. కళ్ళు మూతపడలేదు. వారి పెదవులపై చిరునవ్వు..

అన్నా కళ్లముందు మాధవి.. అతని తల్లి నవ్వుతూ నిలబడింది. ధర్మతేజ ఆమెను సమీపించాడు. మాధవి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రీతిగా నవ్వింది. ఇరువురి ముఖాల్లో.. ఆనందం..

ఆ దృశ్యం.. అన్నా కళ్లముందు నుండి చెదిరిపోయింది. తొట్రుపాటుతో తండ్రి శరీరాన్ని తాకాడు. చల్లగా వుంది.

అన్నాడు విషయం అర్థమయింది. ఏడుస్తూ శ్యామ్‍కు  ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు..

“అవును.. నాన్న అమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు.. వారిరువురూ ఆనందంగా కలసిపోయారు. నన్ను చూపులతో దీవించారు.. అవును.. నన్ను దీవించారు.. మా అమ్మా నాన్నా.. మా అమ్మా నాన్నలు..”

కన్నీటితో తండ్రి ముఖంలోకి చూచాడు.

తండ్రి.. తెరచివున్న కళ్లను తన చేతితో మూశాడు.

“లక్ష్మీ!..” పిలిచాడు అన్నా..

లక్ష్మి.. వచ్చి ఏడుస్తూ అన్నా కళ్లల్లోకి చూచింది.

“నాన్నగారు అమ్మదగ్గరకు వెళ్లిపోయారు లక్ష్మీ!..” అంతవరకు ఎంతో గంభీరంగా ఉన్న అన్నా.. భోరున ఏడుస్తూ ధర్మతేజ పాదాలపై వాలిపోయాడు.

లక్ష్మి.. “పెద్దయ్యా!.. మీరూ వెళ్లిపోయారా!..” అంటూ నేలకూలి ఏడవసాగింది.

శ్యామ్ వచ్చాడు. రెండు గంటల క్రితం తనతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తన కళ్లముందు శవంగా మారిపోయాడు. ఆగని కన్నీరు.. కొన్ని క్షణాలు.. తమాయించుకొని అన్నా భుజంపై చేయి వేసి కన్నీళ్లను తుడిచాడు. ఇరువురూ కలసి కొంతసేపు ఏడ్చారు. శ్యామ్ చెప్పగా హాస్పిటల్ మిత్రులు వచ్చారు. విచారపడ్డారు. అన్నాను ఓదార్చారు.

ధర్మతేజ.. అంతిమ యాత్ర సాగిపోయింది. దహన క్రియాదులు ముగిశాయి. అస్థికలను గంగలో కలపాలని భద్రపరచుకొన్నాడు అన్నా..

శ్యామ్.. ఉద్యోగానికి సంబంధించినవి.. స్వదేశానికి చేరడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లనూ.. తనకూ అన్నాకూ లక్ష్మికి సిద్ధం చేశాడు.

ధర్మతేజ గతించిన నెలరోజుల తర్వాత వారు స్వదేశానికి బయలుదేరారు.

***

శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి అన్నా.. శ్యామ్.. లక్ష్మిలు ఎక్కిన విమానం టేకాఫ్ అయింది. వారి ప్రయాణం శాన్ ఫ్రాన్సిస్కో టు దుబాయ్ టు హైదరాబాద్ టు కాశి..

లక్ష్మి హిజ్రా.. పది సంవత్సరాల క్రిందట ధర్మతేజ.. మాధవీలు భారత్ వచ్చి హైదరాబాద్లో వున్న అన్నా బంధువులు ఇంట్లో వుండగా వారి ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి వీరికి పరిచయం అయింది. ఆమెరికాకు తిరిగి వెళ్లేముందు లక్ష్మిని మాతో నీవు వస్తావా అని అడిగింది మాధవి. ఎవరూ లేని ఆ లక్ష్మి ఆనందంగా సరే అంది. వారితో కలసి వచ్చింది. నాటి నుంచి ఆ ఇంటి మనిషిగానే వారితోనే వుండిపోయింది.. అన్నా అంటే లక్ష్మికి పంచప్రాణాలు..

