ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 12

0
10

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

“సో మైడియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడనీయకుండా చేస్తున్న మూడు అంశాలు (మూడు సీక్రెట్స్) ఏమిటో అన్న విషయం మనం తెలుసుకుంటున్నాము.

మొదటి సీక్రెట్: సైకలాజికల్ రీజన్స్ అని తెలుసుకున్నాము.

ఇక రెండవ సీక్రెట్ ఏమిటీ అంటే: LSRW రీజన్.

ఈ LSRW రీజన్ ఏమిటో వివరంగా తెలుసుకుందాము.

ఇక్కడ ఈ LSRW అనే అక్షరాలు వరుసగా

Listening

Speaking

Reading

Writing

అనే పదాల్ని సూచిస్తాయి.

ఏ భాష అయినా సరే ఈ నాలుగు అంశాలు ప్రధాన పోషిస్తాయి ఆ భాషని మనం నేర్చుకోవటంలో.

ముందుగా మనం మాతృభాషని ఎలా నేర్చుకున్నామో ఒక సారి గుర్తు తెచ్చుకుందాము.

Listening:

అప్పుడే పుట్టిన పసిబిడ్డ ముందుగా మాట్లాడలేదు, చదవలేదు, వ్రాయలేదు. కానీ ఖచ్చితంగా వినగలుగుతుంది. ఆ చుట్టుపక్కల ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాష వింటూ పెరుగుతుంది కద.

నిజానికి ఈ వినటం అనేది, పాప తాను పుట్టకముందు నుంచే తల్లి గర్భంలో ఉండగానే జరుగుతుంది. అఫ్‌కోర్స్ ఇది మన పురాణాలలో ఉన్న విషయమే. తల్లి గర్భంలో ఉండగానే ప్రహ్లాదుడు విష్ణు నామము వింటూ ఉండటం వల్ల జన్మతః విష్ణు భక్తుడు అయ్యాడు.

అదే విధంగా అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలని నేర్చుకోగల్గటానికి కూడా ఇదే కారణం, అతను తల్లి గర్భంలో ఉండగానే శ్రీ కృష్ణుడు పద్మవ్యూహ రహస్యాన్ని చెబుతు ఉండగా విని తెలుసుకున్నాడు.

ఈ విషయాలు అన్నీ మనకు తెల్సు కద.

ఆ, ఏదో పురాణాలే కదా అని కొట్టి పారేయటానికి లేదండి. గర్భస్త శిశువుల గూర్చి జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నాయి.

తల్లి గర్భంలో ఉన్న శిశువు మూడవ నెల నుండే వినటం ప్రారంభిస్తుంది అని లేటెస్ట్ పరిశోధనలు ఋజువు పరుస్తున్నాయి.

కాబట్టి ఒక భాషకి సంబంధించి మన ప్రయాణం వినటంతో ప్రారంభం అవుతుంది అన్నది ఖచ్చితమైన నిజం.

Speaking

భాషకి సంబంధించిన మన రెండో అడుగు మాట్లాడటంతో ప్రారంభం అవుతుంది.

ఒక శిశువు జన్మించిన తరువాత, మొదట ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం మాట్లాడలేదు. ఈ కాలం అంతా చుట్టూ వినపడే మాటల్ని వింటూ, వాటిని తన మెదడులో నిక్షిప్తం చేసుకుంటూ పెరుగుతుంది.

ఇలా ఒక సంవత్సరం, సంవత్సరం గడిచాక, ఒక రోజు హటాత్తుగా “అమ్ మ్ మ్ …..మా” అనో లేదా ఇంకోటో ఏదో శబ్దం చేస్తుంది.

ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

మాట్లాడే ప్రయత్నం చేస్తున్న ఆ పాపని చూసి, తల్లితండ్రులు, చుట్టు ప్రక్కల వారు సంతోషపడతారు.

ఇంకా ఇంకా మాట్లాడమని ప్రొత్సహిస్తారు.

ఆ విధంగా మాట్లాడే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రయత్నంలో పాప తప్పులు మాట్లాడినా, ఉచ్చారణ (ప్రొనన్సియేషన్) దోషాలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. మాట్లాడమని ప్రోత్సహిస్తారు.

వారందరి ప్రోత్సాహం చూసి పాప ఇంకా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఒకటి రెండు సంవత్సరాలలో తప్పులు లేకుండా అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటుంది.

