Site icon Sanchika

సంపాదకీయం జూన్ 2022

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి అభివందనాలు.

రచయితలను ప్రోత్సహించేందుకు మరో కథల పోటీ నిర్వాహించాలనీ, పాఠకులకు చేరేందుకు సంచిక రచనల లింక్‌లను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సంచిక నిర్ణయించింది.

ఉత్తమ కథా సంపుటాలకు, ఉత్తమ కవితా సంపుటాలకు, ఉత్తమ నవలలకు వార్షిక పురస్కారాలు అందజేయాలని తలుస్తోంది సంచిక. అలాగే సంచిక రచయితల పుస్తకావిష్కరణ సభలను కూడా నిర్వహించదలచింది.

ఇవే కాకుండా సంచికలో ప్రచురితమైన కథలు, కవితలతో సంపుటాలు వెలువరించనుంది.

రచయితల సమావేశాలు కొనసాగించేందుకు గాను – ప్రతీ నెలా ఆఫ్ లైన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతీ వారం జూమ్ ద్వారా ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో.

రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ ‘సంచిక’ ముందుకు సాగుతుంది. ఇందుకు, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తోంది.

~

ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ జూన్ 2022 సంచిక.

1 జూన్ 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక వ్యాసం:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version