చనిపోయే గంట ముందు ధర్మతేజ తనకు ఇచ్చిన డైరీని చేతికి తీసుకొన్నాడు అన్నా.. ప్రక్కన కూర్చొని యున్న శ్యామ్..

“అన్నా!.. ఏమిటిది?..”

“నాన్నగారి ఆశయం..”

“ప్రస్తుత భారతదేశ ప్రజాపాలకులు పాటించే విధానాలలోని.. తప్పు ఒప్పులను సవరించి.. భారత్ ప్రపంచానికే తలమానికం అయ్యేలా చేయాలన్నది నాన్నగారి కోరిక. ఈ డైరీని నా చేతికి యిచ్చి.. ‘చదువు.. పాటించు.. పాలించు..’ అని చెప్పి కన్ను మూశారు. నేను చదివి నీకు ఇస్తాను. నీవు చదువు..” అన్నాడు అన్నా.

“సరే అన్నా ..” చిరునవ్వుతో చెప్పాడు శ్యామ్.

అన్నా డైరీని తెరచి చదవసాగాడు.

నేను.. నా దేశం.. బి.యస్.యస్. (భారత్ సేవా సమాజ్)

గత చరిత్ర..

సృష్టి ఆదినుంచీ భారతావని హైందవ సనాతన అద్వైత ధర్మాలకు నిలయం.

నిర్దేశకులు మహా తపోబల సంపన్నులు.. దైవ సాక్షాత్కారాన్ని పొంది మహా శక్తులు సంపాదించుకొని జాతి ఔన్నత్యానికి నాలుగు వేదాలను.. పదునెనిమిది పురాణాలను.. నూట ఎనిమిది ఉపనిషత్తులను.. ముప్పది ధర్మశాస్త్రాలను.. రెండు ఇతిహాసాలను వ్రాసి.. భావితరాలు మానవతా వాదంతో.. మంచి మానవత్వంతో వర్థిల్లాలని, తమ ప్రజ్ఞాపాటవాలను సశాస్త్ర రూపంలో తీర్చిదిద్దారు.

ఆదికాలంలో యావత్ భారతదేశం పది భాగాలుగా (రాష్ట్రాలుగా) అఖండ హైందవ భారత దేశంగా చరిత్ర కెక్కింది. ఆ పది రాష్ట్రాలు.. గాంధార దేశము.. త్రివిష్టపము.. సింధూ దేశము.. నేపాళము.. సౌరాష్ట్రము.. ఆర్యావర్తము.. వంగదేశము.. బ్రహ్మదేశము.. కళింగదేశము.. ఆంధ్రదేశము.

అప్పటి మన దేశ వైశాల్యం సుమారు డెబ్బది లక్షల నలుబదివేల ఏడువందల చదరపు కిలోమీటర్లు.

వేదకాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన రూపం క్రింద పున్నది. బృహస్పతి ఆగమ శాస్త్రంలోనూ.. విష్ణుపురాణంలోనూ.. కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనల్లోను మనదేశపు ఎల్లలు గురించి స్పష్టంగా వర్ణించబడింది. గ్రహించండి.