ఒకటి గమనించండి, పాప తనకు మూడు నాలుగు ఏండ్లు వయస్సు వచ్చేసరికి హాయిగా ఏ తప్పులు లేకుండా మాట్లాడగల్గుతోంది. కానీ ఇంకా పాపకి చదవటం కానీ, వ్రాయటం కానీ రాలేదు.

గ్రామర్ సూత్రాలు నేర్చుకోలేదు. సంధులు, సమాసాలు, అలంకార శాస్త్రం ఏదీ నేర్చుకోలేదు. అయినా సరే తప్పులు లేకుండా తన మాతృభాషలో మాట్లాడగలుగుతోంది.

చూశారుగా పాప ఇంకా స్కూలుకు వెళ్ళలేదు, చదవటం వ్రాయటం నేర్చుకోలేదు. కానీ హాయిగా తన మాతృభాషలో మాట్లాడేస్తోంది.

ఆ తరువాత ఎలాగు స్కూలుకు వెళుతుంది. అక్కడ చదవటం వ్రాయటం నేర్పిస్తారు. ఇక్కడ ఒక అంశం జాగ్రత్తగా గమనించండి. వ్రాయటం, చదవటం అన్న అంశాలకు మనం మాట్లాడటానికి సంబంధం లేదు.

చదవటం అన్నది ఒక ఇన్‍పుట్. చదవటం వల్ల మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది. కొత్త కొత్త విషయాలు తెల్సుకుంటాము. అంతే తప్పనిచ్చి, చదవటం వల్ల మనకు మాట్లాడే శక్తి ఏమీ రావటం లేదు.

అదే విధంగా, వ్రాయటం అన్నది ఒక అవుట్‍పుట్. అంటే మన మనసులోని భావాలని వ్రాత రూపంలో బయటకి వ్యక్తం చేయటానికి ఈ వ్రాయటం అన్నది ఉపయోగ పడుతోంది. అంతే తప్పనిచ్చి, వ్రాయటం వల్ల కూడా మనకు మాట్లాడే శక్తికి సంబంధించి కొత్తగా ఏమీ ఒనగూడటం లేదు.

మీకు ఇంకా బాగా అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే, ఒక ఉదాహరణ చెబుతాను.

మీరు నిరక్షరాస్యులను చూసే ఉంటారు. నిరక్షరాస్యులు అంటే ఎవరు, వ్రాయటం, చదవటం రాని వారు అని కదా అర్థం.

నిరక్షరాస్యులు వ్రాయలేరు, చదవలేరు. కానీ వారు వాళ్ళ మాతృభాషలో నిక్షేపంగా మాట్లాడగలరు కద.

మనం ఇది వరకే చెప్పుకున్నట్టు, నిరక్షరాస్యులు కూడా మొదట తమ మాతృభాషని వింటూ పెరిగారు, ఒకట్రెండు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి మాట్లాడటం నేర్చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారు బహుశా స్కూలుకు వెళ్ళలేకపోవటం వల్లనో ఏ కారణం చేతనో చదవటం, వ్రాయటం నేర్చుకోలేకపోయారు.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక భాషలో మనం హాయిగా మాట్లాడుతున్నామంటే వ్రాయటం, చదవటం కన్నా ముందే ఆ భాషని మాట్లాడే శక్తి ఏదో మన సబ్‌కాన్షస్ మైండ్ కి ఉందన్నమాట.

Reading

స్కూలుకి వెళ్ళే వయసు వచ్చాక పాపని స్కూల్లో చేర్పించారు. అక్కడకి వెళ్ళి చేరేటప్పటికే పాపకి మాతృభాషలో హాయిగా మాట్లాడే అలవాటు ఉంది. కాబట్టి చదవటం వల్ల కొత్త పదాలు, కొత్త విషయాలు తెలిశాయే తప్పనిచ్చి, మాట్లాడేదానికి కొత్తగా ఒనగూడింది ఏమీ లేదు.

Writing

మాతృభాషకి సంబంధించి మనం చివరగా చేసిన పని వ్రాయటం. ఈ వ్రాయటం అనేది మనం అ, ఆ, ఇ, ఈ.. ఇలా మొదలెట్టాం. ఇందాకే చెప్పుకున్నట్టు, ఈ వ్రాయటానికంటే ముందుగానే మనకు మాట్లాడటం వచ్చేసింది. ఈ వ్రాయటం అనేది ఒక అదనపు పనిగా చేపట్టాము తప్పనిచ్చి, ఈ వ్రాయటం వల్ల మనం మాట్లాడే విషయంగా మనకు కొత్తగా లాభం కలిగింది ఏదీ లేదు.

