సంపాదకీయం ఆగస్టు 2023

0
8

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న రచయితలందరికీ ధన్యవాదాలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

‘సంచిక’ ఇటీవల ప్రారంభించిన ఆంగ్ల రచనల ప్రచురణలో భాగంగా ఈ నెల శ్రీ శ్రీనివాస రాఘవ రచించిన ‘The Butterfly Effect: Aadya and the Gift of Flight’ అనే ఆంగ్ల కథని పాఠకులకి అందిస్తున్నాము. ఆంగ్లంలో రచనలు చేసే యువ/సీనియర్ రచయితలను తమ రచనలకు ‘సంచిక’కు పంపవలసిందిగా కోరుతున్నాము.

‘సంచిక’ ద్వారా ప్రచురింపబడి పాఠకుల ఆదరణ పొందిన ‘దేశభక్తి కథలు’, ‘క్రీడా కథ’, ‘కులం కథలు’, ‘రామకథాసుధ’ వంటి సంకలనాల తరహాలోనే మరో కొత్త సంకలనం రూపకల్పన చేయదలచింది ‘సంచిక’. వివరాలను అతి త్వరలో వెల్లడిస్తాము.

అలాగే సంచిక ప్రారంభమైన నాటి నుంచి ఇటీవలి కాలం వరకు ప్రచురితమైన కథలలోంచి ఎంపిక చేసిన కథలతో ఒక సంకలనం తెచ్చే ఆలోచన కూడా చేస్తోంది. ఆపై ప్రతీ ఏడాది ‘సంచిక’లో ప్రచురితమైన రచనలలోంచి ఏరిన రచనలతో  ఒక సంకలనం ప్రచురించాలన్న ఉద్దేశం కలిగింది.

రచయితలకు, ఆధునిక తరం పాఠకులకు ఉపకరించేలా త్వరలో ‘సంచిక’ యూ-ట్యూబ్ ఛానెల్ ప్రారంభించనుంది. రచయితలు తమ స్వరంతో తమ రచనలను చదివి ఆడియో/వీడియో ఫైల్స్ పంపితే, ‘సంచిక’ యూట్యూబ్ ఛానెల్‍లో ఉంచుతాము. ఈ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రచయితలతో పంచుకుంటాము. ఒకవేళ రచనలను రచయితలు కాక, ప్రొఫెషనల్స్‌తో చదివించడం జరిగితే ఆ ప్రకారంగా రెవెన్యూ షేరింగ్‍లో మార్పులు ఉంటాయి. విధి విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాము. వీలైనంత త్వరగా రచయితలతో వివరాలు పంచుకుంటాము.

‘సంచిక’ రచయితలతో జరిపే ఆన్‍లైన్ మీటింగ్స్ రికార్డింగులు కూడా ఈ యూ-ట్యూబ్ ఛానె‍లో పొందుపరచబడతాయి.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని ఉత్తమమైన రీతిలో పాఠకులకు చేరువ చేయాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఆగస్టు 2023 సంచిక.

1 ఆగస్టు 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • రచయిత్రి శ్రీమతి శారద అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • తెలంగాణా ప్రాంతంలోని శ్రీ వైష్ణవ కుటుంబాలు – సంప్రదాయము – డా. గోవర్ధనం స్వామినాథాచార్యులు/సంచిక టీమ్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…16 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • సంచిక విశ్వవేదిక – మానవ (మన) ప్రస్థానం – సారధి మోటమఱ్ఱి

భక్తి:

  • రామాయణము తత్త్వవిచారము – సంధ్య యల్లాప్రగడ

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- ఆగస్టు 2023 – దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -41- ఆర్. లక్ష్మి
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-3 – పాణ్యం దత్తశర్మ

కథలు:

  • The Butterfly Effect: Aadya and the Gift of Flight – Srinivasa Raghava K
  • నగరంలో మరమానవి-11 – చిత్తర్వు మధు
  • రేటింగ్ రేస్ – గంగాధర్ వడ్లమాన్నాటి
  • స్థిమిత భయానకం – వేదాల గీతాచార్య

కవితలు:

  • ద్వంద్వాలు – శ్రీధర్ చౌడారపు
  • రంగుల వల – డా. విజయ్ కోగంటి
  • తెల్లారింది – వారాల ఆనంద్
  • నాలో నేను – జి. వి. లలితకుమారి

బాలసంచిక:

  • కంటకాసురిడి కథ – కంచనపల్లి వేంకటకృష్ణారావు

పుస్తకాలు:

  • గొప్ప స్మృతి సంచిక ‘పూర్ణత్వపు పొలిమేరలో..’ – పుస్తక సమీక్ష – శ్రీనివాస్ మంత్రిప్రగడ
  • ఆధునిక మృచ్ఛకటికమ్ – పుస్తక విశ్లేషణ – ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

అవీ ఇవీ:

  • అభిమన్యుడు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • సాహిత్య విమర్శనా వ్యాసాలకు ‘పాలపిట్ట బుక్స్‌’ ఆహ్వానం – ప్రకటన – గుడిపాటి వెంకట్

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here