పై పది భాగాల్లోను హైందవరాజులు పాలన తరతరాలుగా సాగింది. 1190 సంవత్సరంలో మహ్మద్ ఘోరి తన పదునెనిమిదవ ప్రయత్నంతో మన దేశంలోని గాంధార ప్రాంతంలో ప్రవేశించి ఆక్రమించుకోవడం జరిగింది. వారి పాలన ప్రారంభం అయింది. దానికి పేరు ‘బానిస రాజవంశం’.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1 మహ్మాద్ ఘోరీ 1193
2 కుతుబుద్దీన్ ఐబక్ 1206
3 ఆరామ్ షా 1210
4 ఇల్‌టుట్‌మిష్ 1211
5 రుక్నుద్దీన్ ఫిరోజ్ 1236
6 రజియా సుల్తాన్ 1236
7 ముయిజుద్దీన్ బహ్రామ్ 1240
8 అల్లావుద్దీన్ మసూద్ 1240
9 నసీరుద్దీన్ మొహమ్మూద్ 1266
10 కైఖుస్రో 1286
11 ముయిజుద్దీన్ కైకుబాద్ 1287
12 షాయుద్దీన్ కామర్స్ 1290

బానిసవంశ రాజుల పాలనా కాలం సుమారు 97 సంవత్సరాలు.

బానిసరాజ వంశపాలన ఖిల్జీ రాజవంశం పాలనలో అంతం అయింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ 1290
2. అల్లావుద్దీన్ ఖిల్లీ 1296
3. షహబుద్దీన్ ఒమర్ 1316
4. కుతుబుద్దీన్ ముబారక్ షా 1316
5. నజిరుద్దీన్ ఖుస్రోం షా 1320

ఖిల్జీ రాజవంశ పాలనా కాలం సుమారు 30 సంవత్సరాలు సాగింది.

ఖల్జీ రాజవంశ పాలన తుగ్లక్ రాజవంశపాలన ప్రారంభంతో ముగిసిపోయింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. గయాసుద్దీన్ తుగ్లక్ 1320
2. మహ్మద్ బీన్ తుగ్లక్ 1325
3. అబూబకర్ షా 1389
4. మహ్మద్ తుగ్లక్ (రెండవ) 1389
5. సికిందర్ షా దుస్రా 1394
6. నసిరుద్దీన్ షా దుస్రా 1394
7. నస్రత్ షా 1395
8. నసిరుద్దీన్ మహ్మద్ షా 1399
9. డోలత్ షా 1413

తుగ్లక్ రాజవంశజుల పాలనాకాలం సుమారు 94 సంవత్సరాలు.

తుగ్లక్ రాజవంశ పాలన సయ్యద్ రాజవంశ పాలన ప్రారంభంతో ముగిసింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. ఖిజ్ర్ ఖాన్ 1414
2. ముయిజుద్దీన్ ముబార్ షా(రెండవ) 1421
3. మహ్మద్ షా (నాల్గవ) 1434
4. అల్లావుద్దీన్ అలంషా 1445 -1451

సయ్యద్ రాజవంశ రాజుల పాలనాకాలం సుమారు 37 సంవత్సరాలు.

సయ్యద్ రాజవంశపాలన లోఢి రాజవంశ పాలన ప్రారంభంతో అంతం అయింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. బహ్‌లల్ లోడి 1451
2. సికందర్ లోడి 1489
3. ఇబ్రహీం లోడి 1517-1526

ఆ లోడి రాజవంశ పాలనా కాలం సుమారు 75 సంవత్సరములు.

ఆ లోడి రాజవంశ పాలన మొఘల్ రాజవంశ ప్రారంభంతో ముగిసిపోయింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. బాబర్ 1526
2. హుమాయూన్ 1530-1539

మొఘల్ రాజవంశ పాలనాకాలం 13 సంవత్సరాలు..

మొఘల్ రాజవంశ పాలన సూరి వంశరాజుల పాలనా ప్రారంభంతో అంతం అయింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. షేర్షా సూరి 1539
2. ఇస్లామ్ షా సూరి 1545
3. మహ్మద్ షా సూరి 1552
4. ఇబ్రహీంషా సూరి 1553
5. ఫిరోజ్ షా సూరి 1554
6. ముబారక్ ఖాన్ సూరి 1554
7. అలెగ్జాండర్ నూరి 1555

సూరి రాజవంశ పాలనా కాలం 16 సంవత్సరాలు.