మనం మాతృభాషని ఈ పద్దతిలో నేర్చుకున్నాము. ఇలా

L – Listening (వినటం)

S – Speaking (మాట్లాడటం)

R – Reading (చదవటం)

W – Writing (వ్రాయటం)

ఇదే వరుసలో చేశాము. ఇది సహజ సిద్ధమైన పద్ధతి.

అంటే మనం ఒక భాషలో హాయిగా మాట్లాడగలగాలి అంటే ఆ భాషని నేర్చుకోవాల్సిన పద్దతి ఇదే. దీన్నే నేచురల్ ఫ్లో టెక్నిక్ (NFT) అని అందాము.

ఒక్క తెలుగు వారే కాదు. ఎవ్వరైనా సరే మాతృభాష నేర్చుకునే పద్ధతి ఇదే. వారు తమిళవారు కావచ్చు, కన్నడ వారు కావచ్చు, మలయాళం వారు కావచ్చు, లేదా ప్రపంచంలోని ఏ భాష వారయినా కావచ్చు మాతృభాషని ఇదే విధంగా నేర్చుకుని ఉంటారు.

ఒక భాషలో హాయిగా మాట్లాడాలి అంటే ఆ భాషని నేర్చుకొనవలసిన పద్దతి ఈ నేచురల్ ఫ్లో టెక్నిక్ అని మనం నిశ్చయంగా అర్థం చేసుకోవచ్చు.

సరే ఇక ఇంగ్లీష్ విషయానికి వద్దాం.

మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.

మనం ఇలా నేచురల్ ఫ్లో టెక్నిక్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోలేదు. మనం ఇంగ్లీష్‌ని సరిగ్గా ఆపోజిట్ పద్ధతిలో నేర్చుకున్నాము. అది ఎలాగంటారా

ఇంగ్లీష్ భాషతో మన ప్రయాణం ఎలా మొదలయ్యింది? మొదట మనం ఇంగ్లీష్ వ్రాశాము A,B,C,D ….Z అని, ఆ తర్వాత చిన్న చిన్న పదాలను చదివాము, ఆ తర్వాత టీచర్ మాట్లాడుతూ ఉంటే విన్నాము, చివరగా ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రయత్నం చేశాము.

మనం ఇంగ్లీష్ భాష మొత్తంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో నేర్చుకున్నాము.

W

R

L

S

అన్న విధంగా. సరిగ్గా ఈ కారణంగా మనకు ఇంగ్లీష్ రాదా అంటే వచ్చు, వచ్చా అంటే రాదు. అంటే ఎవరైనా మాట్లాడితే అర్థం అవుతుంది, మనం వ్రాయగలం, చదవగలం, మాట్లాడగలం.

ఒక భాషలో మాట్లాడటం నేర్చుకోవటానికి రైటింగ్ మరియు రీడింగ్ అనవసరం:

మనం మాతృభాషలాగా ఇంగ్లీష్‌ని హాయిగా మాట్లాడలేకపోతున్నాము అనే అసంతృప్తి మనందరిలో తీవ్రంగా ఉంది. అలా ఎందుకు జరుగుతోంది అంటే ఒక్కటే కారణం మనం ఇంగ్లీష్ భాషని నేర్చుకున్న విధానం లోనే తీవ్రమైన లోపం ఉంది.

ఒక్కటి మాత్రం మీరు నిశ్చయంగా అర్థం చేసుకోండి, మీరు మిమ్మల్ని మీరు కించపరచుకోవాల్సిన పని ఎంతమాత్రం లేదు.

మనం ఇందాక చెప్పుకున్నట్టు, ఒక వ్యక్తికి చదవటం వ్రాయటం రాకున్నా కూడా తన మాతృభాషలో హాయిగా మాట్లాడగలడు. చదవటం, వ్రాయటం అన్నవి కేవలం అతను నేర్చుకుంటున్న అదనపు అంశాలు మాత్రమే. నిశ్చయంగా చదవడం వ్రాయటం అన్నవి మంచివే, కాని మనల్ని మాట్లాడింపజేయటంలో చదవటం, వ్రాయటం అన్నఅంశాలకి ఏ పాత్రా లేదు అన్నది మనం ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం.

మనం ఇంగ్లీష్ నేర్చుకున్న విధానం WRLS ఏదైతే ఉందో దాని వల్ల మనకు ఇంగ్లీష్ వ్రాయటం వచ్చు, చదవటం వచ్చు, విని అర్థం చేసుకోవటం వచ్చు, తప్పనిసరి పరిస్థితులలో మాట్లాడటం వచ్చు.

