సంపాదకీయం ఫిబ్రవరి 2019

0
8

[dropcap]పా[/dropcap]ఠకులకు నాణ్యమయిన రచనలను అందించి ఆకర్షించాలని సంచిక నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 2019 సంచికలో పలు కొత్త రచనలు అందిస్తున్నాము. ప్రఖ్యాత రచయిత్రి పోడూరి కృష్ణకుమారి రచించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మనోమాయా జగత్తు’ ఈ సంచిక నుంచీ ఆరంభమవుతుంది. తెలుగు సాహిత్యంలో ఇలాంటి రచనలు అరుదుగా వచ్చాయి. ఈ రచన పాఠకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతుంది, ఆలోచింపచేస్తుంది.

అలాగే శ్రీ బొందల నాగేశ్వరరావు రచించిన నవల ‘పామరులు-పడవతాత’ రాజకీయం నేపథ్యంతో సృజించినది. ఈ రచన కూడా చదువరులను ఆకట్టుకుంటుంది.

కోవెల సుప్రసన్నాచార్యగారు సంచిక కోసం ప్రత్యేకంగా రామాయణ కల్పవృక్షాన్ని విశ్లేషిస్తూ రాస్తున్న వ్యాసాలలో మొదటిభాగం ఈ సంచికతో ఆరంభమవుతోంది. సాహిత్యమూ, ఆధ్యాత్మికతలు కలగలిసి విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష రచనను విశ్లేషించి అందించే వ్యాస పరపంపర ఇది.

ఆనందరావు పట్నాయక్ చెబుతున్న ‘కాలనీ కబుర్లు’ కూడా ఈ నెల నుంచే ఆరంభం అవుతోంది.

ఇంకా అనేక ఆసక్తికరమయిన రచనలతో సంచిక మీముందుకు వస్తోంది.

1 ఫిబ్రవరి 2019 సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:

సంభాషణం: – డా. బి.వి.ఎన్. స్వామి అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్

ప్రత్యేక వ్యాసం: మహాకవి నీరజ్ జీవితంలో ప్రేమ సంబంధాలు – డా. టి. సి. వసంత

ధారావాహికలు:

నీలమత పురాణం-11- కస్తూరి మురళీకృష్ణ

తమసోమా జ్యోతిర్గమయ – 7- గంటి భానుమతి

అంతరం – 6 – స్వాతీ శ్రీపాద

మనోమాయా జగత్తు -1- పోడూరి కృష్ణకుమారి

పామరులు – పడవతాత-1 – బొందల నాగేశ్వరరావు

కాలమ్స్:

రంగులహేల-11- సున్నితత్వాలు – కఠినత్వాలు – అల్లూరి గౌరీలక్ష్మి

సలీం కల్పిక – మహా రచయిత – సలీం

తెలంగాణ మలితరం కథకులు కథనరీతులు-12 -తెలంగాణలో తొలి జంట రచయితలు – కె.పి.అశోక్‌కుమార్

మానస సంచరరే -13: లాహిరి లాహిరి లాహిరిలో…! – జె. శ్యామల

కాలనీ కబుర్లు-1- ఆనందరావు పట్నాయక్

వ్యాసాలు:

కల్పవృక్ష ప్రకాశము – అవతారిక – 1 – కోవెల సుప్రసన్నాచార్య

ఇదీ ఒక తెలుగోడి గోడు – పాండ్రంకి సుబ్రమణి

మన సంస్కృతి – పీరీలు – నల్ల భూమయ్య

పేరెంట్స్ – స్టూడెంట్స్ – ఎం. వెంకటేశ్వరరావు

కథలు:

పుళింద – జొన్నలగడ్డ సౌదామిని

మకర్ ఛుద్రక్ – దాసరి శివకుమారి

పునరావృతం – పి.ఎల్.ఎన్. మంగారత్నం

కవితలు:

సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు-15- పుప్పాల జగన్మోహన్రావు

చదువు – భయము – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

జంట పద(స్వరా)లు – విసురజ

జీవితసారం – కారుణ్య

పాపం! అమాయకురాలు వర్తమానం – శ్రీధర్ చౌడారపు

పుస్తకాలు:

‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ – పుస్తక పరిచయం

అవీ ఇవీ:

ఏసుదాసు స్వరఘరి – సుజాత వేల్పూరి

అదే పాట ఇదే చోట-1- ఆర్. దమయంతి

కార్టూన్లు:

కెవిఎస్-9

జెఎన్మెమ్-1

మీ సలహాలు సూచనలతో సంచికను పరిపుష్టం చేయాలని ప్రార్థన.

– సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here