సూరి రాజవంశపాలన మొఘల్ రాజవంశ పాలన ప్రారంభంతో ముగిసింది.

క్రమ సంఖ్య పాలకుడు పాలన ప్రారంభించిన సంవత్సరం
1. హుమయూన్ 1555
2. జలాలుద్దీన్ అక్బర్ 1556
3. జహంగీర్ సలీమ్ 1605
4. షాజహాన్ 1622
5. ఔరంగజేబు 1650
6. షా అలం (మొదటి) 1707
7. ఫరూబ్సియార్ 1713
8. బహదూర్ షా 1718
9. రఫీ ఉద్ దరాజత్ 1719
10. రఫీ అల్ దిన్ ముహమ్మద్ 1719
11. నెకూ ఫియార్ 1719
12. మహ్మద్ షా 1719
13. అహ్మద్ షా 1748
14. అలంగీర్ 1754
15. షా ఆలమ్ 1759
16. అక్బర్ షా 1806
17. బహదూర్ షా జాఫర్ 1837

మొఘల్ రాజవంశజుల పాలనా కాలం.. 315 సంవత్సరాలు.

1497వ సంవత్సరంలో వాస్కోడిగామా (ఫోర్చుగీసు) భారతదేశానికి యూరప్ ఖండాలనుంచి వచ్చేదానికి సముద్రమార్గం కనుగొన్నాడు. తిరిగి తన దేశం వెళ్లిపోయి తన విజయాన్ని.. తనను కాలికట్ మహారాజు సత్కరించిన విధానాన్ని అక్కడివారికి చెప్పి ఎక్కువమంది అనుచరులతో మరలా 1502వ సంవత్సరంలో వచ్చాడు. మన దేశాన్ని అంతా తిరిగి చూచారు.

వీరు కనిపెట్టిన మార్గంలో బ్రిటిషర్స్ కూడా వచ్చారు. దేశాన్నంతా తిరిగి చూచి.. సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీని భారత్‍లో రాబర్టు క్లయివ్ అధ్వర్యంలో 1600 డిశంబరు 31న స్థాపించారు. అప్పటికి జలాలుద్దీన్ అక్బర్ (ఢిల్లీ) హస్తినాపురం చక్రవర్తి..

వ్యాపార కాంక్షను వదలి.. రాజ్య కాంక్షతో భారత రాజుల మధ్య యుద్ధాలు కల్పించారు. సైన్యాధిపత్యాన్ని తమ చేతుల్లోకి తీసుకొని.. రాజులను కీలుబొమ్మలను చేసి ఆడించారు.. చంపించారు.. చంపారు.. రాచరికాన్ని తుద ముట్టించారు. రాజవారసులు వారికి సామంతులైనారు. యావత్ భారతావని పరిపాలనా వ్యవస్థను వారు హస్తగతం చేసుకొన్నారు. దేశ సంపదను దోచుకొన్నారు. ఆ క్రమంలో బ్రిటిష్ రాజ్ వైస్రాయిలు 20 పైమంది మన దేశాన్ని పాలించారు. వారు..

క్రమ సంఖ్య వైస్రాయ్ పాలన ప్రారంభించిన సంవత్సరం
1. లార్డ్ కానింగ్ 1858
2. లార్డ్ జక్యుబ్రూస్ ఎల్లిన్ 1862
3. లార్డ్ జోహౌ లారెన్స్ 1864
4. లార్డ్ రిచర్డ్ మాయో 1869
5. లార్డ్  నార్త్‌బ్రూక్ 1873
6. లార్డ్ లిట్టన్ 1876
7. లార్జ్ జార్జి రిప్పన్ 1880
8. లార్డ్ డఫేరిన్ 1884
9. హన్నీలాన్స్‌డౌన్ 1888
10. విక్టర్ బ్రూస్ ఎల్గిన్ 1894
11. లార్డ్ కర్జన్ 1899
12. లార్డ్ మింటో 1905
13. లార్డ్ హార్డింగే 1910
14. లార్డ్ ఛేమ్స్‌ఫర్ 1916
15. లార్డ్ రీడింగ్ 1921
16. లార్డ్ ఇర్విన్ 1926
17. లార్డ్ ఫ్రీమాన్ విల్లింగ్టన్ 1931
18. లార్డ్ లిన్‌లిత్‌గో 1936
19. లార్డ్ వేవెల్ 1943
20. లార్డ్ మౌంట్‍బాటన్ 1947