మరి మన బాధ ఏమిటి అంటే, మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నామే అని. ఆ కారణంగా మనం ఆత్మన్యూనతకి గురి అవుతున్నాము, మనల్ని మనం కించపరచుకుంటున్నాము, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని మన అవకాశాల్ని మనమే తగ్గించుకుని ఎదగటానికి వీల్లేని విధంగా మన హయ్యర్ స్టడీస్ ఆప్షన్స్‌ని ఎంచుకుంటున్నాము, ఉద్యోగ అవకాశాల్ని, వ్యాపార అవకాశాల్ని కాలదన్నుకుంటున్నాము. మనలో మనమే కించపడుతూ కుమిలిపోతూ ఉంటాము.

మీకు తెలుసా ఇదంతా ఒక కుట్ర యొక్క ఫలితం. భారతీయులు ఇలా ఎప్పటికీ తమని తాము కించపరచుకుంటూ , ఆత్మ న్యూనతతో బానిసత్వ భావనలతో ఉండాల్సిందే అన్న కుట్రపూరిత లక్ష్యంతో ఈ విద్యా విధానాన్ని మెకాలే అనే ఆంగ్లేయ విద్యావేత్త ప్రవేశపెట్టాడు. ఈ విషయాల్ని మనం ముందు ఛాప్టర్ట్స్‌లో తెలుసుకున్నాము.

కాబట్టి మాతృభాషలాగా మీరు ఇంగ్లీష్‌లో హాయిగా మాట్లాడాలి అంటే అసలు మీరు ఈ ఆత్మ న్యూనతని వదిలిపెట్టాలి.

చాలా మంది హాయిగా ఆడుతూ పాడుతూ టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజి చదివేస్తారు, మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు. మన దురదృష్టవశాత్తు, మెకాలే మానస పుత్రులైన విద్యావేత్తలు కూడా మిమ్మల్ని తప్పు దారి పట్టించారు. వారు గుడ్డిగా ఇన్నేళ్ళైనా కూడా మెకాలే ప్రతిపాదించిన విద్యా విధానాన్నే అమలు జరిపారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా, మీతో ఇంగ్లీష్ చక్కగా హాయిగా ఇంగ్లీష్ మాట్లాడింపజేసే విధంగా మన విద్యా విధానాన్ని రూపుదిద్దుకోలేకపోయాము. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా, మన యావత్తు విద్యా విధానంలో మెకాలే లక్ష్యం ఏదయితే ఉందో అదే అమలు అవుతోంది ఇన్నేళ్ళైనా కూడా. అంటే ఏమిటి, మీరు ఇంగ్లీష్ రాకపోవటం వల్ల ఆత్మన్యూనతతో కుమిలిపోయే విధంగా మన విద్యా విధానం అమలు అవుతూ వచ్చింది.

స్వాతంత్యం రాగానే మనం రెండు పద్దతులు పాఠించి ఉండాల్సింది. అవి ఏమిటి అంటే

1) జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అనేక అభివృద్ధి చెందిన దేశాల లాగా మాతృభాషనే ప్రధాన బోధనా భాషగా తీస్కుని, ఇంగ్లీష్‌ని కేవలం ఒక సబ్జెక్టుగా ఎప్పుడో ఇంటర్‍మీడియేట్ తర్వాత ప్రవేశపెట్టి ఉండాల్సింది

లేదా

2) ఇంగ్లీష్‌ని నేర్పించే విధానంలో మెకాలే పద్దతి అయిన WRLS అన్న పద్దతికి తిలోదకాలు ఇచ్చి, నేచురల్ ఫ్లో టెక్నిక్ అయిన LSRW పద్దతిలో బోధన జరిగి ఉండాల్సింది

కాబట్టి ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. మీరు ఇంగ్లీష్‍లో హాయిగా, అనర్గళంగా మాట్లాడలేకపోవటానికి కారణం మన విద్యా విధానంలోనే ఉంది తప్పనిచ్చి మీలో ఏ లోపం లేదు.

ఇది అర్థం చేసుకోలేక చాలా మంది తమని తాము కించపర్చుకుంటూ ఉంటారు.

చాలా మంది ఆడుతూ పాడుతూ చదువులు ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడో, గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనాల్సి వచ్చినప్పుడో, సెమినార్ (JAM Sessions etc) ఇవ్వాల్సి వచ్చినప్పుడో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది మొదటి సారిగా. అప్పుడు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు ఫీలయి, తమని తాము కించపరచుకుంటూ భ్రమతో కూడిన ఈ కింది స్టేట్‍మెంట్స్ ఇచ్చుకుని తమని తాము తృప్తి పరచుకుంటారు.

