దుఃఖ నివారణకు వేదాంత మార్గం

0
11

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దుఃఖ నివారణకు వేదాంత మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం
(భగవద్గీత 2వ అధ్యాయం, 8వ శ్లోకం)

[dropcap]నా[/dropcap] సమస్త ఇంద్రియాలను ఎండగడుతూ, నా హృదయంలో ఎగసిపడుతున్న వేదనాగ్నిని తరిమికొట్టడానికి నేను ఎలాంటి మార్గాలను కనుగొనలేకపొతున్నాను. నేను నా పరాక్రమంతో ఈ భరత భూమిపై సుసంపన్నమైన మరియు సాటిలేని రాజ్యాన్ని గెలుచుకున్నా, లేదా దివ్యమైన దేవతల వలె సార్వభౌమాధికారాన్ని పొందినా, నేను ఈ దుఃఖాన్ని పోగొట్టుకోలేను అన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది అని పై శ్లోకం భావం.

వేదన లేదా దుఖం యొక్క శక్తిని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఇటువంటి అనుభవాలు మనకు కూడా జీవితంలో తరచుగా ఎదురవుతూ వుంటాయి. మనం జీవిత ప్రయాణంలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని మనం కనుగొనే పరిస్థితి ఇది. మనకు ఆనందం కావాలి, కానీ మనం దుఃఖాన్ని అనుభవిస్తాము; మనం  జ్ఞానాన్ని కోరుకుంటాము కానీ అజ్ఞానం యొక్క మేఘాలు మనల్ని కప్పేస్తాయి.

కోరికలు తీరకుండడమే దుఃఖానికి కారణం. తనకు తగని, అలవిగాని కోరికలు పెట్టుకొన్నపుడు అవి సాధించలేరు. ఆ శ్రమ వైఫల్యంలో దుఃఖమే మిగులుతుంది. కోపం, భయం, అభద్రత భావం, అసూయ, ఒత్తిడి, ఆందోళన, కామం ఇలాంటి అవలక్షణాలు వున్నపుడు మనసుకి ప్రశాంతత లభించదు. దీనినే అజ్ఞానం అని కూడా అంటారు. ఉన్నదానితో అసంతృప్తి, లేనిదాని కోసం ఆరాటం ఇదే జీవిత సత్యం. కోరికలు కూడా తోడైతే ఇక ఆ స్థితి వర్ణనాతీతం. ‘అనిత్యం అసుఖం లోకం ఇమాం ప్రాప్య భజస్వమాం’ అంటే కష్టాలు, అశాశ్వతత్వం లతో ప్రపంచం ఏర్పడింది అని భగవద్గీతలో గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. దుఖం అంటే భౌతిక, మానసికమైనది కాదు. అసాధారణమైన అస్తిత్వం యొక్క అసంతృప్తి విధానమే దుఖం. గీతలో చెప్పిన పలు  సందేశాలకు అర్థం దుఖాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం, ఈ అసంతృప్తుల నుంచి బయట పడటం మాత్రమే. దుఃఖం అనేది జీవితంలో మూలతత్వమే. అశాశ్వతాలు, అసంతృప్తి కారకాలను పట్టుకొని వ్రేలాడటమే దుఃఖం. జీవితాన్నీ, లోకాన్నీ నిజస్వరూపంలో అర్థం చేసుకోవటానికి తోడ్పదేదే దుఃఖం. అశాశ్వత  స్వభావం వలన, మనం అనుభవించేది అంతా మూల దుఃఖ భాగమే, అసంతృప్తి నిచ్చేదే. సంతోషంగా ఉన్నప్పటికీ దుఃఖం, అసంతృప్తి వెంటనంటే ఉంటాయి అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. దుఃఖానికి వేదాంత నివృత్తి మార్గం మంచి పరిష్కారం చెబుతోంది –దుఃఖమనేది మన దినదిన సమస్య కాదు. అనిత్యాలైన వాటికోసం ప్రాకులాడి చేతులారా దుఃఖాన్ని కొనితెచ్చుకొంటున్నాం. వీటికంటే శాశ్వతమైన సత్యాన్ని మనం గ్రహించాలి. విశ్వ చైతన్యం మనకు ఎండమావిలా చుట్టూ కనిపిస్తుంది. అశాశ్వతాలను పట్టుకొని, శాశ్వతమైన దాన్ని అందుకోలేము. ప్రపంచాతీత స్థిర శాశ్వత సత్యాన్వేషణ జరపాలి. అనిత్యమైన భౌతిక కోరికల కోసం ప్రాకులాడుతూ సమయం వృథా చేసుకునే కంటే అశాశ్వతమైన పరమాత్మ ప్రసాదిత బ్రహ్మానంద ప్రాప్తి కోసం కృషి చేయాలి.

ఈ బాధలకు, దుఃఖాలకు మానవుడే కారణం కాని భగవంతుడు కాదు. ప్రతికూల భావనలు, దుర్గుణాలు కలిగి ఉంటూ ధార్మికంగా జీవించాలనే కోరిక దుష్ఫలితాన్నిస్తుంది. ఇది ఎంతగా హానికరమంటే ప్రజలు, ‘మనం ధార్మికంగా ఉండకపోయి ఉంటేనే బాగుండును’ అనే నిస్పృహలు లోనవుతున్నారు. మనం మానవీయ భావనలను కలిగి ఉంటూ ద్వేషాన్ని కాక ప్రేమను వ్యాపకం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here