సంపాదకీయం జూలై 2023

0
11

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్సులు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

రచయితలతో ‘సంచిక’ నిర్వహించదలపెట్టిన ఆన్‍లైన్, ఆఫ్‍లైన్ సమావేశాలలో భాగంగా 25 జూన్ 2023 ‘సంచిక’ తొలిసారిగా రచయితలో జూమ్ మీటింగ్ నిర్వహించింది. దేశంలోని పలు ప్రాంతాల నుండి, అమెరికా నుంచి ‘సంచిక’ రచయితలు ఈ ఆన్‍లైన్ సమావేశంలో పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ‘సంచిక’ రైటర్స్ క్లబ్ ఏర్పాటు గురించి, సహకార పద్ధతిలో పుస్తకాల ప్రచురణ గురించి, సంచిక సాహిత్య పురస్కారం ఏర్పాటు గురించి రచయితలు తమ అభిప్రాయం తెలిపారు.

సాహిత్యరంగానికి సేవలందించినవారిని గౌరవించుకునేలా త్వరలో సంచిక- స్వాధ్యాయ సాహిత్య పురస్కారాలు ఆరంభించాలని నిర్ణయించాము. వివరాలను త్వరలో ప్రకటిస్తాము.

పాఠకులను, రచయితలను దగ్గర చేసే క్రమంలో భాగంగా పుస్తక సమీక్షతో పాటుగా పుస్తక రచయిత లేక సంపాదకులతో సంభాషణను కూడా అందిస్తోంది ‘సంచిక’. విమర్శకులు, సమీక్షకులు పుస్తకం గురించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినా, తమ దృక్కోణాన్ని వివరించే వీలు రచయితలకు సంపాదకులకూ లభిస్తుంది. దాంతో పాఠకుడు విమర్శ చదివి, రచయిత అభిప్రాయం తెలుసుకుని, పుస్తకం చదివి తన స్వంత అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. రచయితలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అభ్యర్ధిస్తున్నాము.

‘సంచిక’ ప్రచురించిన రామకథాసుధ కథల సంకలనం పాఠకాదరణ పొందుతూ, పాఠకుల ప్రశంసలందుకుంటోంది. ఈ సంకలనంలోని కథకులతో వారు ఆ కథని రాయడంలోని అనుభవాలు, ప్రేరణ, తదితర సంగతులను చిన్న ఇంటర్వ్యూలా ప్రచురిస్తున్నాము. తద్వారా ఆయా రామకథల వెనుక రచయిత ఉద్దేశాన్ని తెలుసుకునే వీలు పాఠకులకి కలుగుతుందని విశ్వసిస్తున్నాము.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని ఉత్తమరీతిలో పాఠకులకు చేరువ చేయాలన్న సంచిక ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూలై 2023 సంచిక.

1 జూలై 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • కవయిత్రి శ్రీమతి సరళ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…15 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • సంచిక విశ్వవేదిక – కోవిడ్ ముగిసిన వేళ – పని జీవితంలో మార్పులు – సారధి మోటమఱ్ఱి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- జూలై 2023 – దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -40- ఆర్. లక్ష్మి
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-2 – పాణ్యం దత్తశర్మ

కథలు:

  • నగరంలో మరమానవి-10 – చిత్తర్వు మధు
  • కొంప మునిగింది.. – గంగాధర్ వడ్లమాన్నాటి
  • యంత్రవిజయం – వి. బి. సౌమ్య

కవితలు:

  • అదేంటో..! – శ్రీధర్ చౌడారపు
  • జల్లికట్లు – డా. విజయ్ కోగంటి
  • ఆకుపచ్చని సంతకం – ఆవుల వెంకటరమణ

బాలసంచిక:

  • ఉత్తమ ఆలోచన – కంచనపల్లి వేంకటకృష్ణారావు

పుస్తకాలు:

  • వైవిధ్యభరితమైన కవితా సుమమాల ‘పండుగలు ముత్యాలహారాలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

అవీ ఇవీ:

  • శ్వేతకి – సత్రయాగము – అంబడిపూడి శ్యామసుందర రావు
  • బాలల కథలకు ఆహ్వానం – ప్రకటన – ఎన్.కె. బాబు

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here