భ్రమ– నేను తెలుగు మీడియంలో చదువుకోవటం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను.

వాస్తవం– ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి కూడా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, వారే రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు

భ్రమ-నేను చిన్న ఊరి నుంచి రావటం వల్ల్ ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదు

వాస్తవం-సిటీల్లో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిన వారికి కూడా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, వారే రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు

భ్రమ-క్రిష్టియన్స్‌కి ఇంగ్లీష్ బాగా వస్తుంది

వాస్తవం-క్రిష్టియన్స్ అందరికీ ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, వారే రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు, చాలా మంది పాస్టర్లు కూడా రాయల్‌లో చేరి ఇంగ్లీష్ నేర్చుకున్నారు.

భ్రమ-నాకు ఇంగ్లీష్ గ్రామర్, ముఖ్యంగా టెన్సెస్ రాకపోవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను

వాస్తవం-చాలా మంది ఇంగ్లీష్ లెక్చరర్లకి, ఫ్రొఫెసర్లకి ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చు, బాగా వ్రాయగలరు, కానీ హాయిగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అలాంటి వారే రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు.

భ్రమ-నాకు ఇంగ్లీష్ రాకుంటే మంచి మంచి ఉద్యోగాలు రావు

వాస్తవం– ఇది కొంత మేరకు వాస్తవమే అయినప్పటికీ, హెచ్చార్ మేనేజర్లు మీ టెక్నికల్ స్కిల్స్, మీ పాజిటివ్ ఆటిట్యూడ్, మీ లీడర్షిప్ క్వాలిటీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హెచ్చార్ మేనేజర్ల ఫిలాసఫీ ఏమిటి అంటే, ఆటిట్యూడ్‌ని ట్రెయినింగ్ ద్వారా మార్చలేము, స్కిల్స్‌ని నేర్పించగలము. కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడే స్కిల్ పెద్దగా లేకున్నా మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ పాజిటివ్ ఆటిట్యూడ్‌ని బట్టి ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాకా కూడా, వారు మీకు వెసులుబాటు ఇచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడటం నేర్చుకోమని చెప్పి ప్రోత్సహిస్తారు. ఇలా తమ స్కిల్స్ ద్వారా ఎమ్మెన్సీ కంపెనీలలో జాబ్ తెచ్చుకున్న అనేక మంది రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు

భ్రమ-నేను మెరిట్ స్టూడెంట్‌ని కాను. తక్కువ మార్కులతో పాసవుతూ వచ్చాను. అందువల్ల ఇంగ్లీష్ మాట్లాడటం రాదు

వాస్తవం– గోల్డ్ మెడలిస్టులు, రాంకు హోల్డర్లు, ఐఐటీ స్టూడెంట్స్ అందరూ కూడ ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు. వారే రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు

భ్రమ– విదేశీయులు అందరికీ ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వస్తుంది

వాస్తవం-ఇంగ్లీష్ మాట్లాడటం రాని దేశాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ప్రపంచంలో. ఉత్తిగా మేనేజిబిల్ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన జనాలే ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా. వాస్తవానికి చాలా దేశాలతో పోలిస్తే మన భారతీయులు ఇంగ్లీష్ బాగానే మాట్లాడగలరు, అందుకే మనకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. కానీ మనకు ఆత్మవిశ్వాసం తక్కువ. అది ప్రధాన సమస్య. నిజానికి అనేక మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరుతున్నారు.

భ్రమ-మా ఇంట్లో ఎవ్వరూ ఇంగ్లీష్ మాట్లాడరు. అందువల్ల నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు

వాస్తవం– ఇది కొంత మేరకు వాస్తవం. మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉంటే మనకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. కానీ పూర్తి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన అనేక మంది పెద్ద స్థాయికి వెళ్ళి ఇంగ్లీష్ హాయిగా మాట్లాడగలుగుతున్నారు. దీనికి మీరు ఏమి చేయాలంటే, ఇవ్వాళ్టి నుంచే మీ మిత్ర బృందాన్ని కల్సి ఒక చిన్న బృందంగా ఏర్పడి అందరూ రోజు కొంత సేపు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే నియమం పెట్టుకోవాలి.

ఆల్ ది బెస్ట్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here