సంపాదకీయం డిసెంబర్ 2024

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

దీపావళి సందర్భంగా ‘సంచిక’ – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథలను ప్రచురించాము.  సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల ప్రచురణ ఈ నెల నుంచి మాసపత్రిక లోనూ, వారపత్రిక లోనూ ప్రారంభమవుతోంది.

కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా పద్యకావ్యాలు, వచనకవితల పోటీ నిర్వహిస్తోంది ‘సంచిక’. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని నిర్వహిస్తున్నారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు. పద్య కావ్య రచన పోటీ వివరాలు ఈ లింక్‌లో చూడవచ్చు.

https://sanchika.com/2025-ugadi-padayakavya-potee-prakatana/

‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర. ఈ పోటీ వివరాలు ఈ లింక్‌లో చూడవచ్చు.

https://sanchika.com/2025-ugadi-vachana-kavitala-potee-prakatana/

విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా, ‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు నిలుస్తున్న సంగతి తెలిసినదే. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ఇద్దరు కవుల రెండు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 డిసెంబర్ 2024 సంచిక.

1 డిసెంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం

  • కథా, నవలా రచయిత్రి శ్రీమతి జి. ఎస్. లక్ష్మి అంతరంగ ఆవిష్కరణ – డా. ప్రసాద్ కె. ఎల్. వి.

ధారావాహిక:

  • ఆరోహణ-5 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కాలమ్స్:

  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-16 – కుంతి
  • సగటు మనిషి స్వగతం-7 – సగటు మనిషి
  • వందే గురు పరంపరామ్ – 4 – చివుకుల శ్రీలక్ష్మి

పరిశోధనా గ్రంథం:

  • శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-8 – పాణ్యం దత్తశర్మ

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- డిసెంబర్ 2024 – టి. రామలింగయ్య

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా – 57 – ఆర్. లక్ష్మి

కథలు:

  • ఫ్రీ డెమో.. – గంగాధర్ వడ్లమన్నాటి
  • ఒకే ఒక్కడు.. – నంద్యాల సుధామణి
  • విలువైన బహుమతి – ములుగు లక్ష్మీ మైథిలి

కవితలు:

  • మైలురాళ్ళు – శ్రీధర్ చౌడారపు
  • స్వర్ణ భారతము – చిరువోలు విజయ నరసింహారావు
  • వేకువస్వరం – అనూరాధ బండి

పుస్తకాలు:

  • ‘కథారామంలో పూలతావులు’ ~ నాదో చిన్నమాట – పుస్తక పరిచయం – శీలా సుభద్రాదేవి
  • మూడు ప్రయోజనాలను సాధించిన నవల ‘బతుకు సేద్యం’ – పుస్తక సమీక్ష – డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి

బాలసంచిక:

  • వినూత్న సాంకేతికత – కంచనపల్లి వేంకటకృష్ణారావు

English Section:

  • I am Just Not a Poet – Poem – Dr. T. Radhakrishnamacharyulu
  • Where have I gone? – Poem – Samudrala Hariskrishna

~

ఈ నెల 1వ తేదీ, ఆదివారం ఒకే రోజు అయినందున, ఈ రోజు ‘సంచిక వారపత్రిక’ కూడా విడుదలవుతోంది.

1 డిసెంబర్ 2024 నాటి ‘సంచిక వారపత్రిక’లోని రచనలు:

ప్రత్యేక ఇంటర్వ్యూ:

  • కథా, నవలారచయిత ఆర్. సి. కృష్ణస్వామిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్

సీరియల్స్:

  • శ్రీవర తృతీయ రాజతరంగిణి – 36 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
  • పూచే పూల లోన-79 – వేదాంతం శ్రీపతిశర్మ
  • అద్వైత్ ఇండియా-38 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
  • జీవితమొక పయనం-15 – జిల్లేళ్ళ బాలాజీ
  • చంద్రునికో నూలుపోగు-9 – సలీం
  • వసంత లోగిలి-6 – బంటుపల్లి శ్రీదేవి
  • శ్రీమద్రమారమణ-4 – పాణ్యం దత్తశర్మ

