Site icon Sanchika

సంపాదకీయం ఫిబ్రవరి 2019

పాఠకులకు నాణ్యమయిన రచనలను అందించి ఆకర్షించాలని సంచిక నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 2019 సంచికలో పలు కొత్త రచనలు అందిస్తున్నాము. ప్రఖ్యాత రచయిత్రి పోడూరి కృష్ణకుమారి రచించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మనోమాయా జగత్తు’ ఈ సంచిక నుంచీ ఆరంభమవుతుంది. తెలుగు సాహిత్యంలో ఇలాంటి రచనలు అరుదుగా వచ్చాయి. ఈ రచన పాఠకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతుంది, ఆలోచింపచేస్తుంది.

అలాగే శ్రీ బొందల నాగేశ్వరరావు రచించిన నవల ‘పామరులు-పడవతాత’ రాజకీయం నేపథ్యంతో సృజించినది. ఈ రచన కూడా చదువరులను ఆకట్టుకుంటుంది.

కోవెల సుప్రసన్నాచార్యగారు సంచిక కోసం ప్రత్యేకంగా రామాయణ కల్పవృక్షాన్ని విశ్లేషిస్తూ రాస్తున్న వ్యాసాలలో మొదటిభాగం ఈ సంచికతో ఆరంభమవుతోంది. సాహిత్యమూ, ఆధ్యాత్మికతలు కలగలిసి విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష రచనను విశ్లేషించి అందించే వ్యాస పరపంపర ఇది.

ఆనందరావు పట్నాయక్ చెబుతున్న ‘కాలనీ కబుర్లు’ కూడా ఈ నెల నుంచే ఆరంభం అవుతోంది.

ఇంకా అనేక ఆసక్తికరమయిన రచనలతో సంచిక మీముందుకు వస్తోంది.

1 ఫిబ్రవరి 2019 సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:

సంభాషణం: – డా. బి.వి.ఎన్. స్వామి అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్

ప్రత్యేక వ్యాసం: మహాకవి నీరజ్ జీవితంలో ప్రేమ సంబంధాలు – డా. టి. సి. వసంత

ధారావాహికలు:

నీలమత పురాణం-11- కస్తూరి మురళీకృష్ణ

తమసోమా జ్యోతిర్గమయ – 7- గంటి భానుమతి

అంతరం – 6 – స్వాతీ శ్రీపాద

మనోమాయా జగత్తు -1- పోడూరి కృష్ణకుమారి

పామరులు – పడవతాత-1 – బొందల నాగేశ్వరరావు

కాలమ్స్:

రంగులహేల-11- సున్నితత్వాలు – కఠినత్వాలు – అల్లూరి గౌరీలక్ష్మి

సలీం కల్పిక – మహా రచయిత – సలీం

తెలంగాణ మలితరం కథకులు కథనరీతులు-12 -తెలంగాణలో తొలి జంట రచయితలు – కె.పి.అశోక్‌కుమార్

మానస సంచరరే -13: లాహిరి లాహిరి లాహిరిలో…! – జె. శ్యామల

కాలనీ కబుర్లు-1- ఆనందరావు పట్నాయక్

వ్యాసాలు:

కల్పవృక్ష ప్రకాశము – అవతారిక – 1 – కోవెల సుప్రసన్నాచార్య

ఇదీ ఒక తెలుగోడి గోడు – పాండ్రంకి సుబ్రమణి

మన సంస్కృతి – పీరీలు – నల్ల భూమయ్య

పేరెంట్స్ – స్టూడెంట్స్ – ఎం. వెంకటేశ్వరరావు

కథలు:

పుళింద – జొన్నలగడ్డ సౌదామిని

మకర్ ఛుద్రక్ – దాసరి శివకుమారి

పునరావృతం – పి.ఎల్.ఎన్. మంగారత్నం

కవితలు:

సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు-15- పుప్పాల జగన్మోహన్రావు

చదువు – భయము – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

జంట పద(స్వరా)లు – విసురజ

జీవితసారం – కారుణ్య

పాపం! అమాయకురాలు వర్తమానం – శ్రీధర్ చౌడారపు

పుస్తకాలు:

‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ – పుస్తక పరిచయం

అవీ ఇవీ:

ఏసుదాసు స్వరఘరి – సుజాత వేల్పూరి

అదే పాట ఇదే చోట-1- ఆర్. దమయంతి

కార్టూన్లు:

కెవిఎస్-9

జెఎన్మెమ్-1

మీ సలహాలు సూచనలతో సంచికను పరిపుష్టం చేయాలని ప్రార్థన.

– సంపాదక బృందం

Exit mobile version