డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి జయంత్యుత్సవ సభ

0
9

విజయనగరంలో స్థానిక గురజాడ జిల్లా స్మారక కేంద్ర గ్రంథాలయంలో ‘సహజ సాంస్కృతిక సంస్థ’ నిర్వహణలో స్వర్గీయ “డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారి జయంత్యుత్సవం” సాహిత్యసభ జరిగింది.

ఆత్మీయ అతిథిగా విచ్చేసిన అధ్యాపకులు మోదుగుల రవికృష్ణగారు మాట్లాడుతూ…  నరసింహమూర్తిగారితో ఉన్న అనుబంధాన్ని, అవినాభావసంబంధాన్ని తెలియజేశారు. తండ్రిని ‘తండ్రిగాడిగా’ పిలవడంలో ఉన్న మాండలిక స్పృహను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తిరుమల రామచంద్రగారి ‘ హంపి నుండి హారప్పాదాకా ‘ పుస్తకరచనతో ఉన్న పోలికను ప్రస్తావించారు.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. వృద్ధుల కళ్యాణరామారావుగారు మాట్లాడుతూ గతంలో సభానిర్వహణలో మాట్లాడాల్సిన వక్త కారణంగా తలెత్తిన లోపాల్ని సూక్ష్మ ప్రాయంగా చెప్పారు. ప్రధానవక్త డా.లక్ష్మణచక్రవర్తిగారు 15 ఏళ్ళ తన పరిచయాన్ని నరసింహమూర్తిగారితో నెమరువేసుకున్నారు. భారతీయ నాటకాలతో తులనాత్మక దృష్టిని, ప్రపంచ తులనాత్మక సాహిత్యాన్ని, భాష- కావ్యాశాస్త్రం – నాటకాలు వంటి వాటిని నరసింహమూర్తిగారు స్పృశించిన తీరును వ్యక్తీకరించారు. తిరుమల రామచంద్రరావుగారు తనని పరిచయం చేసిన తీరుని, విమర్శనాత్మక దృష్టి, కళాతత్వ తీరు, తెలుగు వచన శైలి, పాశ్చాత్య ఆలోచనాతత్వం, తన ధారణా శక్తిని, శకలాల ధారలు, నరసింహమూర్తిగారి జ్ఞానంతో ముడిపెట్టి చెప్పారు. “తెలుగువచన శైలి” అన్న వ్యాకరణ దృక్పధాన్ని వివరించారు. రాళ్లపల్లి అనంత కృష్ణమూర్తి శైలిని ప్రత్యేకంగా ఉదాహరించారు. చేకూరి రామారావుగారితో ఆయన పరిచయం విశ్లేషించారు. అనేకమంది రచయితల వచనశైలిని ఒక ప్రణాళికతో వివరించే తీరును చెప్పారు. ఆలంకారికులు,వాళ్ళ రచనా శైలి వివరించారు. శ్రీపాద, కొడవటిగంటి, విశ్వనాథ సత్యనారాయణ వంటి రచయితల్ని, భాషా తత్వవేత్తల్ని,విమర్శకుల్ని విశ్లేషించారు. వ్యక్తి, అభివ్యక్తి, మంచితనాల శైలి వంటివి వ్యక్తీకరించారు.కవిత్వ పదాల నిర్మాణాన్ని, వక్తృత్వశైలి, రాత శైలి,మాండలిక శైలిలను వివరించారు. వాడుకలో లేని  జనాంతకశైలి, వాకోవాక్యశైలి మున్నగువాటిని మనుగడలో లేనివాటిని విపులీకరించారు. లక్షణం, లక్ష్యాన్ని విశదీకరించారు. కుల మాండలికాన్ని, అలాంటి మాటలని, వెంటనే వాడే జనాంతక శైలిని చెప్పారు. జనం గురించి చెప్పే, మానసిక, ఆధ్యాత్మిక శైలిల ప్రస్తావన విశ్లేషించారు. ఆధునిక వచన శైలి నిర్మాతలు ఆరుగురినిగా చెప్పుకొచ్చారు. పానుగంటి, చలం,విశ్వనాథల, కొడవటిగంటి, బుచ్చిబాబు, శ్రీశ్రీలను ప్రస్తావించారు. ఆధునికులైన వి.చంద్రశేఖరరావు తదితరులను విడమర్చి చెప్పారు. శైలి అధ్యయన రీతులు చెప్పారు. వ్యాకరణ,ఆధునిక భాషా శాస్త్రం, వాక్యనిర్మాణం, వ్యవస్థ , సంపాదకీయ శైలి వివరించారు. పోస్టమొడర్నిజం (ఆధునికోత్తరవాదం), ఆధునికానంతర శైలి వాటిని వివరించారు.గురజాడ, నమిని,శ్రీశ్రీ తదితరుల వాక్య నిర్మాణాన్ని విషయము, వివేచనలతో, రచనా శైలి నిర్మాణమును వివరించారు.

సభకి ఎన్. కె.బాబు అధ్యక్షత వహించి నిర్వహించారు. అంతకు ముందు మానాపురం రాజా చంద్రశేఖర్ సభకి స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here