కాలమ్స్:

  • అలనాటి అపురూపాలు -249- లక్ష్మీ ప్రియ పాకనాటి
  • తెలుగుజాతికి ‘భూషణాలు’ – 40 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
  • ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-24 – డా. సి. ఉమా ప్రసాద్
  • దంతవైద్య లహరి -23 – డా. కె. ఎల్. వి. ప్రసాద్
  • చిరుజల్లు-145 – శ్రీధర

గళ్ళ నుడికట్టు:

  • సంచిక పదసోపానం-31: కోడిహళ్లి మురళీమోహన్
  • సంచిక పద ప్రతిభ-144: పెయ్యేటి సీతామహాలక్ష్మి

భక్తి:

  • తల్లివి నీవే తండ్రివి నీవే!-57 – వేదాల గీతాచార్య

ఆత్మకథ/స్వీయచరిత్ర:

  • తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -35 – తుర్లపాటి నాగభూషణ రావు

కథలు:

  • ఇచిగో ఇచి.. ఈ క్షణం చేజారనీయకు – శ్రీపతి లలిత
  • జతానందులు – యన్. వి. శాంతి రెడ్డి

2024 దీపావళి పోటీ సాధారణ ప్రచురణ కథలు:

  • అలా జరగనివ్వను – వాత్సల్య
  • అమ్మకి ప్రేమతో – ఎం. జి. సరస్వతి దేవి
  • అమ్మ దగ్గరకి.. – కస్తూరి రాజశేఖర్
  • అభిమన్యుడు – అనిసెట్టి శ్రీధర్
  • అనుబంధాల సంకెళ్లు! – ఏ.అన్నపూర్ణ
  • అద్వైతం – నరహరి రావు బాపురం
  • అట్టడుగు పొర – విజయ్ ఉప్పులూరి

పద్యకావ్యం:

  • శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-11 – పాణ్యం దత్తశర్మ

కవితలు:

  • అనువాద మధు బిందువులు-1 – ఎలనాగ
  • తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-30- మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
  • వెన్నెల అడవిది! – గీతాంజలి
  • సంచికలో 25 సప్తపదులు-26 – సుధామ
  • గోలి మధు మినీ కవితలు-34 – గోలి మధు
  • నమస్కారం – కనపర్తి రాజశేఖరమ్
  • క్రమశిక్షణ – మరింగంటి శ్రీకాంత్
  • వెలుగు దివ్వెల విత్తనాలు..! – గోపగాని రవీందర్

పుస్తకాలు:

  • మంచి మనుషుల మంచి కథలు – ‘జక్కదొన’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

సినిమాలు/వెబ్ సిరీస్:

  • సినిమా క్విజ్-118- శ్రీనివాసరావు సొంసాళె
  • సిరివెన్నెల పాట – నా మాట – 73- జీవితం పట్ల నూతనోత్సాహాం కలిగించే పాట – ఆర్.శ్రీవాణీశర్మ
  • ‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-24 – రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా – పి. జ్యోతి
  • మరుగునపడ్డ మాణిక్యాలు – 105: వంశవృక్షం – పి. వి. సత్యనారాయణ రాజు

బాల సంచిక:

  • మహాభారత కథలు- 85: దివ్యక్షేత్రాల వర్ణన – దర్శన ఫలము-2 – భమిడిపాటి బాలాత్రిపురసుందరి

అవీ ఇవీ:

  • యాపిల్ కవర్లతో బొమ్మలు – డా. కందేపి రాణీప్రసాద్
  • డా. భీంపల్లి శ్రీకాంత్‌కు ఉత్తమ సాహితి ప్రతిభా అవార్డు – ప్రెస్ నోట్ – సంచిక టీమ్
  • తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ ధ్యాన మహోత్సవం వేడుక – నివేదిక – ఆర్.శ్రీవాణీశర్మ
  • కార్తీక వైభవం ప్రవచనములు – నివేదిక – జెట్టి వంశీకృష్ణ/అతిథి

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here