భారతదేశాన్ని ఆక్రమించి పాలించిన ఇతర దేశీయుల కాలం 1193-1947.. 754 సంవత్సరాలు. ఆంగ్లేయుల ఆధిపత్యం (1600-1947) 347 సంవత్సరాలు, (1858-1600) 258 సంవత్సరాల కాలంలో వారు రాజులను రాజ్యాలను ఒక వైపు చేరి పరస్పర యుద్ధాలను కల్పించి నాశనం చేశారు. అరాచకంగా సంపదనంతా కొల్లగొట్టి.. ఓడల్లో లండన్‍కు తరలించారు. ఎంతో విలువైన కోహినూర్ వజ్రాన్ని దోచుకున్నారు. దేశ సౌభాగ్యం ‘ఏనుగు తిన్న వెలగపండులా’ మారిపోయింది.

దేశ స్వాతంత్ర్యం కోసం.. ఎందరో మహనీయులు.. ఎన్నెన్నో విధాలా ఆంగ్లేయులకు ఎదురుగా నిలబడి పోరాడారు. వారిలో ప్రముఖులు..

క్రమ సంఖ్య వీరుడు/యోధురాలు కాలం సంవత్సరాలు చేసిన సేవ
1. రాణి రుద్రమదేవి 1262-1289 27 ముస్లిం రాజవంశస్తులతో ప్రతిఘటన
2. మహారాణి పద్మిని 1303-1400 97 ముస్లిమ్, తుగ్లక్ వంశస్థులతో ప్రతిఘటన
3. రాణా ప్రతాప్ సింగ్ 1540-1597 56 ముస్లిమ్, మొఘల్ రాజులతో ప్రతిఘటన
4. వీర సావర్కార్ 1883-1966 83 దేశంపట్ల, ధర్మంపట్ల భక్తిని పెంచారు.
5. కట్టా బ్రహ్మన వీరపాండ్య 1760-1799 38 ఆంగ్లేయులతో ప్రతిఘటన ప్రతిఘటన, ఉరితీయబడ్డారు.
6. ఛత్రపతి శివాజి 1630-1680 50 మొఘల్, ముస్లిమ్లతో ప్రతిఘటన
7. మంగళ్ పాండే 1827-1857 29 స్వరాజ్యకాంక్షను రగిల్చినవారు.
8. లాలా లజపతిరాయ్ 1865-1928 62 స్వాతంత్ర్యయోధుడుగా జైలుకు వెళ్లారు.
9. అజాద్ 1906-1931 24 స్వాతంత్ర్యయోధునిగా ఉరితీయపడ్డాడు
10. అల్లూరి సీతారామరాజు 1898-1924 26 ఆంగ్లేయులతో ప్రతిఘటన, కాల్చిచంపారు
11. భగత్ సింగ్ 1907-1931 23 స్వాతంత్య్ర యోధునిగా ఉరితీయపడ్డాడు
12. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897-1945 48 సైన్యాన్ని తయారు చేశారు.

పై మహనీయుల జీవితకాలన్ని బట్టి చిన్నతనం నుండి వారు ఎటువంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి అంతటి దేశభక్తి కలిగి దేశ స్వాతంత్ర్యానికి పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారంటే.. ఇలాంటి మహోన్నతుల చరిత్ర ఏ దేశ పుటల్లోనూ కానరాదు. వారంత అమరజీవులు. మనందరికీ సదా పూజనీయులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here