డా. వేదగిరి రాంబాబుగారి సంస్మరణ సభ

0
9

[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 23.08.2018 నాడు స్థానిక బి.వి.కె.కళాశాలలో ప్రముఖ కథకులు, సాహితీవేత్త స్వర్గీయ డా. వేదగిరి రాంబాబుగారి సంస్మరణ సభ జరిగింది.

సభకు విశాఖ సాహితి సీనియర్ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఎల్.ఆర్.స్వామి గారు అధ్యక్షత వహించారు. సభా ప్రారంభంలో ఆహుతులు ఒక నిమిషంపాటు మౌనం వహించి దివంగత ఆత్మకి శ్రధ్ధాంజలి ఘటించారు.

సభాధ్యక్షులు శ్రీ ఎల్.ఆర్.స్వామి గారు స్వర్గీయ వేదగిరి రాంబాబుగారితో తమకు గల పరిచయాన్ని తెలియజేస్తూ, చిన్నవయసులోనే కాలంచేయడం తెలుగు సాహితీ లోకానికి, ముఖ్యంగా తెలుగు కథానికా ప్రపంచానికి తీరని లోటు అని చేప్పారు. తెలుగు కథానికకి, తెలుగు భాషకి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని పేర్కొన్నారు.

శ్రీ మంగు శివరామప్రసాద్, విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం, శ్రీ చెళ్ళపిళ్ళ రామారావు, శ్రీ ఎస్. హనుమంతరావు, శ్రీ నలబోతు రామారావు, అరసం కార్యదర్శి శ్రీ విరియాల గౌతమ్, ‘విశాఖ సంస్కృతి’  సంపాదకులు శ్రీ శిరేల సన్యాసిరావు ప్రభృతులు స్వర్గీయ వేదగిరి రాంబాబుగారి అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ, వారు తెలుగు కథకు, తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు.

శ్రీమతి చిట్టిళ్ళ నిర్మల గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here